రూ.42,872కోట్ల విద్యుత్ ఛార్జీల పిడుగుతో జగన్ రెడ్డి ప్రజల నడ్డి విరగ్గొట్టాడు

• జగన్ రెడ్డి 7 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచాడు. ఉచితవిద్యుత్ లేకుండాచేసి, 3లక్షల ఎస్సీ కుటుంబాల్లో చీకట్లు నింపాడు
• చంద్రబాబు హాయాంలో వెలుగులు విరజిమ్మిన ఆంధ్రప్రదేశ్, జగన్ జమానాలో అంధకారప్రదేశ్ గా మారింది
– టీడీపీ అధికారప్రతినిధి నాగుల్ మీరా

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, చంద్రబాబు భారాలమీద భారాలేస్తూ ప్రజల్ని దోచుకుంటున్నాడ ని మొసలికన్నీరుకార్చిన జగన్ రెడ్డి, అధికారంలోకి వచ్చాక జనంపై విద్యుత్ ఛార్జీలనే పిడు గు వేసి, రాష్ట్రాన్నే అంధకారప్రదేశ్ గా మార్చాడని టీడీపీ అధికారప్రతినిధి నాగుల్ మీరా ఆగ్రహం వ్యక్తం చేశారు.మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడా రు. ఆ వివరాలు క్లుప్తంగా ఆయన మాటల్లోనే …

“ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ రెడ్డి తెలుగుదేశం ప్రభుత్వం ప్రజలపై భారాలమీద భారాలేస్తోందని మొసలికన్నీరు కార్చాడు. తాను ముఖ్యమంత్రి అయ్యాక ప్రజలపై మోయలేని భారాలువేస్తూ, నిత్యం వారితో కన్నీళ్లు పెట్టిస్తున్నాడు. ఫ్యాన్ గుర్తుకు ఓటేసిన పాపానికి జనం ఫ్యాన్ వేయాలంటేనే వణికిపోయేలా చేశాడు. సామాన్య, మధ్యతరగతి జనంపై జగన్ రెడ్డి 7సార్లు కరెంట్ ఛార్జీలనే పిడుగులు వేశాడు. 7 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన జగన్, రూ.16,611కోట్ల భారంమోపి, జనం నడ్డి విరగ్గొట్టాడు. అంతటితో ఆగకుండా, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రూ.26,261కోట్ల రుణం తీసుకొని, అంతిమంగా ప్రజలపై రూ.42,872కోట్ల భారీ భారం మోపాడు. చంద్రబాబు ప్రజలజీవితాల్లో సంతోషంతో కూడిన వెలుగులు నింపితే, జగన్ రెడ్డి జనాన్ని చీకట్ల పాలు చేసి, రాష్ట్రాన్ని అంధకారప్రదేశ్ గా మార్చాడు. జగన్ జమానాలో ఎప్పుడు కరెం ట్ పోతుందో, ఎప్పుడు విద్యుత్ ఛార్జీలు పెరుగుతాయో తెలియని దుస్థితి.

నాఎస్సీలనే జగన్ రెడ్డి, ఉచిత విద్యుత్ ఎత్తేసి, 3లక్షల ఎస్సీకుటుంబాల్లో చీకట్లు నింపాడు
తన దోపిడీ తప్ప, ప్రజల బాధలు, పారిశ్రామికవేత్తలు, రైతుల వెతలు జగన్ కు పట్ట డం లేదు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టొద్దని అన్నదాతలు మొత్తుకుంటున్నా, జగన్ ఎందుకు తననిర్ణయం మార్చుకోడు? ఎస్సీలు ఎస్సీకాలనీల్లో ఉంటేనే వారికి ఉచిత విద్యుత్ ఇస్తానంటున్న జగన్ రెడ్డి, దళితులపై తనకున్న వివక్షను చేతలతో చెప్పకనే చెబుతున్నాడు. విద్యుత్ ఛార్జీలు పెంచడమేగాక, ఎస్సీఎస్టీలకు ఉచిత విద్యు త్ దూరం చేసిన జగన్ రెడ్డి 3లక్షల కుటుంబాల్లో చీకట్లు నింపాడు. గతంలో సింగిల్ ఫేజ్ విద్యుత్ కనెక్షన్ కు రూ.2వేలు ఖర్చు అయితే, ఇప్పుడు జగన్ జమానాలో రూ.8నుంచి రూ.10వేలు అవుతోంది. 3 ఫేజ్ విద్యుత్ కనెక్షన్ ఖర్చు గతంలో రూ.15వేలుంటే, నేడు రూ.40వేలు అయింది. జగన్ పాదప్రభావంతో రాష్ట్రంలో పారిశ్రా మిక, నిర్మాణరంగాలు కుదేలయ్యాయి. పరిశ్రమలు మూతపడి, నిర్మాణ రంగం చతికిలబడి, ఉపాధిలేక లక్షలాదిమంది రోడ్డునపడ్డారు. బతుకే భారమై ఎలా బతకా లో తెలియక సామాన్య, మధ్యతరగతి జనం గగ్గోలుపెడుతుంటే, జగన్ రెడ్డి ఒకచేత్తో 10రూపాయిలిస్తూ, మరోచేత్త వారినుంచి 100రూపాయలు లాక్కుంటు న్నాడు.

గతంలో అన్యాయంజరిగినా, ధరలుపెరిగినా, విద్యుత్ ఛార్జీలు రెట్టింపైనా జనం రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపేవారు. జగన్ రెడ్డి పుణ్యమా అని ప్రజలు, ఉద్యోగ సంఘాలు, ప్రతిపక్షాలు, ఏవీ గొంతెత్తే అవకాశం లేకుండా పోయింది. తాను చెప్పిందే వేదం, తాను చేసేదే శాసనం అన్నట్టుగా జగన్ రాచరిక, నియంత్రత్వ పోకడలతో రాష్ట్రాన్ని పాలిస్తున్నాడు. నాఎస్సీలు, నాఎస్టీలు, నాబీసీలు, నా మైనారిటీలు అని ఉపన్యా సాలిచ్చే జగన్, అన్నివర్గాల నోట్లో మట్టికొట్టాడు. ఏ వర్గానికి కడుపునిండా తిండి, కంటినిండా నిద్ర, చేతినిండా పనిలేకుండా చేశాడు. చచ్చీచెడీ సంపాదించుకునే సొమ్ముని విద్యుత్ ఛార్జీలు, ధరలపెంపు, పన్నులరూపంలో ముక్కుపిండి వసూలు చేస్తున్నాడు.

జగన్ రెడ్డి జనం మెచ్చే నాయకుడైతే, ప్రతిపక్షనేతల పర్యటనలు, యాత్రలు ఎందుకు అడ్డుకుంటున్నాడు?
విద్యుత్, మద్యం, మైనింగ్, ఇసుక అన్నింట్లో ముడుపులు దండుకుంటూ, జగన్ రెడ్డి రాష్ట్రాన్ని లూఠీచేస్తున్నాడు. చంద్రబాబు హయాంలో లారీ ఇసుక రూ.10వేలుంటే, జగన్ దాన్ని రూ.50వేలకు అమ్ముకుంటున్నాడు. నకిలీ మద్యం అమ్మకాలతో పేదల రక్తం తాగుతూ, తన ఖజానా నింపుకుంటున్నాడు. ఒక్క అవకాశమంటూ అధికారం లోకి వచ్చి, చివరకు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. బటన్ నొక్కుతున్నాను అంటూ ప్రజల గొంతునొక్కుతున్నాడు.

జగన్ రెడ్డి బటన్ నొక్కుడుకు ప్రతిగా ప్రజలంతా వచ్చే ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు నొక్కి, వైసీపీప్రభుత్వాన్ని పాతరేస్తారు. ‘యువగళం’ పేరుతో జనంలోకి వెళ్తున్న నారాలోకేశ్ ని అడ్డుకోవడానికే జగన్ రెడ్డి ఆంక్షలు పెడుతు న్నాడు. 27వ తేదీన కుప్పంలో మొదలయ్యే లోకేశ్ పాదయాత్రలో పాదం కదపడానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు సిద్ధమయ్యారు. ఆ భయంతోనే జగన్ రెడ్డి నిబంధనలు, ఆంక్షల పేరుతో లోకేశ్ ను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాడు. జగన్ రెడ్డి ప్రజలు మెచ్చిన నాయకుడే అయితే ప్రతిపక్షనేతల్ని, వారిపర్యటనల్ని అడ్డుకోవాల్సిన అవస రం ఏమొచ్చింది?

ప్రజాసమస్యలు పరిష్కరించాలనే ఆలోచన చేయకుండా, డబ్బుతోనే అన్నీ చేయొచ్చన్న దుర్మార్గపు ఆలోచనలో జగన్ రెడ్డి ఉన్నాడు. జగన్ ఎన్నికుట్రలు చేసినా, ఎన్నిపన్నాగాలు పన్నినా 2024లో ప్రజలచేతిలో చావుదెబ్బ తినడం ఖాయం” అని నాగుల్ మీరా తేల్చిచెప్పారు.

Leave a Reply