కంటి వెలుగు అనేది ఒక గొప్ప కార్యక్రమం

ప్రజలు కంటి చూపు సంబంధ సమస్యలకతో బాధపడకూడదు అనే ఆలోచనతోనే ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.

సోమవారం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అంబర్ పేట నియోజకవర్గ పరిధిలోని బాగ్ అంబర్ పేట డివిజన్ రామకృష్ణ నగర్ పార్క్ లో MLA కాలేరు వెంకటేష్, ముషీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని భోలక్ పూర్ డివిజన్ తాళ్లబస్తి కమిటీ హాల్ లో MLA ముఠా గోపాల్ లతో కలిసి కంటి వెలుగు శిబిరాలను సందర్శించారు. ముషీరాబాద్ లో KCR చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. శిభిరాలకు కంటి పరీక్షల కోసం వచ్చిన ప్రజలతో మాట్లాడి ఏర్పాట్ల గురించి అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కంటి వెలుగు అనేది ఒక గొప్ప కార్యక్రమం అన్నారు. ఈ శిభిరాలలో ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి, మందులు, కళ్ళద్దాల పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పారు. అవసరమైన వారికి కంటి ఆపరేషన్ లను కూడా ఉచితంగా చేస్తారని తెలిపారు. పేద ప్రజలు కంటి పరీక్షలు, ఆపరేషన్ ల కోసం ఆర్ధిక ఇబ్బందులు పడకూడదనే ఆలోచన తోనే ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. దేశంలో ఎవరు చేయని విధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ పేద, మద్య తరగతి ప్రజలను దృష్టిలో ఉంచుకొని ఇంత గొప్ప కార్యక్రమం చేపట్టారని చెప్పారు.

కంటి వెలుగు కార్యక్రమం కోసం ప్రభుత్వం 250 కోట్ల రూపాయల ను ఖర్చు చేస్తుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోనే తయారు చేసిన సుమారు 55 లక్షల కళ్ళద్దాలను పంపిణీ చేయనున్నట్లు వివరించారు. అన్ని కాలనీలు, బస్తీలలోని ప్రజలు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. జూన్ ౩౦ వ తేదీ వరకు ఈ కార్యక్రమం నిర్వహించబడుతుందని అన్నారు. ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు శిభిరాలలో పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు.

ఈ కేంద్రాలను కూడా ఒకే చోట కాకుండా ప్రజల అవసరాలను బట్టి కాలనీలు, బస్తీలు, గేటెడ్ కమ్యునిటీ లలో కూడా నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. ప్రైవేట్ లో కంటి పరీక్ష కోసం కనీసం 500 రూపాయలు, ఆపరేషన్ కోసం 50 వేల రూపాయలకు పైగా ఖర్చు చేయాల్సి వస్తుందని, ఇంతకంటే ఎక్కువ కూడా ఖర్చు కావచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకట్ తదితరులు ఉన్నారు.

Leave a Reply