Suryaa.co.in

Andhra Pradesh

ఎండాకాలం తాగునీటి ఎద్దడి తీర్చిన కన్నా

– నకరికల్లు గ్రామంలో ఎస్సీ కాలనీలో సొంత నిధులతో బోరింగ్ పంపులు ఏర్పాటు

నకరికల్లు మండలం నకరికల్లు గ్రామంలో పేద ప్రజలు,గ్రామస్తులు ఎండాకాలంలో త్రాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నాం అని తెలిపిన వెంటనే వారి కాలనీలో మంచినీటి సమస్య పరిష్కారానికి సొంత నిధులతో బోరింగ్ పంపులు ఏర్పాటు చేసిన మాజీ మంత్రి, సత్తెనపల్లి నియోజకవర్గ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ. బోరింగ్ పంపులను కొబ్బరికాయ కొట్టి ఓపెనింగ్ చేసిన గుంటూరు నగర మాజీ మేయర్ నియోజకవర్గ యువ నాయకులు కన్నా నాగరాజు. ఆయన వారి మీద చూపించిన ప్రేమకు కాలనీ వాసులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు గ్రామ నాయకులు జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE