Suryaa.co.in

Andhra Pradesh

వక్ఫ్ బోర్డు ఆస్తులను జగన్ ప్రభుత్వం కొల్లగొట్టింది

-మైనార్టీల పథకాలను రద్దు చేసిన ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి
-నంద్యాల కూటమి ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరి

మైనార్టీల పథకాలను రద్దు చేసిన ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని నంద్యాల కూటమి ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరి పిలుపునిచ్చారు. నిజం గెలవాలి యాత్రలో భాగంగా శనివారం నారా భువనేశ్వరి నంద్యాలలో పర్యటించారు. ఈ సందర్భంగా ముస్లీం మహిళలతో మాట్లామంతీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నారా భువనేశ్వరితో పాటు నంద్యాల ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరి, టీడీపీ ఎమ్మెల్యే పంచుమర్తి అనూరాధ పాల్గొన్నారు.

బైరెడ్డి శబరి మాట్లాడుతూ జగన్‌ ప్రభుత్వం మైనార్టీలకు సబ్‌ ప్లాన్‌ ఇవ్వలేదు.. రాజకీయాల్లో రిజర్వేషన్‌ను తగ్గించి మోసం చేశారని అన్నారు. నామినేటెడ్‌ పోస్టులను కూడా తగ్గించి అన్యాయం చేశారని విమర్శించారు. రాష్ట్రంలో ఉర్థూ యానివర్శిటీలు చంద్రబాబు తెచ్చినవేనని, ఆయన శంకుస్థాపన చేసిన ఉర్థూ యూనివర్శిటీలను వైసీపీ ప్రభుత్వం పూర్తిచేయకుండా పక్కన పెట్టిందన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వక్ఫ్‌ బోర్డు ఆస్తులను కబ్జా చేసి దోచుకున్నారని విమర్శించారు. దర్గాలకు సంబంధించిన భూములను రీసర్వే చేయించి డిజిటలైజ్‌ చేస్తామని చేయలేదు. మైనారిటీలకు స్థలాలు ఇచ్చి ఇళ్లు కట్టిస్తామని చెప్పి ఎవరూ పట్టించుకోలేదు. సీఏఏపై అవగాహన లేని వైసీపీ నాయకులు ఇష్టారీతిన మాట్లాడుతున్నారని వారికి ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.

ముస్లీంలపై దాడులకు సమాధానం చెప్పాలి: టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనూరాధ
రాష్ట్రంలో ముస్లీంలపై వేసీపీ నేతల వేధింపులు కొనసాగుతున్నాయి. మిస్బాను వైసీపీ నేతలు హింసించి ఆత్మహత్య చేసుకునేలా చేస్తే కనీసం వైసీపీ ప్రభుత్వం న్యాయం చేయలేదు. అబ్దుల్‌ సలాం కుటుంబాన్ని కక్షకట్టి వేధించి ఆత్మహత్య చేసుకునేలా చేశారు. పవిత్ర రంజాన్‌ మాసం సమయంలోనే ముస్లీంలను వేధించిన దుర్మార్గుడు జగన్మోహన్‌రెడ్డి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదేళ్ల పాలనలో మైనారిటీలకు ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా అమలు చేయలేదు…చంద్రబాబు అమలు చేసిన పథకా లను రద్దు చేశారన్నారు. మైనారిటీలపై జరిగిన దాడులు, వేధింపులకు జగన్మోహన్‌రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

LEAVE A RESPONSE