Suryaa.co.in

Telangana

కేటీఆర్..కాంగ్రెస్ కార్యకర్తలు బట్టకూడదీసి కొడతారు

– గవర్నర్‌కు కేటీఆర్ తక్షణమే క్షమాపణ చెప్పాలి
– అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద టీ పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్

హైద‌రాబాద్‌: గవర్నర్‌ ప్రసంగంపై కేటీఆర్ ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడారు. గవర్నర్‌ ప్రసంగంపై కేటీఆర్ వ్యాఖ్యలు శోచనీయం. తెలంగాణ తల్లి, రాజీవ్ గాంధీ విగ్రహాలను టచ్ చేసి చూడండి కేటీఆర్..కాంగ్రెస్ కార్యకర్తలు బట్టకూడదీసి కొడతారు. బిఆర్ఎస్ హయంలో అప్పటి గవర్నర్ తమిళి సై పై అవమాన పరిచే విదంగా కేసిఆర్ వ్యవహరించారు. గవర్నర్‌కు కేటీఆర్ తక్షణమే క్షమాపణ చెప్పాలి.

కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి నీ చూసి కేటీఆర్ ఓర్వలేక దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఫాం హౌస్ లో పడుకుంటే కాంగ్రెస్ చేస్తున్న అభివృద్ధి ఎలా కనిపిస్తుంది? ఇంటిగ్రేటెడ్ యునివర్సిటీ,స్కిల్ యునివర్సిటీ, స్పోర్ట్స్ యునివర్సిటీ తీసుకొచ్చాం. గవర్నర్ ప్రసంగం ఆసాంతం కాంగ్రెస్ ప్రభుత్వంలో పేద ప్రజలకు అందుతున్న సంక్షేమ ఫలాలను ప్రతిబింబిస్తుంది.

చారిత్రాత్మక కుల సర్వే లో పాల్గొననని కేటీఆర్ కు సర్వే పై మాట్లాడే అర్హత లేదు. బిఆర్ఎస్ పాలనలో అప్పటి బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా. తెలంగాణ ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టిన కేటీఆర్ కు బుద్ధి రాలేదు. యువతను మత్తు బానిసలు చేసిన ఘనత బిఆర్ ఎస్ పార్టీకే దక్కుతుంది. ఇటీవల దుబాయ్ లో చనిపోయిన వ్యక్తి మీకు సన్నిహితుడు కదా కేటీఆర్? అధికారం పోయిన కేటిఆర్ లో ఇసుమంతైనా అహంకారం తగ్గలేదు. కేటీఆర్‌ క్షేత్రస్థాయిలో పర్యటిస్తే కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు తెలుస్తుంది.

కాంగ్రెస్‌ తల్లి, రాహుల్‌ గాంధీ తండ్రి విగ్రహాలను ప్యాక్‌ చేస్తామంటూ కేటీఆర్ అహంకారంతో మాట్లాడుతున్నారు. 15 ఏళ్ల తర్వాత తెలంగాణలో గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుంది.కాళేశ్వరం, మేడిగడ్డ తో కేసిఆర్ కుటుంబం లక్షల కోట్లు దోచుకుంది. కులగణనలలో తప్పుడు లెక్కలు చెబుతున్నామని అంటున్న మీరు, సమగ్ర కుటుంబ సర్వే వివరాలను ఎందుకు టేబుల్ చేయలేకపోయారు?

కేసిఆర్ ఇప్పటికైనా ప్రతి పక్షనేతగా అసెంబ్లీకి రావడాన్ని స్వాగతిస్తున్నాం. కుల గణన సర్వేలో పాల్గొనకుండా సర్వేను తప్పు పట్టే అర్హత కేటీఆర్ కు లేదు. చారిత్రాత్మక నిర్ణయాలైన కుల గణన ,ఎస్సీ వర్గీకరణ చేసినందుకు అభినందించాల్సింది పోయి విమర్శలు చేయడానికి సిగ్గుండాలి. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ ముందుకు సాగుతోంది. మీరు చేసిన అప్పులకే వడ్డీలు చెల్లించడానికి మళ్లీ అప్పులు చేయాల్సిన దుస్థితి దాపురించింది.

అప్పుల గురించి కేటీఆర్ మాట్లాడటం ఆయన అహంకారానికి పరాకాష్ట. వరంగల్ , కామారెడ్డి డిక్లరేషన్ కట్టుబడి హామీలను అమలు చేస్తున్నాం. ఏడాదిలో చరిత్రలో నిలిచిపోయే కుల గణన, ఎస్సీ వర్గీకరణ చేశాం. ఏడాదిలో 55 వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చాం.

LEAVE A RESPONSE