Suryaa.co.in

Telangana

తెలంగాణలో కమల వికాసం ఖాయం

-కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ ఇద్దరూ తోడుదొంగలు
-కారు కార్ఖానాకు..చేతి పని అయిపోయింది
-దేశమంతా యూసీసీ చట్టం రావాలి
-ఉత్తరాఖండ్‌ సీఎం పుష్కర్‌సింగ్‌ ధామి
-ముషీరాబాద్‌లో యువసమ్మేళనానికి హాజరు

కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ ఇద్దరూ తోడుదొంగలని ఉత్తరాఖండ్‌ సీఎం పుష్కర్‌సింగ్‌ ధామి విమర్శించారు. సికింద్రా బాద్‌ పార్లమెంటు ముషీరాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో సోమవారం జరిగిన యువ సమ్మేళనంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కారు కార్ఖానాలోకి పోయింది…చేతి పని అయిపోయింది…కమల వికాసం కొనసాగుతోందన్నారు. మేం ఉత్తరాఖండ్‌లో ‘ల్యాండ్‌ జిహాద్‌’పై కఠినంగా చర్యలు తీసుకున్నాం. 5 వేల ఎకరాలకు పైగా స్థలాన్ని బలవంతపు ఆక్రమణ నుంచి కాపాడుకున్నాం.

దేశంలో ఉండే ప్రతి ఒక్కరికీ ఒకే చట్టం వర్తించాలి. అందుకే యూసీసీని మేం తీసుకొచ్చాం. ఉమ్మడి పౌరస్మృతిని ఏర్పాటు చేసిన మొదటి రాష్ట్రంగా నిలిచాం. అంబేద్కర్‌ ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు ఇస్తే.. కాంగ్రెస్‌ రాజకీయాల కోసం మతపరమైన రిజర్వేషన్లు తీసుకొస్తామంటోందన్నారు. నేను బతికున్నన్ని రోజులు రిజర్వేషన్ల వ్యవస్థను ఎవరూ టచ్‌ చేయలేరని మోదీ చెప్పారు. అంతకన్నా గ్యారంటీ ఇంకే కావాలి. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ ఇద్దరూ తోడుదొంగలు. కాళేశ్వరం మీద విచారణ జరుగుతోందా? మహిళలకు రూ.2500 ఇస్తా మని కాంగ్రెస్‌ చెప్పింది..ఇస్తున్నారా? యువతకు నిరుద్యోగ భృతి రూ.4 వేలు ఇచ్చారా? అని ప్రశ్నించారు.

10న మోదీ పర్యటనకు తరలిరండి: కిషన్‌రండి
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ 10వ తేదీ మోదీ హైదరాబాద్‌ వస్తున్నారు. మద్దతు తెలియజేయాలని హైదరాబాద్‌ యువతను ఆహ్వానిస్తున్నాను. 13న పోలింగ్‌ ఉంది. ఉదయాన్నే పోలింగ్‌ బూత్‌కు వెళ్లి మొదటి ఓటు వేయండి. అది జ్ఞాపకంగా మిగులుతుంది. స్నేహితులు, కుటుంబసభ్యులతో కలిసి గ్రూప్‌గా వెళ్లండి. పోయే ముందు ఫొటో తీసుకుని, ఓటు వేసిన తర్వాత ఫొటో తీసుకుని రెండు ఫొటోలు మీ సోషల్‌ మీడి యాలో పోస్టు చేయండి. దేశం కోసం మోదీకి ఓటేస్తున్నామనే విషయం గుర్తుంచుకోవాలి. మీ బందువులు, స్నేహితులు వేరోచోట ఉన్నా ఫోన్‌ చేసి పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లేలా ప్రోత్సహించాలి. మోదీ అనుకూ ఓటర్లంతా ఉదయం 10 గంటల్లోపు ఓటేయాలని కోరారు.

దేశమంతా యూసీసీ అమలు: లక్ష్మణ్‌
ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ మాట్లాడుతూ యూసీసీని అమలు చేసిన తొలి రాష్ట్రం ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ ధామి అని ప్రశంసించారు. దేశమంతా యూసీసీ అమలు కోసం ఎదురు చూస్తోందన్నారు. మూడోసారి మోదీ పీఎం అయ్యాక అమలు చేసి తీరతామని తెలిపారు. పెద్ద సంఖ్యలో ఓటు వేయడం ద్వారా మోదీకి అండగా నిలవాలని కోరారు. అభివృద్ధి సంక్షేమమే మోదీ అజెండా అని వెల్లడిరచారు.

LEAVE A RESPONSE