Suryaa.co.in

Telangana

దేశ చరిత్రలోనే ఇది మొదటిసారి

– పర్యాటకులకు అపూర్వమైన అనుభూ
– హుస్సేన్‌సాగర్ అలలపై.. లేజర్ ఆదారిత సౌండ్ అండ్ లైట్ షో ను ప్రారంభించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
– సంజీవయ్య పార్క్ లో లైట్ అండ్ షో ను ప్రజలకు అంకితం చేసిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి , పాల్గొన్న రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు

ఈ సందర్బంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఏమన్నారంటే..హైదరాబాద్ భారతదేశంలోని అత్యుత్తమ పర్యాటక ప్రాంతాల్లో ఒకటి. అందుకే భాగ్యనగరాన్ని చూడటానికి వచ్చే పర్యాటకులకు అపూర్వమైన అనుభూతిని అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వ నిధులతో నగరవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు చేపట్టాం. ఇందులో మనం ప్రారంభించుకుంటున్న లేజర్ షో ఒకటి.

కేంద్ర పర్యాటక శాఖ సెంట్రల్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ స్కీమ్ లో భాగంగా.. 50 కోట్లతో ఈ షోను ఏర్పాటుచేసుకున్నాం. బ్రాడ్‌కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ సంస్థ.. ఈ ప్రాజెక్టును ఆకర్షణీయంగా రూపొందించింది. తెలంగాణ నుంచి మొదలైన కోహినూర్ కథ.. భిన్న సంస్కృతులు, వివిధ ఖండాలను దాటి చేసి ప్రయాణాన్ని వాటర్ స్క్రీన్ పై రంగుల రంగుల లేజర్ వెలుతురులో వివరించనున్నారు. ఈ కథను రాజ్యసభ ఎంపీ, సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్ గారి పర్యవేక్షణలో.. ప్రముఖ రచయిత SS కంచి రాశారు. ప్రముఖ నేపథ్య గాయని (ప్లే బ్యాక్ సింగర్) సునీత గాత్రాన్ని అందించగా.. ప్రముఖ సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్ సంగీతాన్ని అందించారు.

దేశంలోని వివిధ ప్రాంతాల్లో.. అక్కడి చారిత్రక ప్రాధాన్యతను వివరిస్తూ.. సౌండ్ అండ్ లైట్ షోస్ ఉన్నాయి. కానీ.. ఓ చెరువు అలలపై లేజర్ ఆధారిత సౌండ్ అండ్ లైట్ షో ఏర్పాటు చేయడం దేశ చరిత్రలోనే ఇది మొదటిసారి. కోహినూర్ కథతోపాటుగా.. తెలంగాణ కథ, ఇక్కడి సంస్కృతి, దేశ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ ఈ షోను డిజైన్ చేశారు. ఈ షో పర్యాటకులను అమితంగా ఆకట్టుకోనుంది.

ఈ ప్రాజెక్టులో.. మ్యూజికల్ ఫౌంటేన్ సిస్టమ్.. (ఇంటెలిజెంట్ లైటింగ్)
ప్రొజెక్షన్ సిస్టమ్, ఆడియా సిస్టమ్, షో కంట్రోల్ సిస్టమ్, ఆర్టి-స్టిక్ డైరెక్షన్, కంటెంట్, ఆర్ట్ ప్రొడక్షన్. 500 మంది కూర్చునేలా ఏర్పాట్లు. ఫౌంటేన్ ఫ్లోటింగ్ స్ట్రక్చర్, ఫౌంటేన్ ఇన్-స్టలేషన్, ఫ్లోటింగ్ స్ట్రక్చర్. అడ్వయిర్టయిజ్ మెంట్, సైనేజ్, ప్రచార సామాగ్రి, రూఫ్ టాప్ ఓపెన్ గ్లాస్ రెస్టారెంట్, ఇతర వసతులున్నాయి.

వీటన్నింటి ద్వారా ఈ ప్రాంత చరిత్రను ఆడియో, విజువల్ మీడియా ద్వారా ఆక్వా స్క్రీన్ ప్రొజెక్షన్ మ్యాపింగ్ తో అందంగా చూపిస్తారు. దీనికి ఫౌంటేన్ షో సింక్ర-నైజ్, చేసి.. చక్కటి మ్యూజిక్ కూడా జోడించడంతో షో చాలా అట్రాక్టివ్‌గా ఉంది. ఇలాంటి లేజర్ షోలు, సౌండ్ అండ్ లైట్ షోలు, ఇల్యుమినేషన్ ప్రాజెక్టులు మన చరిత్రను, మన సంస్కృతిని తెలియజేసేందుకు చాలా అవసరం.

LEAVE A RESPONSE