Suryaa.co.in

Telangana

బండెనక బండి కట్టి.. గులాబీల జెండ పట్టి

– బి.ఆర్.ఎస్ రజతోత్సవ పాటను ఆవిష్కరించిన పార్టీ అధినేత కేసీఆర్

ఎర్రవెల్లి : రచయిత , గాయకుడు , మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ రచించి గానం చేసిన “బండెనక బండి కట్టి గులాబీల జెండ పట్టి …” బి.ఆర్.ఎస్ రజతోత్సవ పాటను పార్టీ అధినేత కేసీఆర్ గురువారం ఎర్రవెల్లి నివాసంలో ఆవిష్కరించారు . నాటి నుండి నేటి వరకు బి.ఆర్.ఎస్ ప్రస్థానాన్ని పేర్కొంటూ రజతోత్సవం సందర్భంగా పాటలు , కళారూపాల్ని రూపొందించాలని ఈ సందర్భంగా పార్టీ అధినేత కేసీఆర్ రసమయికి సూచించారు . కార్యక్రమంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు ఉమ్మడి కరీంనగర్ , ఆదిలాబాద్ జిల్లాల ఎమ్మెల్యేలు , మాజీ మంత్రులు , మాజీ ఎమ్మెల్యేలు , నాయకులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE