జగన్ జీవితమంతా అబద్దాలు, అసత్యాలు తప్పుడు ప్రచారాలే

-అబద్దం – సాక్షి మీడియా కవలలు
-ఈ గ్లోబెల్ లో గోబెల్స్ ప్రచారం చేసే ఏకైక వార్తా పత్రిక సాక్షి
-ఫ్యాక్టరీల నుంచి వెలువడే కాలుష్యం కంటే సాక్షి మీడియా నుంచి వెలువడే కాలుష్యంతోనే ప్రజలకు ఎక్కువ ప్రమాదం
– తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు

సాక్షి పత్రిక నిత్యం విషం చిమ్ముతూ విపరీత పోకడలకు పోతోంది. శాసన సభలో లేని వ్యక్తులు ఉన్నట్టుగా జరగనిది జరిగినట్టుగా అసత్యాలు ప్రచురిస్తూ చట్ట సభల ప్రతిష్టను మంటగలుపుతోంది. ఫ్యాక్టరీల నుంచి వచ్చే కాలుష్యం కంటే సాక్షి మీడియా నుంచి వెలువడే కాలుష్యంతోనే ప్రజలకు ఎక్కువ ప్రమాదకరం. వైసీపీ స్ధాపనతో రాజకీయాల్లో నైతిక విలువలు, సాక్షి స్ధాపనతో పత్రికా విలువలు మంట కలిశాయి.

దళిత ఎమ్మెల్యే బాలవీరాంజనేయస్వామిపై వైసీపీ ఎమ్మెల్యేలు దాడి చేసి అసెంబ్లీ ప్రతిష్ట మంటగలపడమే కాక, సిగ్గులేకుండా తమపై టీడీపీ ఎమ్మెల్యేలు దాడి చేసి తప్పుడు ప్రచారం చేసి ప్రజల్లో అభాసు పాలయ్యారు. టీడీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ పై దాడికి యత్నిస్తున్నారంటూ…19.03.2023 నాటి ఫోటోను నిన్న సాక్షి పత్రికలో ప్రచురించటం సిగ్గుమాలిన చర్య. ఇది పత్రికా విలువల్ని మంటగలపడమే.

గతంలో పట్టాభి విషయంలో ఈనాడు పత్రికలో పొరపాటున పాత ఫోటో ప్రచురితమైతే నానా రాద్దాంతం చేసిన సీఎం జగన్, వైసీపీ నేతలు దీనికి ఏం సమాధానం చెబుతారు? రామోజీరావును మోకాళ్ల మీద కూర్చోబెట్టాలంటూ కారుకూతలు కూసిన మంత్రులు నేడు ఎందుకు నోరు మెదపటం లేదు? సాక్షిలో ప్రచురించిన తప్పుడు ఫోటోకు బాధ్యులెవరు? సీఎం జగన్ ? లేక ఆయన సతీమణి భారతిరెడ్డినా? ఎవర్ని మోకాళ్ల మీద కూర్చోబెట్టాలో వైసీపీ మంత్రులు చెప్పాలి. శానస సభలోని ఘటనలపై మార్పింగ్ ఫోటోలతో తప్పుడు కధనాలు ప్రచారం చేస్తుంటే స్పీకర్ ఎందుకు స్పందించటం లేదు? భారతి రెడ్డిపై చర్యలు తీసుకోవడానికి ఎందుకు వెనుకాడుతున్నారు? చట్ట సభలను అగౌరవపరిచే వారిని వెనకేసువస్తారా?

సీఎం జగన్ ప్రత్యర్థి పార్టీల మీద దుమ్మెత్తి పొయ్యడానికి, అసత్యాలు,అర్ధసత్యాలు ప్రచారం చెయ్యడానికి, ప్రత్యర్థుల పరువు ప్రతిష్టలు దిగజార్చడానికి మీడియాని ఒక ముసుగుగా వాడుకొంటున్నారు. ఈ గ్లోబెల్ లో గోబెల్స్ ప్రచారం చేసే ఏకైక వార్తా పత్రిక సాక్షి. సాక్షి ప్రతికలో వచ్చే కమర్సియల్ యాడ్స్ తప్ప అందులో ఏమీ నిజం ఉండదు.

సాక్షి ప్రతిరోజూ వార్తల కంటే అబద్దాల్నే ఎక్కువ ప్రసారం చేస్తోంది. జగన్ తన స్వార్దం కోసం అసత్య ప్రచారాలతో రాష్ట్ర ప్రయోజనాలను, ప్రజల భవిష్యత్ ను బలిపెడుతూ, వ్యక్తుల వ్యక్తిత్వాన్ని దిగజారుస్తున్న విషయాన్ని ప్రజలు గుర్తించాలి. ఈ ధోరణి అరికట్టకపోతే ప్రజాస్వామ్య వ్యవస్థకే పెనుముప్పు ఏర్పడుతుంది.

Leave a Reply