హాల్‌మార్క్ హైకీలో విరాట్ కొహ్లీ హ‌ల్‌చ‌ల్

భార‌త క్రికెట్ దిగ్గ‌జం విరాట్ కొహ్లీ గురువారం మ‌ణికొండ‌లో హ‌ల్చ‌ల్ చేశారు. పైపులైను రోడ్డులో గ‌ల హాల్‌మార్క్ హ‌బ్‌లోని హైకీ ఫిట్‌నెస్ స్టూడియోకి విచ్చేశారు. అత్యాధునికంగా డిజైన్ చేసిన ఈ జిమ్‌లో దాదాపు రెండు గంట‌ల సేపు ఉన్నారు. ఓ సంస్థ వ్యాపార ప్ర‌క‌ట‌నను ఇక్క‌డే షూట్ చేశారు. షూట్ ముగిసిన త‌ర్వాత హైకీ ఫిట్‌నెస్ స్టూడియోని ఆరంభించిన యంగ్ ఎంట‌ర్‌ప్రెన్యూర్ మ‌నీషాతో ముచ్చ‌టిస్తూ.. హైకీ జిమ్‌ను ప్ర‌శంసించారు. విరాట్ కొహ్లీ మ‌ణికొండ‌కు విచ్చేశార‌నే వార్త‌ను ప్ర‌సార మాధ్య‌మాల ద్వారా తెలుసుకున్న అభిమానులు.. హాల్‌మార్క్ హ‌బ్ ప్రాంతానికి చేరుకున్నారు. దీంతో, ఆ ప్రాంత‌మంతా కిక్కిరిసిపోయింది.

Leave a Reply