– అశోక్ బాబు చదివింది ఇంటర్.. ఫోర్జరీ సర్టిఫికేట్ పెట్టింది బీ.కామ్
– ప్రత్యేక హోదాను ముంచిన వ్యక్తి బాబు.. సజీవంగా ఉంచిన నాయకుడు జగన్
– వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, రాష్ట్ర అధికార ప్రతినిధి జోగి రమేష్
తప్పు చేసిన వారిని చట్టప్రకారం అరెస్టు చేస్తే..కక్షసాధింపు ఎలా అవుతుంది..?
చంద్రబాబు నాయుడు.. తన 420 పార్టీ నాయకులతో కలిసి… 420 అశోక్ బాబు ఇంటికి వెళ్లి ప్రభుత్వంపై రుబాబు చేస్తున్నాడు, బెదిరిస్తున్నాడు, హూంకరిస్తున్నాడు. రాష్ట్ర ప్రజలకు సంబంధించిన అంశాల మీదనో, లేక ప్రభుత్వానికి పనికివచ్చే సలహాలు, సూచనలు ఇచ్చే విషయంలోనా అంటే కాదు. ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి, ఎన్జీవో నాయకుడిగా ఉంటూ, ప్రభుత్వాన్ని, ప్రజలను చీట్ చేసిన టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు ను పరామర్శించడానికి వెళ్ళి మాపై రుబాబు చేస్తున్నాడు, హెచ్చరికలు చేస్తున్నాడు.
అశోక్ బాబు ఎమ్మెల్సీగా, అంతకు ముందు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్న క్రమంలో, ఆయన తప్పుడు సర్టిఫికెట్తో పదోన్నతలు పొందాడని, ఆ శాఖలో పనిచేస్తున్న సహ ఉద్యోగి ఫిర్యాదు చేస్తే.. దానిపై లోకాయుక్త విచారించి, సమగ్రమైన విచారణకు సీఐడీ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తే, చట్టప్రకారం అరెస్టు చేసి, కోర్టుకు హాజరుపరిస్తే… ఇదేదో కక్షసాధింపు అని చంద్రబాబు అండ్ కో మాట్లాడుతుంది.
అశోక్ బాబు చదవింది ఇంటర్మీడియెట్ అని, ఆయన ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించి, ఉస్మానియా యూనివర్శిటీలో బీకామ్ డిగ్రీ చదివానని దొంగ సర్టిఫికెట్ సమర్పించారని, నిర్థారణ అయిన తర్వాతే ఆయనను అరెస్ట్ చేశారు. కోర్టులో హాజరు పరిచారు, న్యాయస్థానం బెయిల్ ఇచ్చింది. ఇదంతా సాధారణ క్రమంలో జరిగే పరిణామాలే.
దీనిపై నారా చంద్రబాబు నాయుడు అండ్ కో.. రాజకీయం చేస్తుంది. నిన్నటి నుంచి ప్రభుత్వంపై విమర్శలు చేస్తోంది. 420 పనిచేసిన అశోక్ బాబును రాష్ట్ర ప్రజలుగానీ, ప్రభుత్వ ఉద్యోగస్తులుగానీ, మేధావులుగానీ, పాత్రికేయ మిత్రులుగానీ ఎలా సమర్థిస్తారని అడుగుతున్నాం. చేసిందేమో వెధవ పని, తప్పుడు పని. 420కన్నా ఘోరమైన పని. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి మీడియా ముందుకు వచ్చి రంకెలు వేస్తారా..?
జగన్ సంక్షేమాన్ని చూసి చంద్రబాబుకు నిద్రపట్టదు.
చంద్రబాబు మాట్లాడే మాటలు, రేపు, ఎల్లుండి అని వార్నింగ్ లు ఇవ్వడం చూస్తుంటే… ఆయనకేమైనా మతిభ్రమించి మాట్లాడుతున్నాడా అనిపిస్తుంది. ప్రభుత్వం గుండెల్లో నిద్ర పోతానని చంద్రబాబు చెబుతున్నారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు కలలో కూడా ఊహించని మంచి పనులన్నీ, కేవలం రెండున్నర సంవత్సరాలలోనే జగన్ మోహన్ రెడ్డి అమలు చేస్తుంటే.. ఆయనకు ఇక నిద్ర ఎక్కడ పడుతుంది. బాబుకు నిద్ర పట్టదు, నిద్రపోలేడు, పోడు కూడా. 14 ఏళ్లు అధికారంలో ఉండి కూడా తాను చేయలేకపోయాననే బాధ బాబును వెంటాడుతుంది. దమ్మున్న ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి తక్కువ సమయంలోనే ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారేంటి? జగన్ ఇన్ని కోట్ల మంది ప్రజల చేత శెభాష్ అనిపించుకుంటున్నారని చంద్రబాబుకు నిద్రపట్టదు.
ముఖ్యమంత్రి దాదాపు 45లక్షలమంది అక్కచెల్లెమ్మలకు అమ్మ ఒడి పథకం ద్వారా పిల్లల చదువుల కోసం డైరెక్ట్‌గా డబ్బులు జమ చేస్తున్నారు. అలానే 52లక్షల మంది రైతులకు నేరుగా రైతు భరోసా అందిస్తున్నారు. దాదాపు 26లక్షల మందికి బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీ అక్కచెల్లెమ్మలకు చేయూతనిస్తున్నారు. 31లక్షల మంది అక్కచెల్లెమ్మలకు, వారి పేరుమీదనే నేరుగా ఇళ్లస్థలాలు ఇస్తున్నారు. ఇవన్నీ చూసిన చంద్రబాబుకు నిద్ర పట్టడం లేదు. చంద్రబాబు ఎవరి గుండెల్లో నిద్రపోలేరు, ఎక్కడ నిద్రపోతారు, ఆయన నిద్రపోరు. జగన్ మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాల అమలు చూసి నారా చంద్రబాబు నాయుడుకు నిద్రపట్టదు.
టీడీపీ నాయకులు వాడే భాష ఘోరంగా ఉంది
తప్పు చేస్తే అరెస్ట్ చేయడం తప్పా అని అడుగుతున్నాం? అశోక్ బాబు అరెస్ట్ కు సంబంధించి నిన్నటి నుంచి టీడీపీ వాళ్లు మాట్లాడే భాష ఘోరాతిఘోరంగా ఉంది. ఈ అరెస్ట్‌తో ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి సంబంధం ఏంటి? దొంగ సర్టిఫికెట్లతో అశోక్ బాబు మోసం చేస్తే, అది బయటపడితే ఆయనను అరెస్ట్ చేస్తే తప్పా అని అడుగుతున్నాం. మోసగాళ్ళ గ్యాంగ్‌కు నాయకుడు అయిన చంద్రబాబుకు అది తప్పుగా కనిపించటంలేదేమో. 420 అనే పదానికి చంద్రబాబు ఏమాత్రం తీసిపోరు. ఎన్టీ రామారావు పెట్టిన పార్టీని లాక్కుని, ఆయనను మానసికంగా క్షోభపెట్టి, ఎన్టీఆర్ మరణానికి చంద్రబాబు కారణం కాదా అని అడుగుతున్నాం? అందుకే వెన్నుపోటుదారుడు, దుర్మార్ముడు అయిన చంద్రబాబును రాష్ట్ర ప్రజలు చిత్తుచిత్తుగా ఓడించారు.
బాబు బెదిరింపులకు ఎవరూ బెదరరు
చంద్రబాబు హూంకరించినంత మాత్రనా ఇక్కడ ఎవరూ బెదిరిపోరు. ధీశాలి అయిన జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో పని చేస్తున్న నాయకులు కొదమ సింహాల్లా పోరాడతారు. బాబు లాంటి వ్యక్తికి బెదిరే ప్రసక్తే లేదు. టీడీపీ నాయకులు చాలా నీచాతినీచంగా మాట్లాడుతున్నారు? ఏదో పీకుతాం అంటున్నారే… మిమ్మల్ని, మీ నాయకుడు చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రి పీఠం నుంచే ప్రజలు పీకిపారేశారు కదా? ఇంకేమీ పీకాలి?
కావాలంటే మీ పార్టీలో మీరే ఒకరికొకరు ఆ పని చేసుకోండి, మాకేమీ అభ్యంతరం లేదు. కాలగర్భంలో కలిసిపోయిన మీరు, మీ పార్టీ వారా మమ్మల్ని విమర్శించేది?. చేతనైతే, ప్రజలకు ఉపయోగపడే అంశాలపై మాట్లాడండి, వాటిపై మాతో పోట్లాడండి. ఇప్పుడు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు మరింతమందికి అమలు చేయాలని మా ముఖ్యమంత్ర తో మాట్లాడండి, పోట్లాడండి.
వైఎస్ఆర్సీపీ నేతలను ఎంతమందిని పొట్టనపెట్టుకున్నారు బాబూ..?
రాష్ట్రంలో ప్రతిపక్షం పనికిరాని పక్షంగా మారిపోయి, 420వాళ్లను వెనకేసుకువచ్చి మీడియా ముందు హూంకరించినంత మాత్రాన, రుబాబు, దౌర్జన్యం చేస్తే.. వాటిని టీవీల్లో చూసిన ప్రజలు మిమ్మల్నే అసహ్యించుకుంటున్నారు. టీడీపీని ఏపీనుంచి కూడా తరిమే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. అధికారంలోకి వచ్చాక అందర్ని గుర్తుపెట్టుకుంటామంటూ చంద్రబాబు కలలు కంటున్నట్లు ఉన్నారు.
2014లో మీరు అధికారంలో ఉన్నప్పుడు మా పార్టీవాళ్లను వందలమందిని పొట్టనపెట్టుకున్నారు. మా నాయకుడు, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిగారు అలాంటి పనులు ఎప్పటికీ చేయరు. మనసున్న మంచివాడు ముఖ్యమంత్రి జగన్ గారు. కక్షలు, కార్పణ్యాలకు మేం దూరం. మీరు చేసిన అవినీతి, అక్రమాల వల్లే మీరు జైలుకు వెళుతున్నారు. మీ హయాంలో కార్మికశాఖ మంత్రిగా ఉన్నప్పుడు వందల కోట్లు దోచుకుతిన్న అచ్చెన్నాయుడును వెనకేసుకు వస్తారా? బీసీ నాయకుడిని హత్య చేయించి, జైలుకు వెళ్ళిన కొల్లు రవీంద్రను వెనకేసుకొస్తారా..?. వాటితో మాకేంటి సంబంధం. తప్పులు చేస్తే చట్టాలు, అరెస్ట్లులు, కోర్టులు ఉండవా? మీరు చేసిన అవినీతిని, హత్యల్ని చూస్తూ ఊరుకుంటారా?
మీరు ఏడ్చి, పెడబొబ్బలు పెట్టినా.. మరో 25ఏళ్ళపాటు ముఖ్యమంత్రి జగన్
జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఎవరిమీద కక్షసాధింపు చర్యలు చేపట్టలేదు. రాష్ట్రంలో శాంతిభద్రతలు సజావుగా ఉంటే చంద్రబాబు నాయుడు చూసి ఓర్వలేక ఒకటే ఏడుపులు, పెడబొబ్బలు పెడుతున్నాడు. మీరు ఎంత ఏడ్చినా, పెడబొబ్బలు పెట్టినా, 25ఏళ్ల పాటు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి ఉంటారు. దాన్ని రాసిపెట్టుకోండి చంద్రబాబు నాయుడు అని చెబుతున్నాం. మీరు అధికారంలో లేకపోతే.. రాష్ట్రం అథోగతి పాలైందని,అప్పులు పాలైందని రోజూ మీడియా ముందుకు వచ్చి కేకలు ఆక్రోశం వెళ్ళగక్కుతున్న చంద్రబాబు.. తన పాలనలో ఏం చేశారో చెప్పాలి. మీరు, మీ అనుయాయులు పప్పుబెల్లాలుగా పంచుకుతిన్నది వాస్తవం కాదా. అదే మా ముఖ్యమంత్రి ప్రతి పైసాను బటన్ నొక్కగానే నేరుగా అర్హులైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బడుగు, బలహీన వర్గాలకు చెందిన అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి జమ అవుతున్నాయి. సంక్షేమ పథకాల అమలు ద్వారా కోట్ల మంది అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు చేరుతున్నాయి. ఈరోజు రాష్ట్రంలో ప్రతి కుటుంబం అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోంది.
పెట్టుబడి అంతా ఒక చోట పెడితేనే అభివృద్ధి అనుకోవడం సరికాదు. అమరావతిలో మాత్రమే పెట్టుబడి పెడితే.. అది అభివృద్ధి కాదు. నావాళ్లు, నా సామాజిక వర్గం మాత్రమే బాగుపడాలి, మిగతా వాళ్ళు ఏమైనా పరవాలేదనుకునే వ్యక్తి చంద్రబాబు. మరోవైపు సామాజిక న్యాయం కోసం, సమసమాజ స్థాపన కోసం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి.
జగన్ పోరాట పటిమ వల్లే సాధ్యమైంది
– ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అని చంద్రబాబు చెబితే… ఆ ముగిసిన అధ్యాయాన్ని తిరిగి తెరిపించి, సజీవంగా నిలబెట్టిన దమ్మున్న నాయకుడు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మా జగన్. జగన్ మోహన్ రెడ్డి చేసిన పోరాటాలు, ప్రధాని మోదీతో జరిగిన చర్చల నేపథ్యంలోనే, రాష్ట్ర విభజన వల్ల ఆంధ్రప్రదేశ్ నష్టపోయిందని పార్లమెంట్ సాక్షిగా ప్రధాని చెప్పే పరిస్థితి వచ్చింది. కేంద్ర హోంశాఖ ద్వారా ప్రత్యేక హోదాను కమిటీలో చేర్చి, దాన్ని కూడా చర్చించేలా చేశారు. ఇది రాష్ట్రంలోని అయిదు కోట్లమంది ప్రజల విజయం. జగన్ మోహన్ రెడ్డి పోరాడే సత్తా, పోరాట పటిమ వల్లే సాధ్యం అయింది. ఎవర్ని అయినా మెప్పించే సత్తా, అవసరం అయితే మెడలు వంచే సత్తా ఆయనకు ఉంది. ప్రత్యేక హోదా అంశం మరుగున పడనియ్యం. దీనికి, నిండు మనసుతో ఏపీ ప్రజలంతా జగన్ ని ఆశీర్వదించాల్సిన అవసరం ఉంది. ఇందుకు ముఖ్యమంత్రిని హృదయపూర్వకంగా అభినందించాలి.
మరోవైపు కేంద్ర కమిటీ ద్వారా తెర మీదకు వచ్చిన ప్రత్యేక హోదా అంశాన్ని మరుగున పరచడం కోసమే చంద్రబాబు అండ్ కో ఈ 420 వేషాలు. 420 అశోక్ బాబు గురించి రాష్ట్ర ప్రజలకు అవసరమా అని అడుగుతున్నాం. రోడ్లు మీదకు వచ్చి నిరసనలు, పోలీస్ స్టేషన్ల దగ్గరకు వెళ్లి చిందులు వేస్తే ప్రజలే మిమ్మల్ని రాబోయే రోజుల్లో మరింతగా తాట తీస్తారు. చంద్రబాబు నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది.
తెలుగుదేశం పార్టీ పుట్టి మునిగింది. ప్రజా క్షేత్రంలో లేకుండా, నోటితోనే రాజకీయాలు చేయాలంటే, మిమ్మల్ని పనికిమాలిన ప్రతిపక్షంగా ప్రజలు పట్టించుకోరు. రాబోయే రోజుల్లో ప్రజలు పిచ్చికుక్కలను కొట్టినట్లు కొట్టి మిమ్మల్ని కూడా తరుముతారు. చంద్రబాబు ఇప్పటికైనా ఒళ్లు,నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరిస్తున్నాం.