Home » అంబటి రాంబాబుకు కుంపటి రత్న.. రోజాకి కోతలరత్న..గుమ్మనూరు జయరాంకి జూదరత్నఇవ్వాలి

అంబటి రాంబాబుకు కుంపటి రత్న.. రోజాకి కోతలరత్న..గుమ్మనూరు జయరాంకి జూదరత్నఇవ్వాలి

– వైసీపీలోనే అన్ని రకాల కళాకారులున్నారు
-వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలకు జగన్ అవార్డులవ్వాలి
– టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మద్దిపట్ల సూర్య ప్రకాశ్

వివిధ రంగాలలో ప్రముఖులను గుర్తించి వైయస్ ఆర్ అచీవ్ మెంట్ అవార్డులు అందజేస్తున్న సీఎం జగన్ రెడ్డి తన క్యాబినెట్ లోని మంత్రులు, ఎమ్మెల్యేలల్లో ఉన్న కళను కూడా గుర్తించి వారికి అవార్డులు ఇవ్వాలి.

రాత్రింభవళ్లు ఇసుక దోపిడి చేస్తున్న మంత్రి పెద్దిరెడ్డికి ఇసుక రత్న, తన శాఖ గాలికొదిలి కులాల మద్య కుంపట్లు పెడుతున్న అంబటి రాంబాబుకు కుంపటి రత్న, తన స్దాయికి మించి వాగే జోగి రమేష్ కి బడాయి రత్న, రోజాకి కోతలరత్న, పేకాట క్లబ్బులు నిర్వహిస్తున్న గుమ్మనూరు జయరాంకి జూదరత్న, పశువుల దాణాని సైతం బొక్కేస్తున్న సీదిరి అప్పలరాజుకు పశుదాణా రత్న, ఈ భూమ్మీద తానే జ్నానవంతుడున్నట్టు భావించుకుంటున్న సజ్జల రామకృష్ణారెడ్డికి అపరమేధావి రత్న, విజసాయిరెడ్డికి వసూళ్ల రత్న, పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి రౌడీ రత్న, కొడాలి నానికి బూతు రత్న, పేదల భూములు కబ్జా చేస్తున్న బియ్యపు మధుసూదన రెడ్డికి భూబకాసుర రత్నఅవార్డులివ్వాలి.

Leave a Reply