ప్రజాగళం రోడ్ షోను విజయవంతం చేద్దాం

ప్రజాగళం రోడ్డు షో నిర్వహణకు సన్నాహక సమావేశంలో  పాల్గొన్న సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా, ఎమ్మెల్సీ వేపాడ

సత్తెనపల్లి పార్టీ కార్యాలయంలో గురువారం పట్టణ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి రావు హాజరయ్యారు. సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ… ఈ నెల 6వ తేదీన జరగబోయే ప్రజాగళం రోడ్డుషోను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న ప్రజాగళం కార్యక్రమం, పల్నాడు జిల్లా పర్యటనలో భాగంగా ఈ నెల 6వ తేదీన సత్తెనపల్లి పట్టణంలో రోడ్డుషో జరగనుందన్నారు. కార్యక్రమానికి సంబంధించి రూట్‌ మాప్‌ విధివిధానాలు, నాయకులకు దిశా నిర్దేశం చేసి గ్రామాలలో నాయకులకు, కార్యకర్తలు, అభిమానులు, యువతకు తెలియజేసి పెద్దఎత్తున పాల్గొనేలా చూడాలని కోరారు. మండల పార్టీ అధ్యక్షు లు, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ పార్టీ పదవులలో ఉన్న మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలు బాధ్యతగా తీసుకుని పనిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో నియోజక వర్గంలోని టీడీపీ, జనసేన,బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply