Suryaa.co.in

Telangana

కేటీఆర్ ఏసీబీ విచారణలో లాయర్‌కు అనుమతి

– లైబ్రరీలో కూర్చుంటే కేటీఆర్ విచారణ కనిపిస్తుంది
– కేటీఆర్ విచారణను వీడియో, ఆడియో రికార్డు కుదరదు

హైదరాబాద్: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఏసీబీ విచారించడం ఖాయమయింది. కోర్టు ఆ మేరకు ఆదేశించిన నేపధ్యంలో.. కనీసం విచారణ తన న్యాయవాది సమక్షంలోనే జరగాలంటూ, కేటీఆర్ పెట్టుకున్న పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు తిరస్కరించింది. అయితే న్యాయవాది దూరంగా ఉండి విచారణను పర్యవేక్షించవచ్చని పేర్కొంది.

ఫార్ములా ఈ-కార్ కేసుకు సంబంధించి ఏసీబీ విచారణకు తనతో పాటు లాయర్ ను తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు తెలంగాణ హైకోర్టు అనుమతించింది. కేటీఆర్ విచారణను వీడియో, ఆడియో రికార్డు చేయాలని ఆయన తరపు న్యాయవాది కోరగా హైకోర్టు నిరాకరించింది. లాయర్ తో కలిసి రేపు ఏపీబీ విచారణకు వెళ్లాలని కేటీఆర్ కు సూచించింది. ఆ తర్వాత ఏమైనా అనుమానాలు ఉంటే మళ్లీ హైకోర్టును ఆశ్రయించవచ్చని తెలిపింది.

తనతో పాటు లాయర్ ను తీసుకెళ్లేందుకు అనుమతించాలంటూ కేటీఆర్ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ ను విచారించిన హైకోర్టు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, హైకోర్టు కొన్ని షరతులు విధించింది. విచారణ గదిలో కేటీఆర్, విచారణ అధికారులు మాత్రమే ఉంటారని, వారితో పాటు లాయర్ కూర్చోవడానికి కుదరదని హైకోర్టు స్పష్టం చేసింది. ఏసీబీ కార్యాలయంలోని లైబ్రరీ గదిలో లాయర్ కూర్చోవచ్చని, లైబ్రరీలో కూర్చుంటే కేటీఆర్ విచారణ కనిపిస్తుందని హైకోర్టుకు అడిషనల్ అడ్వొకేట్ జనరల్ తెలిపారు. దీంతో, లైబ్రరీలో లాయర్ కూర్చోవాలని హైకోర్టు సూచించింది. ఫలితంగా విచారణలో తన లాయర్ పక్కనే ఉండాలన్న కోరిక ఫలించలేదు.

LEAVE A RESPONSE