Suryaa.co.in

Telangana

గాంధీ దవాఖానపై కేసీఆర్ ప్రత్యేక దృష్టి

– గాంధీ ఆసుపత్రిలో సిటీ స్కాన్ ప్రారంభించిన ఆరోగ్య మంత్రి హరీశ్ రావు
ముఖ్యమంత్రి కేసీఆర్ గాంధీ ఆసుపత్రిపై ప్రత్యేక దృష్టి సారించారని ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు చెప్పారు. కార్పొరేట్ స్థాయిలో పనిచేస్తున్న గాంధీ ఆసుపత్రిలో సమస్య పరిష్కారానికి తాను ప్రాధాన్యం
gandhiఇస్తానన్నారు. గాంధీలో 2 కోట్ల రూపాయలతో ఏర్పాటుచేసిన సిటి స్కాన్ సెంటర్‌ను ఆయన మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్, మహమూద్ ఆలీతో కలసి ప్రారంభించారు. ఆసుపత్రిలోని బ్లాక్‌లు పరిశీలించి జూనియర్ డాక్టర్లు, పేషెంట్లు, వారి బంధువులతో మాట్లాడారు. సమస్యల గురించి ప్రస్తావించారు.ఈ సందర్భంగా హరీష్ రావు ఏమన్నారంటే…
గాంధీలో లో 6.5 కోట్లతో నూతన క్యాత్ ల్యాబ్ ఏర్పాటు చేస్తున్నాం. 12.5 కోట్లతో MRI ఏర్పాటు చేస్తున్నాం. ఈ రెండూ వచ్చే 45 రోజుల్లో అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. మాతాశిశు సేవల కోసం గాంధీలో 200 పడకల MCH నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి.
gandhi1వచ్చే ఐదారు నెలల్లో పనులు పూర్తి కానున్నాయి. కరోనా సమయంలో గాంధీ ఆసుపత్రి సిబ్బంది అద్భుతంగా సేవలు చేశారు. 84,127 మందికి వైద్యం అందించి ప్రాణాలు కాపాడారు. దవాఖాన లోని సిబ్బంది అందరికీ నా అభినందనలు. ప్రైవేట్ దావకాన లు చేతులెత్తేసిన సమయంలో గాంధీ దవాఖాన ప్రజలను ఆదుకుంది.
ముఖ్యమంత్రి కేసీఆర్ గాంధీ దవాఖాన పై ప్రత్యేక దృష్టి పెట్టారు. టిఆర్ఎస్ ప్రభుత్వం దవాఖానకు ఇప్పటివరకు రు. 176 కోట్లు విడుదల చేసింది. ఇందులో 100 కోట్ల పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. మరో 76 కోట్ల పనులు యుద్ధ ప్రాతిపదికన సాగుతున్నాయి.రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసు నమోదు కాలేదు. రిస్క్ దేశాలనుంచి 3235 మందిరాగా వారిలో 15 మంది కి పాజిటివ్ వచ్చింది. జీనోమ్ సీక్వెన్సింగ్ లో 13 మందికి నెగెటివ్ వచ్చింది. మరో ఇద్దరు ఫలితాలు రావాల్సి ఉంది.
రాష్ట్రంలో ఇప్పటివరకు 4.6 కోట్ల కరోనా టీకాలు వేశారు. 95 శాతం మందికి మొదటి డోస్, 51 శాతం మందికి రెండో వేశారు. ఎలాంటి వైరస్ వచ్చినా మాస్క్ మనకు శ్రీరామరక్ష. కాబట్టి ప్రతి ఒక్కరు మాస్కు ధరించాలి. రెండు డోసుల టీకాలు వేసుకోవాలి.

LEAVE A RESPONSE