Suryaa.co.in

Sports

స్వయంకృషి, పట్టుదలతో ఐసీసీ చైర్మన్ అయిన జే షా!

నిరుపేద కుటుంబంలో పుట్టిన జేషా, తిండి తిప్పలకోసం అష్ట కష్టాలు పడ్డారు. పలుకుబడి కలిగిన వారెవరితోనూ సంబంధం లేని వారు. అయినప్పటికీ అతని పూర్తి కృషి మరియు క్రికెట్ పట్ల మక్కువతో భారత క్రికెట్‌లోకి ప్రవేశించారు. అతని అద్భుతమైన సంస్థాగత నైపుణ్యాలతో, అనతికాలంలోనే బీసీసీఐ కార్యదర్శిగా నియమించబడ్డారు. ప్రపంచం అతని ప్రతిభను చూసి అతడిని చైర్మన్‌ పదవిని చేపట్టమని క్రికెట్ ప్రపంచం మొత్తం,ఏకగ్రీవంగా కోరింది.బంధుప్రీతి ద్వారా నిచ్చెనలు ఎక్కుదామనుకున్న వారికి, ఈయన ఎన్నిక ఒక గట్టి చెంపదెబ్బ ఎందుకంటే ఈ వ్యక్తి ఎటువంటి మద్దతు లేకుండా తన గుర్తింపును సాధించారు. జై షా సార్! స్వయంకృషితో పైకొద్దామనుకున్న వారికి మీరు ఒక స్ఫూర్తి! భారత రత్నను కూడా స్వయంకృషితో సొంతం చేసుకోండి!!

– రవీంద్ర తీగల

LEAVE A RESPONSE