అబద్ధాలు సిగ్గుపడుతున్నాయి..

Spread the love

అబద్ధాలు నవ్వుకుంటున్నాయి
ఉద్యోగాల కల్పననే
మాట వింటూ…
విదేశాలకు వలస వెళ్ళిన యువతను చూసి

అబద్ధాలు
నివ్వెర పోతున్నాయి
అర్ధసత్యాలు అసత్యాల
సంగమం చూసి

అబద్ధాలు
ఈర్ష్య పడుతున్నాయి
నల్లధనం వెనక్కి రాకున్నా
తిరిగి అధికారంలోకొచ్చిన
తంతును చూసి

అబద్ధాలు
కొత్త పాఠాలు నేర్చుకుంటున్నాన్నాయి
నిబద్దత కోల్పోయిన
అబద్ధాల్ని చూస్తూ

అబద్ధాలు
సిగ్గు పడుతున్నాయి
కొత్త అర్థాలుకు
నిఘంటువులను
వాళ్ల దగ్గర వెదుకుతూ….

గోలి మధు

Leave a Reply