Suryaa.co.in

Telangana

ప్రజలకు ఒకే గొడుగుకింద మెరుగైన సేవలు అందాలనేది ముఖ్యమంత్రి కేసిఆర్ ఆలోచన

-పరిపాలన సౌలభ్యం కోసం సమీకృత కలెక్టరేట్ల నిర్మాణం
-ఖమ్మం కలెక్టరేట్ చూసి ముఖ్యమంత్రులు అరవింద్ -కేజ్రీవాల్,భగవంత్ మాన్,పినరయ్ విజయన్ ఆశ్చర్యపోయారు
-మన జిల్లా సమీకృత కలెక్టరేట్లు ఉన్నట్టు ఇతర రాష్ట్రాల -సెక్రటేరియట్లు కూడా లేవని అక్కడి నాయకులే అంటున్నారు
– శాసనసభ ప్రశ్నోత్తరాల్లో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

శాసన సభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మేల్యేలు ఆరూరి రమేష్,పద్మా దేవేందర్ రెడ్డి,దివాకర రావు రాష్ట్రంలో ఇప్పటివరకు పూర్తయిన సమీకృత జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల సముదాయాల వివరాలు,ప్రస్తుతం మిగిలిన జిల్లా కార్యాలయాల సముదాయాల నిర్మాణం ఏ దశలో ఉన్నవి? ఈ సముదాయాలలో కల్పిస్తున్న సదుపాయాలు ఏమిటి ఇందుకోసం ఖర్చు చేస్తున్న నిధుల పరిమాణం ఎంత ?వాటి యొక్క జిల్లావారీ వివరాలు ఏమిటి ? సంబంధిత వివరాలు తెలపాలని రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ని కోరారు.

ఈ సందర్బంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమాధానం చెప్పారు. ప్రజలకు ఒకే గొడుగుకింద మెరుగైన సేవలు అందాలనేది ముఖ్యమంత్రి కేసిఆర్ ఆలోచన అని అందులో భాగంగా పరిపాలన సౌలభ్యం కోసం సమీకృత కలెక్టరేట్ల నిర్మాణం చేపట్టారని అన్నారు. ఇటీవల మన రాష్ట్రానికి వచ్చిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, కేరళ పినరయ్ విజయన్ పలువురు నాయకులు ఖమ్మం కలెక్టరేట్ చూసి ఆశ్చర్యపోయారని తెలిపారు. మన జిల్లా సమీకృత కలెక్టరేట్లు ఉన్నట్టు ఇతర రాష్ట్రాల సెక్రటేరియట్లు కూడా లేవని అక్కడి నాయకులే అన్నారని చెప్పారు.

మా రాష్ట్రాల్లో కూడా ఇట్లాంటి నిర్మాణాలు చేపడతామని అన్నారని గుర్తు చేశారు. ఇప్పటివరకు 17 సమీకృత జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల సముదాయాలుపూర్తయ్యాయి అన్నారు. సమీకృత కలెక్టరేట్ల కోసం మొత్తం వ్యయం రూ.1581.62 కోట్లు కాగా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాలపై ఖర్చు చేసిన మొత్తం ఇప్పటివరకు రూ.1008.53 కోట్లు అని తెలిపారు. సమీకృత కలెక్టరేట్ల పూర్తి వివరాలు సభ ముందుంచారు.

LEAVE A RESPONSE