Suryaa.co.in

Andhra Pradesh

బీసీ నేతలపై జగన్ రాక్షస దాడులు

-బీసీల అణచివేతనే జగన్ అసలు లక్ష్యం
– బీసీలకు టిడిపి భరోసా
-జయహో బిసి సభలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్

జయహో బీసీ… బీసీ అంటేనే ఒక భరోసా, బీసీ అంటేనే ఒక బాధ్యత. బీసీ అంటే ఒక భవిష్యత్. బీసీలు బలహీన వర్గాలు కాదు..బలమైన వర్గాలని చేసి చూపించిన వ్యక్తి అన్న ఎన్టీఆర్ గారు.

ఆనాడు ఎంతో మంది బీసీ యువకులకు అవకాశం ఇచ్చి చిన్న వయస్సులోనే మంత్రులను చేసిన ఘనత అన్న ఎన్టీఆర్ గారిది. తర్వాత చంద్రబాబు గారు పెద్దఎత్తున బీసీ సోదరులను ప్రోత్సహించారు. అందుకే ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడు బీసీ సోదరులకు ఉప కులాల వారీగా సాధికార సమితులు ఏర్పాటుచేశాం. దానికి కన్వీనర్ ను ఏర్పాటుచేశాం.

ఉప కులాల వారీగా బీసీ సోదరులు ఎదుర్కొంటున్న సమస్యలు నేరుగా తెలుసుకునే లక్ష్యంతో సాధికార సమితిలు ఏర్పాటుచేశాం. ఉపకులాల వారీగా వచ్చే రోజుల్లో పెద్దఎత్తున యువ నాయకత్వాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో టీడీపీ ముందుకు వెళ్తోంది.

స్థానిక సంస్థల్లో 34శాతం రిజర్వేషన్ ఉందంటే అందుకు కారణం ఆ పసుపు జెండానే. బీసీల కోసం సబ్ ప్లాన్ ద్వారా రూ.36 వేల కోట్లు ఖర్చుపెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ.

బీసీ కార్పోరేషన్ కు రూ.3వేల కోట్ల నిధులు కేటాయించి 4.20 లక్షల మంది బీసీ సోదరులను పేదరికం నుంచి బయటకు తీసుకువచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆదరణ పథకం కింద వెయ్యి కోట్లు కేటాయించి పనిముట్లు అందించిన పార్టీ తెలుగుదేశం పార్టీ.

బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, స్కిల్ డెవలప్ మెంట్, స్టడీ సర్కిల్స్, విదేశీ విద్య లాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకువచ్చిన జెండా తెలుగుదేశం జెండా. చేనేత సోదరులకు, మత్స్యకారులకు, కల్లుగీత కార్మికులకు 50 ఏళ్లకే పెన్షన్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ.

ఆనాడు మన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కేంద్రంలో బీసీ సోదరుల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఉండాలని తీర్మానం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. కానీ ఈ సైకో జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయన తర్వాత బీసీ సోదరులను వెన్నుపోటు పొడిచారు. బీసీలు వెన్నెముక అని బీసీ సోదరుల వెన్నెముక విరగ్గొట్టారు.

స్థానికసంస్థల్లో 10 శాతం రిజర్వేషన్లు తగ్గించి 16వేల మంది బీసీలకు పదవులు దూరం చేశారు. 8వేల ఎకరాల బీసీ సోదరుల అసైన్డ్ భూములను వెనక్కు తీసుకున్న పార్టీ వైసీపీ. ఆదరణ పథకాన్ని రద్దు చేశారు. ఆనాడు ఆదరణ పథకం కింద పది శాతం డబ్బులు కడితే కనీసం ఆ డబ్బులు కూడా తిరిగి ఇచ్చే పరిస్థితి లేదు.

బీసీ కార్పోరేషన్లలో నిధులు లేవు. 56 కార్పోరేషన్లు ఏర్పాటుచేశామని గొప్పలు చెప్పుకుంటున్న వ్యక్తులు.. ఏకంగా కార్పోరేషన్ ఛైర్మన్లకు కనీసం కుర్చీలు కూడా ఏర్పాటుచేయలేదు.

75వేల కోట్ల బీసీ సబ్ ప్లాన్ నిధులు దారిమళ్లించారు. మా మత్స్యకార సోదరులను మోసం చేసి జీవో 217 తీసుకువచ్చారు. ఆప్కాబ్ ను నిర్వీర్యం చేశారు.300 మంది బీసీలను చంపేశారు. 26వేల మంది బీసీలపై దొంగ కేసులు పెట్టి జైలుకు పంపారు.

యనమల గారు పెళ్లికి వెళితే ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టారు. అయ్యన్నపాత్రుడు గారిపై ఏకంగా రేప్ కేసు పెట్టారు. కొల్లు రవీంద్ర, అచ్చెన్నాయుడు గారిపై అనేక కేసులు పెట్టారు. నంద్యాల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా రాజశేఖర్ గారిని నియమిస్తే.. ఆయనపైనా రెండు రోజుల క్రితం రౌడ్ షీట్ ఓపెన్ చేశారు.

మీరు పెట్టే ఎఫ్ఐఆర్ లు మడిచి ఎక్కడ పెట్టుకుంటారో పెట్టుకోండి.. రెండు నెలల్లో మా ప్రభుత్వం వస్తుంది. రెడ్ బుక్ లో ఉన్న ప్రతి వ్యక్తిపై చర్యలు తీసుకుంటాం.

వైసీపీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు ఏం మాట్లాడుతున్నారో చూస్తున్నాం. వైసీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి వైకాపాలో బీసీలకు న్యాయం జరగట్లేదని చెప్పారు.

పద్మశాలి వర్గానికి చెందిన ఆ పార్టీ ఎంపీ సంజీవ్ కుమార్ వైకాపాలో బీసీల గొంతు నొక్కేస్తున్నారని చెప్పారు. పార్థసారథికి కనీసం అపాయింట్ మెంట్ కూడా ఇచ్చే పరిస్థితి లేదంటే బీసీలంటే ఎంత చిన్నచూపో మనం ఆలోచించాలి.

తెలుగుదేశం పార్టీలో బీసీ సోదరులను ప్రోత్సహించాం. ఆనాడు ఆర్థిక మంత్రిగా యనమల, కేంద్రంలో ఎర్రన్నాయుడు రెండుసార్లు మంత్రిగా పనిచేశారు. అనేక మంది బీసీ నాయకులను మంత్రులను చేశాం.

టీటీడీ ఛైర్మన్, తుడా ఛైర్మన్ గా బీసీలను ప్రోత్సహించిన పార్టీ తెలుగుదేశం. ఈరోజు ఆ పదవుల్లో ఎవరు కూర్చొన్నారో మనం ఒక్కసారి చూడాలి.

పదో తరగతి చదువుతున్న అమర్ నాథ్ గౌడ్ ను కిరాతకంగా చంపేశారు వైకాపా నాయకులు. వాళ్ల అక్కను వేధిస్తున్న వారికి వ్యతిరేకంగా మాట్లాడటమే అమర్ నాథ్ చేసిన తప్పు.

ఏకంగా కొట్టి, అతడి పుస్తకాలను చింపి, నోట్లో కుక్కి, కాళ్లు చేతులు కట్టేసి, పెట్రోల్ పోసి తగులబెట్టారు ఈ వైకాపా నాయకులు.

ఆ చెల్లెమ్మను చదివిస్తోంది నా తల్లి భువనేశ్వరమ్మ. అది బీసీలపై టీడీపీకి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం. టీడీపీకి చెందిన నాయకులు నందం సుబ్బయ్య, చంద్రయ్య, జల్లయ్యను ఎలా కొట్టి చంపారో చూశాం. వారి అంత్యక్రియలకు మన నాయకులు చంద్రబాబు వెళ్లారు.

విజయనగరంలో కృష్ణా మాస్టార్ గారిని బొలేరోతో గుద్ది చంపారు. ఇనుప రాడ్లతో కొట్టారు. ధర్మవరంలో పద్మశాలి సోదరులు నేసిన బట్టలను విజయవాడలో వైకాపా నేతలకు అమ్మారు.

బాకీ డబ్బు చెల్లించాలిన పద్మశాలీ సోదరులు వెళ్లి వైకాపా నాయకులను అడిగితే.. వారి బట్టలు విప్పి కింద కూర్చోబెట్టి, వీడియోలు తీసి, బయటకు వదిలేసే పరిస్థితి.

నా పాదయాత్రలో శ్రీకాళహస్తి నియోజకవర్గంలో రజక సామాజికవర్గానికి చెందిన మునిరాజమ్మ నన్ను కలిసి సమస్యలు చెప్పుకుంది.

అక్కడున్న బడా చోర్ బియ్యపు మధుసూదన్ రెడ్డి ఎదవ పనులు ఎండగట్టింది. దీంతో వైకాపా నేతలు వెళ్లి ఆమె షాపును ధ్వంసం చేసి ఇబ్బంది పెట్టారు.

ఆ అమ్మకు అన్న నిలబడ్డ వ్యక్తి చంద్రబాబు. ఆయన ప్రోత్సాహంతో ఆమె మళ్లీ షాప్ పెట్టుకుంది. జగన్ రెడ్డి ఇచ్చే గౌరవం ఎలాంటిదో వారిపై జరిగిన వరుసదాడులను బట్టి తెలుసుకోవచ్చు. పాదయాత్రలో బీసీ సోదరులు ఎదుర్కొంటున్న సమస్యలు నేరుగా తెలుసుకున్నా.

ఆదరణ పథకం కింద రజక సోదరులకు వాషింగ్ మెషిన్లు ఇస్తే నేడు పక్కన పెట్టారు. కరెంట్ ఛార్జీల వల్ల వాటిని వినియోగించుకోలేని పరిస్థితి. కల్లుగీత కార్మికులకు పనిముట్లు ఇవ్వడం లేదు. ఏకంగా ఎక్సైజ్ అధికారులు వచ్చి ఇబ్బందులు పెడుతున్నారు. రియల్ ఎస్టేట్ డెవలప్ మెంట్ వల్ల చెట్లు కొట్టేస్తున్నారు.

చేనేతలకు ఆనాడు ఉచితంగా కరెంట్ అందజేశాం. సబ్సీడీ ద్వారా అనేక పరికరాలు అందజేశాం. 50శాతం సబ్సీడీతో మగ్గాలు, కలర్ సబ్సీడీ ఇచ్చాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవన్నీ రద్దు చేశారు.

యాదవ సోదరులను ప్రోత్సహించేందుకు గొర్రెలు, మేకల కోసం డబ్బులు ఇచ్చాం. మినీ గోకులాలు కట్టాం, బంజరు భూములను కూడా ఇచ్చాం. ఈ రోజు గోపాలమిత్రలను మెడపట్టుకుని బయటకు గెంటేశారు.

మత్స్యకార సోదరులకు గతంలో సబ్సీడీ ద్వారా వలలు అందజేశాం, బోట్లు ఇచ్చాం, ఐస్ బాక్స్ లు, మోపెడ్ లు అందజేశాం. నేడు వారిని కూడా మెడపట్టుకుని గెంటేశారు.

బీసీ సోదరులు ఎదుర్కొంటున్న సమస్యలను పాదయాత్ర ద్వారా తెలుసుకున్నా. ఆ నివేదికను వేదికపై ఉన్న పెద్దలకు అందజేశాం.

చంద్రబాబునాయుడు బీసీ డిక్లరేషన్ ద్వారా ఆయా సమస్యలను పరిష్కరిస్తారు. 2019లో నేను పోటీచేయాలనుకున్నప్పుడు చంద్రబాబునాయుడు నన్ను ఎక్కడ పోటీచేస్తారని అడిగారు. ఎప్పుడూ గెలవని నియోజకవర్గం ఇస్తే గెలిచి చూపిస్తానని మంగళగిరి తీసుకున్నా.

21 రోజుల ముందు మంగళగిరి అభ్యర్థిగా వచ్చా. స్వల్ప మెజార్టీతో ఓడిపోయాను. గత నాలుగేళ్ల 10 నెలలుగా మంగళగిరి నియోజకవర్గ ప్రజలను నమ్ముకుని ఎప్పుడూ లేనివిధంగా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం.

ఏపీలో ఎక్కడా జరగని విధంగా 29 సంక్షేమ కార్యక్రమాలు మన నియోజకవర్గంలో చేశాం.నాకు అండగా నిలబడిన మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు నేను శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా.

మంగళగిరి ప్రజల తరపున చంద్రబాబునాయుడును కొన్ని హామీలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నా.మొదటిది కొండ పోరంబోకు, ఫారెస్ట్ భూముల్లో, ఇరిగేషన్, ఎండోమెండ్, రైల్వే భూముల్లో దశాబ్దాలుగా ప్రజలు ఇళ్లు కట్టుకొని మూడుతరాలుగా నివసిస్తున్నారు. రెగ్యులరైజ్ చేయాల్సిన బాధ్యత మనపై ఉంది.

మంగళగిరి నియోజకవర్గంలో ఉన్న నిరుపేద కుటుంబాల కోసం 20వేల ఇళ్లు కట్టించాల్సిన బాధ్యత మనపై ఉంది.పద్మశాలీలు అంటే చేనేతలు అనుకుంటాం. కానీ మంగళగిరిలో స్వర్ణకారులుగా ఉన్నారు. వారిని ఆదుకునేందుకు ప్రత్యేక కార్పోరేషన్ ఏర్పాటుచేయాలని పెద్దలను కోరుతున్నా.

పెద్దల ఆదేశాల మేరకు మంగళగిరిలో మేం ఒక పైలెట్ ప్రాజెక్టు చేపట్టాం. టాటా సంస్థతో ఒప్పందం చేసుకుని చేనేతల ఆదాయం రెట్టింపు చేశాం. ఆ కాన్సెప్ట్ ను రాష్ట్రవ్యాప్తంగా తీసుకెళ్లాలి.

అమరావతి మాస్టర్ ప్లాన్ లో ఇక్కడి రైతుల భూములను యూ-1 జోన్ లో పెట్టడం జరిగింది. దీనివల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దానిని కూడా రద్దుచేయాలని కోరుతున్నాం.

చంద్రబాబు, పవనన్నకు ఒక్కటే హామీ ఇస్తున్నా.. ఏ బాధ్యత అయితే నాపై పెట్టారో, మంగళగిరి అభ్యర్థిగా నాకు టికెట్ ప్రకటించారో వారి నమ్మకాన్ని నిలబెడతా.

ఏ మెజార్టీతో అయితే నేను ఓడిపోయానో దాని పక్కన ఒక సున్నా పెట్టి 53వేల మెజార్టీతో గెలిచి ఈ సీటును మీకు అప్పగిస్తా. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్యకర్తలపై అనేక కేసులు పెట్టారు.

యాదవ సామాజికవర్గానికి చెందిన మన నాయకుడిని చంపేశారు. రౌడీషీట్లు ఓపెన్ చేశారు. కరకట్ట కమల్ హాసన్ మళ్లీ వచ్చాడు. ప్రజలను మాయ చేయడానికి మళ్లీ వచ్చాడు. రెండు నెలల తర్వాత వడ్డీతో సహా చెల్లిస్తాం.

గత నాలుగేళ్ల 10 నెలలుగా మమ్మల్ని అణగదొక్కారు. ఇబ్బందిపెట్టారు. హామీలు నిలబెట్టుకోలేదు. నేను ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసిన మొదటి క్షణం నుంచే హామీలు నిలబెట్టుకుంటా.

LEAVE A RESPONSE