జీవితం… తృప్తి… విస్తరాకు

విస్తరాకును ఎంతో శుభ్రంగా ఉంచుకొని నీటితో కడిగి నమస్కారం చేసుకుని భోజనానికి కూర్చుంటాము.
భోజనము తినేవరకు ఆకుకు మట్టి అంటకుండా జాగ్రత్త వహిస్తాము.
తిన్న మరుక్షణం ఆకును (విస్తరిని) మడిచి దూరంగా పడేస్తాం.
మనిషి జీవితం కూడా అంతే. ఊపిరి పోగానే ఊరి బయటకు తీసుకువెళ్ళి దహనం చేస్తారు.
విస్తరాకు పారేసినప్పుడు సంతోషపడుతుంది, ఎందుకంటే పోయేముందు ఒకరి ఆకలిని తీర్చటానికి తను ఉపయోగపడ్డానులే అన్న తృప్తి ఆకుకు ఉంటుంది.
అట్లాగే… మానవుడుకి కూడా సేవ చేసే అవకాశము వచ్చినపుడు, అందరూ సేవ చేయాలి.
మళ్లీ ఎప్పుడైనా చేయవచ్చులే అనుకొని వాయిదా వేయకూడదు.
ఆ అవకాశము మళ్లీ వస్తుందని అనుకుంటే కుండ ఎప్పుడైనా పగిలిపోవచ్చు.
అప్పుడు విస్తరాకుకు ఉన్న తృప్తి కూడా ఆ మానవుడుకి ఉండదు.
ఎంత సంపాదించి ఏమి లాభం? ఒక్కపైసా కూడా తీసుకుపోలేరు.
కనీసం ఒంటి మీద బట్ట కూడా మిగలనివ్వరు. అందుకే.. ఆత్మతృప్తి చెందాలి. అంటే.. ఊపిరి ఉన్నంత వరకు నలుగురికి ఉపయోగపడే విధంగా జీవించాలి.

– శాంతి

Leave a Reply