Suryaa.co.in

Andhra Pradesh

కుదిరితే.. కప్పు కాఫీ

అరకు కాఫీ రుచి చూసిన నారా భువనేశ్వరి

– అరకు నియోజకవర్గంలో నిజం గెలవాలి పర్యటన సందర్భంగా అరకు కాఫీని నారా భువనేశ్వరి రుచి చూశారు. అరకు సెంటర్లోని అరకు గోల్డ్ కాఫీ సెంటర్ వద్ద అరకు కాఫీ తాగిన భువనేశ్వరి.
•అరకు కాఫీ గొప్పతనాన్ని భువనేశ్వరికి వివరించిన స్థానిక టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దొన్నుదొర.
• చంద్రబాబు పాలనలో కాఫీ తోటలను ప్రత్యేకంగా ప్రోత్సహించారని భువనేశ్వరికి వివరించిన దొన్నుదొర.
• వైసీపీ అధికారంలోకి వచ్చాక కాఫీ తోటల పెంపకాన్ని గాలికొదిలేశారని వివరించిన దొన్నుదొర.
• అరకు పర్యటక ప్రదేశాన్ని కూడా జగన్ సర్కార్ పట్టించుకోవడంలేదని భువనేశ్వరికి తెలిపిన దొన్నుదొర.
• అరకు ప్రకృతి అందాలను, ఆహ్లాదకరమైన ప్రదేశాలను కూడా పరిశీలించిన భువనేశ్వరి.
• అరకును పర్యాటక ప్రదేశంగా ప్రోత్సహించేందుకు మరిన్ని చర్యలు తీసుకోవాల్సి ఉందని అభిప్రాయం వ్యక్తం చేసిన భువనేశ్వరి.
• టీడీపీ పాలనలో అరకు ప్రాంతాన్ని, కాఫీ తోటల పెంపకాన్ని ప్రోత్సహించేందుకు మరింత చొరవ తీసుకోవాలని చంద్రబాబుకు వివరిస్తామని దొన్నుదొరకు తెలిపిన భువనేశ్వరి.

LEAVE A RESPONSE