Suryaa.co.in

Andhra Pradesh

ప్ర‌శ్నించే పోస్టులు పెడుతున్నాడ‌ని ఎన్ఆర్ఐ అంజ‌న్ పై గే అనే ముద్ర వేయ‌డం తీవ్ర నేరం

– టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్

అంద‌రికీ విప్పి చూపించిన గోరంట్ల‌, గంట కావాల‌న్న అంబ‌టి, అర‌గంట చాలంటూ చెల‌రేగిన అవంతి ఫోన్లలో ఏ సీన్లూ దొర‌క‌లేదా పోలీసులూ? సోష‌ల్మీడియాలో ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించే పోస్టులు పెడుతున్నాడ‌ని ఎన్ఆర్ఐ అంజ‌న్ పై గే అనే ముద్ర వేయ‌డం తీవ్ర నేరం. వైసీపీ కోసం ప‌నిచేసే క‌ట్ట‌ప్ప‌ల్లా మారిపోవ‌డం వ‌ల్ల‌, హ‌క్కులు-చ‌ట్టాలున్నాయ‌ని మ‌రిచిపోతున్నారు. ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నిస్తే వాళ్ల ద‌గ్గ‌రే గంజాయి దొరుకుతుంది. ప్ర‌తిప‌క్షానికి మ‌ద్ద‌తుగా ఉంటే వాళ్ల మొబైళ్ల మీరు కోరుకున్న వీడియోలు దొరుకుతాయి. శాంతిభ‌ద్ర‌త‌ల ప‌రిర‌క్ష‌ణ మానేసిన‌ కొంతమంది పోలీసులు, జ‌గ‌న్ రెడ్డి కోసం కిరాయికి ప‌నిచేసే ఐప్యాక్ సిబ్బందిలా మారిపోవ‌డం సిగ్గుచేటు. ఉన్న‌త విద్యావంతుడు అంజ‌న్ విష‌యంలో మీరు వ్య‌వ‌హ‌రించిన తీరు పోలీసు వ్య‌వ‌స్థ‌కే క‌ళంకం. దీనికి త‌గిన మూల్యం చెల్లించ‌క త‌ప్ప‌దు.

LEAVE A RESPONSE