కాకాణి మినిస్టర్ ఫర్ అగ్రికల్చర్ కానేకాదు.. మినిస్టర్ ఫర్ మనీ కల్చర్

-సాయంత్రమైతే దోచుకున్న క్యాష్ అంతా లెక్క పెట్టుకోవడానికే కాకాణికి సమయం సరిపోవడం లేదు
-వైసీపీ ప్రభుత్వంలో నాసిరక పనుల కారణంగా సర్వేపల్లి రిజర్వాయర్ పరిస్థితి దారుణంగా తయారైంది
-సర్వేపల్లి నియోజకవర్గంలో ఉన్న చెరువులన్నింటిని ఎందుకు పనికి రాకుండా సర్వనాశనం చేశారు
– వెంకటాచలం మండలం జోసఫ్ పేట సమీపంలోని సర్వేపల్లి రిజర్వాయర్ ను శుక్రవారం టీడీపీ నాయకులు, ఆయకట్టు రైతులతో కలిసి పరిశీలించిన టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

తెలుగుదేశం పార్టీ హయాంలో నాగం జనార్దన్ రెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు తాను 61 గ్రామాలకు గ్రామీణ సురక్షిత మంచినీటి పథకాన్ని మంజూరు చేయిస్తే ఆ పథకాన్ని కాకాణి మూయించివేశాడు . సర్వేపల్లి రిజర్వాయర్ లో సాగునీరు లేకుండా చేసి భారీ గోతులు పెట్టి ఎర్రమట్టిని పెద్ద ఎత్తున అక్రమంగా తరలించి రూ.కోట్ల రూపాయలను దోచుకున్నారు. ఆనాడు తాము ఫిర్యాదు చేస్తే ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పై కేసు నమోదు చేశారు.. ఆ కేసు ఏమైందో తెలియదు.

తెల్ల బంగారాన్ని దుమ్ములేపుతుంటే, సిలికాను విచ్చలవిడిగా అమ్ముకుంటుంటే.. రూ. కోట్ల రూపాయలు పోతుంటే కేసులు పెట్టే దమ్ము జిల్లాలో కలెక్టర్, ఎస్పీలకు లేవు. వారిద్దరు కలిసి కాకాని పాద సేవ చేస్తూ అడుగులకు మడుగులు ఒత్తుతున్నారు. ఎంతైనా దోచుకోండి మాకు కొంత ఇచ్చుకోండి అన్న తీరులో వారిద్దరు ఉన్నారు. కరోనా సమయంలో ఒడ్లు దండుకొని కాకాణి కరోనా ప్యాలెస్ ని నిర్మించాడు.

సర్వేపల్లి రిజర్వాయర్ లో ఇష్టం వచ్చినట్లు ఎర్రమట్టిని ఎత్తుకొని ఎందుకు పనికిరాకుండా సర్వనాశనం చేశారు. నక్కల కాలువలో వేలుపెట్టి రూ.11 కోట్లు దోచుకున్నాడు. జిల్లా ఇంచార్జ్ మంత్రి అంబటి రాంబాబుకు డ్యాన్సులు వేసుకునేందుకు సమయం సరిపోవడం లేదు. ఒకరికి ఏమో క్యాష్ లెక్క పెట్టుకోవడానికి సమయం సరిపోవడం లేదు.. మరొకరికేమో డ్యాన్సులు వేసుకునేందుకే సమయం.

సర్వేపల్లి రిజర్వాయర్, కనుపూరు, కోడూరు చెరువులు ఇలా చెప్పుకుంటూ వెళ్తే అన్ని చెరువులు ఎందుకు పనికి రాకుండా చేసిన ఘనత కాకాణిదే. రాష్ట్రంలో ఇరిగేషన్ ను అడ్డం పెట్టుకొని దోచుకున్నకాడికి దోచుకున్నంతగా దోచేశారు. సర్వేపల్లి రిజర్వాయర్ కింద 25 వేల ఎకరాల ఆయకట్టు ఉంటే రైతుల భవిష్యత్తును పక్కనపెట్టి మరి, ఎర్ర మట్టిని తోలుకొని కాకాణి రూ.కోట్ల రూపాయల దోచుకున్నాడు.

దెబ్బతిన్న సర్వేపల్లి రిజర్వాయర్ ను పరిశీలించే అంతా తీరిక ఇరిగేషన్ ఉన్నతాధికారులకు లేదా? 2015లో భారీ తుఫాన్, వరదలు వచ్చిన సమయంలో ఆనాటి జిల్లా ఇన్చార్జ్ మంత్రి శిద్ధ రాఘవరావుతో కలిసి తాను ఎమ్మెల్సీగా సర్వేపల్లి రిజర్వాయర్ ను దగ్గరుండి పర్యవేక్షించాను. ఆనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును సైతం సర్వేపల్లి రిజర్వాయర్ వద్దకు తీసుకుని వచ్చాం. నేడు అందుకు భిన్నంగా వైసీపీ ప్రభుత్వం కానీ, మంత్రులు ఉన్నారు. రైతులను ఆదుకోలేని వాడుv కూడా మంత్రినా. చేతకాని మంత్రి ఎందుకు. సీఎం దగ్గరకు ధైర్యంగా వెళ్లి జీవో త్యాగలుగుతాడా?

కార్యక్రమంలో రాష్ట్ర రైతు ప్రధాన కార్యదర్శి రావూరి రాధా కృష్ణమ నాయుడు, మండల పార్టీ అధ్యక్షులు గుమ్మడి రాజా యాదవ్, రావూరి పద్మనాభ నాయుడు, పార్లపల్లి శ్రీనివాసులు రెడ్డి, మురళి రెడ్డి, మండల నాయకులు పాల్గొన్నారు

Leave a Reply