రాష్ట్రంలో జగనన్న వసూళ్ల రాజా ప్రభుత్వం నడుస్తుంది

– బీజేపీ నేత లంకా దినకర్ ఫైర్

నిన్న అమరావతి మీద విషపు కన్ను పడింది, నేడు ఆటోనగర్ల పైన పడింది. రేపు అందరి ఆస్తుల పైన పడే ప్రమాదం ఉంది. ఆటోనగర్ల భూములను యాజమాన్యం కొనుగోలు చేసుకున్న ఆస్తి హక్కు. దాన్ని పీక్కునే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి లేదు.

ఈ రోజు ఆటోనగర్ల పైన పడ్డారు. రేపు నగరాల్లో ప్రజల ఇండ్లు, భూములు పైన పడతారు. రైతులకు కేంద్రం నుంచి వచ్చే 6 వేల రూపాయలు సహాయం తానే చేశానని చెప్పుకునే జగన్, ఇప్పుడు రైతుల ముక్కు పిండి వసూళ్లు మొదలు పెట్టారు.

ఇబ్బంది పడుతున్న రైతులకు యూరియా అందించే శ్రద్ధ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు కాని, వత్తిడి చేసి నీటి తీరువా వసూళ్లు పైన శ్రద్ధ మాత్రం ఉంది. చివరికి జగనన్న మార్ట్ ఏర్పాటు చేయాలంటే ప్రతి ఒక్క స్వయం సహాయక సంఘాల సభ్యుల నుంచి 150 రూపాయలను మెప్మా అధికారులు వసూళ్లు చేయడం దుర్మార్గం.

జగనన్న సంక్షేమ ప్రభుత్వం ప్రజలకు సహాయం చేస్తున్నది అని ప్రచారం చేసుకునే జగన్ వాస్తవానికి చేసేది చెత్త నుండి నీటి వరకు పన్నుల వసూళ్లు. రాష్ట్రంలో ఈ ప్రభుత్వం ఒక వైపు ప్రజల నుండి వసూళ్లు, మరో వైపు ప్రజల ఆస్తులకు ఎసరు పెట్టే పాలన చేస్తున్నది.

Leave a Reply