నోరారా బంధాలను ఆప్యాయంగా తెలుగులో పిలుచుకుందాం

” అమ్మ ” అనే పిలుపులో ” ఆప్యాయత ” ఉంది ..
” నాన్న ” అనే పిలుపులో ” నమ్మకం ” ఉంది ..
” తాత ” అనే పిలుపులో ” తన్మయత్వం ” ఉంది ..
” అమ్మమ్మ ” అనే పిలుపులు ” అభిమానం ” ఉంది ..
” నానమ్మ ” అనే పిలుపులో ” నవ్వు ముఖం ” ఉంది ..
” అత్త ” అనే పిలుపులో ” ఆదరణ ” ఉంది ..
” మామ ” అనే పిలుపులో ” మమకారం ” ఉంది ..
” బాబాయ్ ” అనే పిలుపులో ” బంధుత్వం ” ఉంది ..
” చిన్నమ్మ ” అనే పిలుపులో ” చనువు” ఉంది ..
” అన్నా ” అనే పిలుపులో ” అభయం ” ఉంది ..
” చెల్లి ” అనే పిలుపులో ” చేయూత ” ఉంది ..
” తమ్ముడు ” అనే పిలుపులో ” తీయదనం ” ఉంది ..
” అక్క” అనే పిలుపులో ” అనురాగం ” ఉంది ..
” బావా ” అనే పిలుపులో ” బాంధవ్యం ” ఉంది ..
” వదినా ” అనే పిలుపులో ” ఓర్పు ” ఉంది ..
” మరదలు ” అనే పిలుపులో ” మర్యాద ” ఉంది ..
” మరిది ” అనే పిలుపులో ” మానవత్వం ” ఉంది ..
” గురువు ” అనే పిలుపులో ” గౌరవం” ఉంది ..
నేడు మనం కట్టే బట్ట, చదివే చదువు, తినే తిండి అన్నీ పరాయి పోకడలను అనుసరిస్తున్నాయి .
కనీసం” పిలుపులో ” నయినా మన ” అచ్చ తెలుగులో ” పిలుచుకుందాం బంధాలను నిలబెట్టుకుందాం …

Leave a Reply