Home » జగన్‌ది ప్రజా ప్రభుత్వం కాదు ఫేక్‌ ప్రభుత్వం

జగన్‌ది ప్రజా ప్రభుత్వం కాదు ఫేక్‌ ప్రభుత్వం

-ఇదే నరేంద్ర మోదీ సంకల్పం..
-అవినీతిపరులు జైలుకు వెళ్లాల్సిందే…
-నవరత్నాలు కాదు…నవ అరాచకాలు చేస్తున్నారు
-ముస్లిం రిజర్వేషన్ల రద్దుపై గోబెల్స్‌ దుష్ప్రచారం
-హిట్లర్‌ పోయే ముందు ఏంచేశాడో..
-జగన్‌ అదే చేస్తున్నాడు!
-విద్రోహ శక్తులకు శిక్ష తప్పదు
-జగన్‌ అండ్‌ కో కుతంత్రాలను వివరిస్తాం
-బీజేపీ మీడియా ఇన్‌చార్జ్‌ పాతూరి నాగభూషణం

విజయవాడ, మహానాడు: అవినీతిపరులు జైలుకు వెళ్లాల్సిందేనన్నది మోదీ సంకల్పమని..దానిని ఆచరణ లోకి తీసుకువస్తున్నారని బీజేపీ మీడియా ఇన్‌చార్జ్‌ పాతూరి నాగభూషణం అన్నా రు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో జగన్‌ నవరత్నాలు కాదు…నవ అరాచకాలు సృష్టిస్తున్నారని ధ్వజమె త్తారు. ఫేక్‌ ప్రభుత్వం నడుస్తోందని విమర్శించారు. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో జర్మనీ నియంత హిట్లర్‌ అబద్ధాలను ఎంతగా ప్రచారం చేశారో అంతకు పదింతలు గోబెల్స్‌ ప్రచారం చేశారని వ్యాఖ్యానించారు. ముస్లిం రిజర్వేషన్లు రద్దు అనే ఫేక్‌ ప్రకటన వచ్చింది. ఇంటిలిజెన్స్‌ బ్యూరో (గవర్నమెంట్‌ ఆఫ్‌ ఇండియా , న్యూఢల్లీ) లెటర్‌ హెడ్‌తో ఉందని, ఎక్కడైనా ఇటువంటి ప్రకటనలు ఇంటెలిజెన్స్‌ బ్యూరో చేస్తుందా..అని ప్రశ్నించారు.

ఇదే విషయాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి గారి పేరున ఒక లెటర్‌ హెడ్‌ సృష్టించి తప్పుడు సంతకాలు పెట్టి ప్రచారం చేశారు. హిట్లర్‌ ఆత్మహత్య చేసుకునే ముందు ఆఖరి ప్రయత్నంగా ఇటు వంటి అభూత కల్పనలు ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పడు ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ను ప్రజలు తరిమే క్షణాలు దగ్గర పడుతుండటంతో జగన్‌ హిట్లర్‌ను ఫాలో అవుతున్నాడని విమర్శించారు. ఆంధ్రా అంతటా కూటమి కమ్మే స్తుంది..ప్రజల దృష్టిని మళ్లించడానికి జగన్‌ అండ్‌ కో సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ ఇటువంటి కుతంత్రాలు పన్నుతారని తెలిపారు. పురందేశ్వరి పేర్లనే కాదు ఈటీవీ, ఈనాడు, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి లోగోలను కూడా అసత్య ప్రచారానికి ఆయుధాలుగా ఉపయోగిస్తున్నారని, ఈ విషయంపై ఎన్నికల కమిషన్‌, పోలీసు యంత్రాంగానికి ఫిర్యాదు చేసినట్లు వివరించారు. మీడియా పరంగా ప్రజలకు వాస్తవాలు తెలియజేసే ప్రయత్నంగా మీడియా ముందుకు వచ్చినట్లు చెప్పారు.

రాష్ట్రంలో తాగునీటి సమస్య, మద్యానికి కొరత లేదు
రాష్ట్రంలో నదుల్లో నీటి నిల్వలు లేవు..తాగునీటి సమస్య ఉంది. కానీ మద్యానికి కొరత లేదన్నారు. గంజాయి, డ్రగ్స్‌ గుట్టలు గుట్టలుగా మేట వేసుకుని పోయాయ ని విమర్శించారు. కులమత వర్గాలకు, ప్రాంతాలకు అతీతంగా రాష్ట్రం సర్వతో ముఖాభివృద్ధికి ఏకైక లక్ష్యంగా కూటమి అంకిత భావంతో పనిచేస్తుందని ఉద్ఘాటించారు. సమాఖ్య స్పూర్తిని, భారతీయ భావనను భంగపరిచే విద్రోహ శక్తులకు, వాటికి సహకరించే అధికారులకు శిక్షలు తప్పవని హెచ్చరించారు. అమాయకులైన యువతను ప్రలోభపెట్టి మత్తులో ముంచెత్తవద్దని వైసీపీ శ్రేణు లను హెచ్చరిస్తున్నామని పేర్కొన్నారు. ఎన్డీఏ కూటమి బలపడి ఓటు ట్రాన్స్‌ఫర్‌ అవుతుందనే భయంతో ఈ అరాచకాలను చేస్తున్నారని ధ్వజమెత్తారు. రైతులకు కాలువలు తవ్వి నీరు ఇవ్వలేని పరిస్థితిని జగన్‌ కల్పించారన్నారు. ప్రధానమంత్రి రాష్ట్ర పర్యటనకు వచ్చిన సందర్భంలో ఫైబర్‌ నెట్‌ మూడు గంటల పాటు సర్వర్‌ పనిచేయకుండా కుట్ర పన్నారని, జగన్‌కు ఉన్న భయమే దీనికి కారణమన్నారు. సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆర్‌.డి.విల్సన్‌, తరుణ్‌ కాకాని పాల్గొన్నారు.

Leave a Reply