Suryaa.co.in

Andhra Pradesh

సజ్జల బ్రోకర్ పనులు మానుకోవాలి

-రాజకీయ లబ్ధికోసం అవ్వ తాతలను రోడ్డుకీడ్చిన జగన్
-ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన సజ్జలపై క్రిమినల్ కేసు పెట్టాలి
-పింఛన్ దారుల మరణాలకు చీఫ్ సెక్రటరీ, ప్రభుత్వ అధికారులు సమాధానం చెప్పాలి
-దేవినేని ఉమామహేశ్వరరావు

రాజకీయ లబ్ధికోసం అవ్వ తాతలను జగన్ రోడ్డుకీడ్చినట్లు టీడీపీ మాజి మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…

ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన సజ్జలపై క్రిమినల్ కేసు పెట్టాలి. ప్రభుత్వ సొమ్ము దిగమింగుతూ.. శవరాజకీయాలకు పాల్పడుతున్నాడు. రక్తకన్నీరు నాగభూషణంను సజ్జల మరిపిస్తున్నాడు. కోట్ల రూపాయల ప్రభుత్వ సొమ్మును దిగమింగుతూ.. ఏమాత్రం సిగ్గులేకుండా వైసీపీకి వత్తాసు పలుకుతున్నాడు. ప్రభుత్వ సలహాదారునిగా ఉన్న సజ్జలకు ఎన్నికల కోడ్ వర్తించదా? గతంలో చంద్రబాబు పింఛన్లు ఇవ్వాలన్నా మందు జాగ్రత్తతో నిధులు అందుబాటులో ఉంచి పింఛన్ లను అందించేవారు. ఈ పింఛన్ల చరిత్రే తెలుగుదేశానిది… ఈరోజు వైసీపీ జబ్బలు చరుచుకుంటోంది. పింఛన్లు ఇవ్వడానికి బ్యాంకుల్లో డబ్బులు ఉంచాలని వైసీపీ ప్రభుత్వానికి తెలియదా…? మార్చి 30, 31 న రూ.14 వేల కోట్లు వైసీపీ అస్మదీయులకు, వారి కార్యకర్తలకు, వైసీపీ కాంట్రాక్టర్ల కోసం డ్రా చేశారు. ఫైనాన్స్ సెక్రటరీ రావత్, సీఎం పేషీ ధనుంజయ్ రెడ్డి, సెర్ఫ్ సీఈవో మరళీధర్ రెడ్డి, పంచాయతీరాజ్ సెక్రటరీ శశిభూషణ్, చీఫ్ సెక్రటరీలే ఈ పింఛన్ మరణాలకు కారణం.

ప్రతిపక్షాలపై బురదచల్లడానికి వీరు వైసీపీకి సహకరించారు. పింఛన్లు ఇంటికి వెళ్లి ఇచ్చే యంత్రాంగం ఉన్నా జగన్ కనుసన్నల్లో ఉన్న చీఫ్ సెక్రటరీ, అధికారులు కమిటీ వేసుకుని పెన్షన్ దారుల మరణాలకు కారణమైయ్యారు. పండుటాకులపై పగబట్టారు. మీరు ఐఏఎస్ ఉద్యోగాలు ఎలగబెడుతుంది ఈ నీచరాజకీయాలకోసమా? తొమ్మది మంది అధికారులు బాధ్యతల నుండి పక్కకు పోయినా మీలో మార్పు రాదా.? ఆ వృద్ధుల ప్రాణాలు అధికారులు వెనక్కి తీసుకు వస్తారా? ఆ కుటంబాలకు మీరు ఏం సమాధానం చెబుతారు? వృద్ధురాలు చనిపోయి ఆ కుటుంబం బాధలో ఉంటే జోగి రమేష్ శవరాజకీయం చేస్తున్నాడు. ఊరేగింపులు చేస్తామంటూ బుద్ధి లేకుండా మాట్లాడుతున్నాడు. మా నాయకుడు చంద్రబాబుపై జోగి మాట్లాడిన మాటలు గర్హనీయం.. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం… ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేస్తున్నాం… ప్రధాని పాల్గొన్న సభకు నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులకు ఏ పరిస్థితి ఉందో ఇప్పుడు ఈ పింఛన్ మరణాలకు కారకులైన ఈ అధికారులకు కూడా అదే పరిస్థితి ఉంటుంది.

వాలంటీర్ల భవిష్యత్ కోసం చంద్రబాబు ఆలోచిస్తుంటే… వాలంటీర్ వ్యవస్థను ప్రతిపక్షాలు ఏదో చేశాయని అభాండాలు వేస్తున్నారు. వైసీపీ అరాచకాలను తీవ్రంగా ఖండిస్తున్నాం. 2019 ఎన్నికల్లో కూడా ఒక్క ఛాన్స్, కోడి కత్తి డ్రామా, బాబాయి హత్యను అడ్డుపెట్టుకు అధికారంలోకి వచ్చారు. ఇవాళ ఈ మంచాలమీద వృద్ధులను తీసుకొచ్చి శవరాజకీయాలకు జగన్ తెరలేపారు. ఈ దుర్మార్గాలను రాష్ట్ర ప్రజలు ఖండిస్తున్నారు. కనీసం సచివాలయాల వద్ద తాగునీరు కూడా ఏర్పాటు చేయకుండా పింఛన్ దారులను ఇబ్బంది పెట్టారు. ఇన్ టైంలో డబ్బులు వచ్చి ఉంటే ఈ పింఛన్ మరణాలు సంభవించేవా? దీనికి ఈ జగన్ రెడ్డి సమాధానం చెప్పాలి, ఈ విషయంపై చీఫ్ సెక్రెటరీ మాట్లాడాలి. వైసీపీ తప్పుడు కార్యక్రమాలతో పింఛన్ దారులకు మండుటెండలో తీవ్ర ఇబ్బంది పెట్టి బ్లూ మీడియాలో అసత్య ప్రచారాలు చేయిస్తున్నారు.

బాబాయి హత్యపై సజ్జల చిలక పలుకులు పలుకుతున్నాడు. అసలు సజ్జల వెంటనే ప్రభుత్వ సలహాదారుని పదవికి రాజీనామా చేయాలి. ఇద్దరు చెల్లెళ్లు అడుగుతున్న ప్రశ్నలకు జగన్ సమాధానం చెప్పాలి… హత్యలో ముద్దాయిలను పక్కన పెట్టుకుని జగన్ తిరుగుతున్నాడు. ఈ సజ్జల ఇంకా సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు.

అవ్వా తాతలతో పరిహాసాలాడుతున్నాడు. ఓట్ల కోసం ఇంత నీచ రాజకీయాలు అవసరమా జగన్ ? ఓట్లే కావాలంటే శవాన్ని తీసుకెళ్లమని మీ మంత్రి జోగిరమేష్ కు గడ్డిపెట్టింది కనిపించడంలేదా ? ఇంతకంటే ఏం చెప్పాలి జగన్.. శవాలు తీసుకుని పార్టీకార్యాలయాలకు వస్తా? బుద్ధి జ్ఞానం ఉందా…ఈ పాపం మీకు తప్పకుండా తగులుతుందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు.

LEAVE A RESPONSE