Suryaa.co.in

Andhra Pradesh

ఖాదీ, చేనేత దేశ సంస్క్రృతిలో అంతర్భాగం

ఈ పరిశ్రమ వృద్ధి సాధిస్తే కోట్లది కుటుంబాలకు ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం
ఎంపి విజయసాయిరెడ్డి

ఖాదీ, చేనేత వస్త్రాలు దేశ సంస్క్రృతిలో అంతర్భాగమని రాజ్యసభ సభ్యుల,వైఎస్ఆస్ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటను విడుదల చేశారు. భారతీయ మూలలగా భవించే ఖాదీ చేనేత వస్త్రాలు మహాత్మా గాంధీ వీటికి ప్రత్యేక గుర్తింపు తీసుకురావడమే కాకుండా ప్రజా ఉద్యమంలో వీటిని భాగం చేశారని గుర్తు చేశారు. స్వాతంత్ర్యానంతరం వీటిని విస్మరించినప్పటికీ.. ప్రధాని నరేంద్ర మోదీ వీటి ఇమేజ్‌ను, వ్యాపారాన్ని పునరుద్ధరించే బాధ్యతను తీసుకున్నారని పేర్కొన్నారు. పర్యావరణానికి అనుకూలమైన ఈ పరిశ్రమ ఎదిగితే దేశంలోని కోట్లాది కుటుంబాలు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందుతాయని వెల్లడించారు. అలాగే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కూడా బలోపేతం అవుతుందన్నారు. ఖాదీ, చేనేత వస్త్రాలకు ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి ఆదరణ ఉందో, ఆ మేరకు మన దేశంలోనూ వీటిని వినియోగించడం, ప్రోత్సహించడం ద్వారా జాతిపిత మహాత్మాగాంధీ ఆశయ స్ఫూర్తితో దేశాభివృద్ధికి బాటలు వేయవచ్చన్నారు..

పేదరిక నిర్మూలన సాధ్యమే,తూర్పు ప్రాంత ప్రగతి కీలకం
దేశంలో 2030 నాటికి పేదరిక నిర్మూలన సాధ్యమే ఆయిన అన్ని వనరులన్న తూర్పు ప్రాంత రాష్ట్రాలు ప్రగతి కీలకమని చెప్పారు. భారతదేశంలో పేదరికం గత 32 ఏళ్లలో గణనీయంగా తగ్గిపోయిందన్నారు. 1991 వేసవిలో ప్రభుత్వం ప్రారంభించిన ఆర్థిక సంస్కరణలు దేశంలో సంపద సృష్టికి మాత్రమేగాక దారిద్య్ర నిర్మూలనకు దారితీశాయాని గుర్తు చేశారు. దేశంలోని తూర్పు ప్రాంతం వైరుధ్యాల పుట్ట,అత్యంత సంపన్న ప్రకృతి వనరులున్న ఈ తూర్పు రాష్ట్రాల్లో ప్రజలు పేదరికంలో మగ్గుతున్నారని చెప్పారు. ఇక్కడ తూర్పు ప్రాంతం అంటే..బిహార్, ఝార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్‌ గఢ్, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాలు. అటవీ ప్రాంతాలు, ఆదివాసీలు, గనులు ఉన్న ఈ రాష్ట్రాల ప్రజలు ఇప్పటికీ ఇతర ప్రాంతాలకు ఉపాధి కోసం వలసపోతున్నారని చెప్పుకొచ్చారు. అత్యంత విలువైన గనులున్న ఝార్ఖండ్, అటవీ ప్రాంతాలున్న ఛత్తీస్‌ గఢ్, గతంలో పారిశ్రామికంగా ఓ వెలుగు వెలిగిన పశ్చిమ బెంగాల్‌ ప్రాంతాల్లో పేదరికం పూర్తిగా నిర్మూలించి అభివృద్ధి మార్గంలో నడిపించడానికి ఇప్పటికే ప్రయత్నాలు మొదలయ్యాయన్నారు. అధిక దారిద్య్రాన్ని తొలగించే చర్యలు, ఆర్థిక అభివృద్ధికి రూపొందించే పథకాలు ఏకకాలంలో అమలు చేస్తే తూర్పు ప్రాంతం దేశ ప్రగతికి కీలకపాత్ర దోహదం చేస్తుందన్నారు.

LEAVE A RESPONSE