-ఏదేచ్చగా ఏఫ్ఆర్బియం నిబంధనల ఉల్లంఘన
-గ్యారంటీల మాటన గారడి
-కార్పోరేషన్ రుణాల మాటున కాకి లెక్కలు
-మూలధన వ్యయం చేయడంలో అన్యాయం
-బీజేపీ పొలిటికల్ ఫీడ్ బ్యాక్ లంకా దినకర్
గత మూడు సంవత్సరాల్లో ఏఫ్ఆర్బియం పరిధి దాటి తీసుకున్న రుణాల వివరాలు ఇవ్వకుండా ఆ పరిధిలో రుణాలు చేయవచ్చు అని చెప్పిన సీఎం ప్రత్యేక కార్యదర్శి కృష్ణ గారి కి 2020-21 ఆర్థిక సంవత్సరంనాటికి పరిమితి మించి రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులు దాదాపు 18000 కోట్లని 2021-22 ఆర్థిక సంవత్సరంలో రుణపరిమితి లో సర్దుబాటు చేయాలని కేంద్ర ఆర్థిక శాఖ అంటే, ఆ మొత్తాన్ని రాబోయే 3 సంవత్సరల్లో సర్దుబాటుకి అంగీకరించమని విన్నవించినది ఏవరు?, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2021-22 లో కూడా కాగ్ వెబ్ సైట్ లోని నెలవారీ లెక్కల పత్రాల ప్రకారం బడ్జెట్ అంచన అప్పులు 37,029.79 కోట్లు అయితే 31 జనవరి 2022 నాటికి 58669.79 కోట్లు గా గణాంకాలు చెబుతున్నాయి, ఇది పరిమితి లోపల చేసిన రుణాలుగా చెప్పదలిచారా? రాష్ట్రంలో ఉండవలసిన రాష్ట్ర ఆర్థిక మంత్రి ఢిల్లీ లో మంత్రి లాగా అక్కడ అప్పుల కోసం తిప్పలు పడుతున్నారు అని సర్వత్రా తెలిసిన వాస్తవం.
నిబంధనల మేరకు అప్పుల కోసం గ్యారంటీలు ఇవ్వడం తప్పు కాదు, కాని బడ్జెట్ లో చూపవలసిన మద్యం అమ్మకాల పైన పన్ను ఆదాయంని ప్రత్యేకంగా జీఓ 90 మరియు 91 ఇచ్చి మరీ ఏపీఎస్డీసీ తరలించి 25,000 కోట్లు అప్పులు చేయడం ఏ నిబంధనల ప్రకారం చేశారు? ప్రభుత్వం గ్యారంటీ తో రుణం తెచ్చి 2021-22 బడ్జెట్ లో చూపకుండా ఒప్పందం అమల్లోకి రాలేదు అనడన్ని ఏవరు నమ్ముతారు. రాష్ట్ర సివిల్ సప్లయ్ కార్పోరేషన్ రుణాలు 31వేల కోట్లు దాటి పోయాయి, ప్రభుత్వ గ్యారంటీ లేకుండానే ఆ రుణాలు చేశారా? స.హ చట్టం ప్రకారం ఈ కార్పోరేషన్ రుణాల పైన సమాచారం ఇవ్వలేనంత భయం ఈ ప్రభుత్వంకి ఏందుకు పట్టింది. రాష్ట్రంలో కార్పోరేషన్ల రుణాలు కాకి లెక్కలు తలపిస్తున్నాయి, తల తోక లేని సమాధానాలు ఆర్థిక నిర్వాహణ ప్రాధమిక సూత్రలకు విఘాతం కలిగించే విధంగా ఉన్నాయి.
ఈ మధ్య మేము స.హ చట్టం క్రింద వివిధ కార్పోరేషన్ల రుణాల వివరాలు అడిగితే, ఆ సమచారం ప్రభుత్వం వద్ద లేదు అని ఆ సంబంధిత కార్పోరేషన్ల నుండి వివరాలు తీసుకోవాలని సెలవిచ్చారు. అంటే కార్పోరేషన్లు చేసే రుణాల పైన రాష్ట్ర ఆర్థిక శాఖ కి సమచారం లేదు అనే సమాధానం వస్తున్నప్పుడు, ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీలు కార్పోరేషన్లు వినియోగించుకోన్నదో, లేదో అనే అంశంపై ప్రత్యేక కార్యదర్శి సమచారం అయిన తప్పు అవ్వాలి లేదా ఆర్థిక శాఖ మాకు ఇచ్చిన సమాచారం అయినా తప్పు అవ్వాలి. ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చినప్పుడు, ఆ మొత్తాన్ని కార్పోరేషన్లు వినియోగించుకున్న, లేకున్న ఆ గ్యారంటీ ని ప్రభుత్వం బడ్జెట్ నోట్ లో పెట్టి తీరాలి. గ్యారంటీ వాడినప్పుడే చూపాలని చెప్పడం విడ్డూరంగా ఉంది, గ్యారంటీ ఇచ్చారు అంటే దాన్ని వాడుకొని రుణాలు సేకరించే అవకాశాన్ని ఇచ్చినట్లు అని కనీస పరిజ్ఞానం ఉన్న ఏవరైనా చెబుతారు.
ప్రభుత్వం గ్యారంటీల కోసం జీఓ ఇస్తే, దాన్ని మంత్రి మండలి ర్యాటిఫికేషన్ చేసింది అనే అంశం లీగల్ పాయింట్ కోణంలో చూడాలి అంటే ఏంటీ ? న్యాయ సూత్రాల ప్రకారం ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వాలి అంటే చేయవలసిన ప్రక్రియ అనేగా అర్థం, మరి ఆ ప్రక్రియ పూర్తి చేసి పని కాలేదు కదా అంటే ఎలా? ఈ ప్రక్రియ పూర్తి అయ్యింది అంటే రాష్ట్ర ప్రభుత్వ భాద్యత మొదలు అయినట్టు, ఆ మొత్తం గ్యారంటీలను నోట్స్ ఆన్ అకౌంట్ లో చూడాల్సిన భాద్యత ఉంది.
కొంత సమయం కాగ్ లెక్కలు పక్కన పెట్టి, ప్రభుత్వం నిర్వహిస్తున్న వాస్తవ లెక్కలు ప్రభుత్వం వద్ద లేవా? లెక్కలు ప్రభుత్వం ఖరారు చేస్తే, కాగ్ వాటి పైన వారి పరిశీలన చేసి నివేదిక ఇస్తారు అనేది వాస్తవం.
కార్పోరేషన్ రుణాలు పరిధి దాటి చేయడం, నిబంధనలకు విరుద్ధంగా చేయడాన్ని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పదే పదే హెచ్చరిక చేస్తూనే ఉన్నా కూడా రాష్ట్రం ప్రభుత్వం పదే పదే తప్పులు చేస్తూ, స్వంత ఆదాయం మరియు ఆస్తులు లేని ఏపీఎస్డీసీ ని వేలాది కోట్ల స్వంత ఆదాయం మరియు లక్షలాది నగదీకరణ చేయగలిగిన ఆస్తులు ఉన్న ఏన్.హెచ్.ఏ.ఐ తో పోల్చి మేము రుణాలు చేస్తూన్నము అన్నప్పుడే మీ దుర్మార్గపు also విధానం బయటపడింది.
ముఖ్యమంత్రి తన లేఖలో ప్రధాన మంత్రి కి ఏపీఎస్డీసీ రుణాన్ని ఎస్బీఐ ద్వారా విడుదల చేయడానికి సిఫార్సు కోసం విన్నవించినది వాస్తవం, అటువంటి సిఫార్సులు చేయడం గవర్నన్స్ లో సాధ్యం కాదని ప్రధాని కార్యాలయం చెప్పింది వాస్తవం.
కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ఆర్థిక నిర్వాహణ ఉంటే నిబంధనల మేరకు ఆమోదలు ఇస్తుంది కానీ ప్రభుత్వన్ని ప్రయివేటు లిమిటెడ్ సంస్థలు నడిపే విధంగా నిర్వాహణ చేస్తే ఊరుకోదు.
మూలధన వ్యయం పైన ప్రభుత్వం సమాధానం చెప్పాడానికి ఇబ్బంది అయితే, ఈ వివరాలను పరిశీలిస్తే రాష్ట్ర ప్రభుత్వం అసమర్థత బయట పడుతుంది.
ఆంధ్రప్రదేశ్ మూలధన వ్యయం –
ప్రచారం Vs వాస్తవం:
విపత్తు ఉన్నప్పుడు, ఆర్థిక మందగమనం ఉన్నప్పుడు మూలధన వ్యయం ని ప్రభుత్వం అధికంగా చేసి ప్రజలకు ఉపాధి కల్పించి రాష్ట్రానికి భవిష్యత్తు ఆదాయం కల్పించే ఆస్తులు సృష్టిస్తుంది, కాని సీఎం ప్రత్యేక కార్యదర్శి మాత్రం దానికి విరుద్ధంగా చెబుతున్నారు, జగన్మోహనరెడ్డి గారు ఏపీ కి మాత్రమే సీఎం కాబట్టి ఆయన భాద్యత ఏపీ మాత్రమే కాని మిగతా రాష్ట్రాలను తమ అబద్ధాలతో పోల్చి తప్పించుకొలేరు.
2019 – 20 #ఆర్ధికసంవత్సరం లో బడ్జెట్ ప్రకారం నేరుగా ఆస్తులకల్పన మూలధన వ్యయం 32,293 కోట్ల రూపాయలు మరియు రుణాలు, అడ్వాన్స్ 1,789 కోట్ల రూపాయలు వెరసి మొత్తం 34,082కోట్ల రూపాయలు.
2020 – 21 ఆర్ధిక సంవత్సరంలో బడ్జెట్ ప్రకారం నేరుగా ఆస్తుల కల్పన మూలధనవ్యయం రుణాలు, అడ్వాన్స్ వెరసి మొత్తం 29,907.62 కోట్ల రూపాయల.
కాగ్ లెక్కల ప్రకారం:
వాస్తవ మూలధన వ్యయం( కోట్ల రూపాయలలో)
2019-20 :
ఆస్తులకల్పన కోసం 12,242
రుణాలు, అడ్వాన్స్ 5,356
మొత్తం *17,598*
2020-21 :
ఆస్తులకల్పన కోసం
&
రుణాలు, అడ్వాన్స్ *18,975*
విశ్లేషణ:
ఆస్తుల కల్పన కోసం చేసే మూలధన వ్యయం రాష్ట్రంలో ప్రధాన్యత రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది అనే వారు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2021-22 సంబంధించిన రెండవ మరియు మూడవ త్రైమాసికంలో అదనపు ప్రోత్సాహక రుణం సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం నిబంధనల మేరకు 45% మరియు 75% మూలధన వ్యయం లక్ష్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏందుకు సాధించలేక చతికిలపడిందో చెప్పగలరా?
కనీసం 2019-20 & 20201 ఆర్థిక సంవత్సరల్లో మూలధన వ్యయం బడ్జెట్ అంచనా ఏంతో లేదా వాస్తవ వ్యయం ఏంతో చెప్పగలరా? మూలధన వ్యయం అంచనాలలోఅడ్వాన్స్ మరియు రుణాలు కలుపుకుని కేవలం 50% నుండి 55% మాత్రమే సాధించిన రాష్ట్ర ప్రభుత్వంను నిలదీయలసిన పరిస్థితి నుండి ప్రజల ను పక్కదారి పట్టించే ప్రయత్నం దేనికి సంకేతం. 2019-20 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన లెక్కల ప్రకారం వాస్తవ మూలధన వ్యయం 12,242 కోట్లలో 4,779 కోట్లు తప్పు అని కాగ్ తేల్చిoది వాస్తవం కదా?
ఇక ఇప్పటికే పూర్తి అయిన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2021-22 కి అంచనా మూలధన వ్యయం 31,198 కోట్ల రూపాయలు కాగా, అందుబాటులో ఉన్న జనవరి నెల పూర్తి అయ్యేసరికి చేసిన వాస్తవ వ్యయం కేవలం 12,072 కోట్ల రూపాయలు మాత్రమే. ప్రస్తుత తరుణంలో మూలధన వ్యయం లక్ష్య సాధన ద్వారా అదనపు ప్రోత్సాహకరుణాలు సాధించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చతికిలపడింది.
సత్య దూరంతో అవాస్తవల ప్రచారం మాని ఇప్పటికైన ఊహలు నుండి బయటకు వచ్చి వాస్తవాలు ప్రజలకు తెలియజేస్తే మంచిది.