Suryaa.co.in

Andhra Pradesh

జగన్‌ కేసులు ఇక రోజూ విచారణ!

– సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ

న్యూఢిల్లీ: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేసులకు సంబంధించి సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. జగన్‌ను కేసులను రోజు వారీ విచారణ చేపట్టాలని న్యాయస్థానం ఆదేశించింది. జగన్ కేసుల బదిలీకి నిరాకరించింది. తెలంగాణ హైకోర్టులో జగన్ అక్రమాస్తుల కేసు పర్యవేక్షణ నేపథ్యంలో వేరే రాష్ట్రానికి బదిలీ చేయాల్సిన అవసరం లేదని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేశారు. అలాగే జగన్ బెయిల్‌ను రద్దు చేయాలన్న పిటిషన్‌పై కూడా ప్రత్యేకంగా విచారణ అవసరం లేదని చెప్పింది.

గతంలో సుప్రీంకోర్టు ఎమ్మెల్యే, ఎంపీల కేసుల విషయంలో ఇచ్చిన తీర్పు ఈ కేసుకు కూడా వర్తిస్తుందని సుప్రీం ధర్మాసనం తేల్చిచెప్పింది. ట్రయల్ కోర్టు… రోజు వారీ విచారణకు తీసుకోవాలని, హైకోర్టు కూడా పర్యవేక్షణ చేయాలని అందువల్ల మరో రాష్ట్రానికి బదిలీ చేయాల్సిన అవసరం లేదని జస్టిస్ నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్ర మిశ్రా ధర్మాసనం తేల్చిచెప్పింది.

LEAVE A RESPONSE