Suryaa.co.in

Andhra Pradesh

ఇట్లు.. మిస్బా ఆత్మ!

జగన్ అంకుల్,

మా అబ్బ సోడా అమ్మే కూలీ అంకుల్. తాను మా కుటుంబం కోసం కష్టపడుతూ.. నా మీద ప్రేమతో.. నన్ను పలమనేరు ప్రైవేటు స్కూలులో ఫీజు కట్టి చదివించారు. మరి నేను ఆయన కష్టానికి తగ్గట్లుగా ఇష్టపడి చదవాలి కదా అంకుల్. అదే నేను కూడా చేశాను. కష్టపడి చదివి స్కూలు టాపర్‌గా నిలిచాను.

నాకు తెలియదు కదా అంకుల్ మీ వైకాపా పార్టీ నాయకుల పిల్లలు ఎవరో? కనీసం వారి యూనిఫారం మీ పార్టీ కలరులో వుంటే గుర్తుపెట్టుకొనేదాన్ని. కనీసం మెడలో ఏదన్నా మీ పార్టీ గుర్తింపు కార్డు వేసి వుంటే నాకు తెలిసేది. అలాగే వారికంటే తక్కువ మార్కులు తెచ్చుకొనేలా నాలాంటి మైనారిటీ ముస్లీం అమ్మాయి చదువుకోవాలని తెలియదు కదా అంకుల్. మీ పార్టీ వారిని మా స్కూలుకు పంపి చెప్పి వుంటే అర్థం చేసుకొనేదాన్ని అంకుల్.

స్కూలు నుండి టిసి ఇచ్చి పంపేసి, వేరే స్కూలులో వేరే సిలబస్‌ను అర్థం చేసుకోవడం కన్నా.. మీ పాలనలో వచ్చిన ఈ కొత్త పెను విద్యా విప్లవం గురించి అర్థం చేసుకోలేక.. అబ్బ మరియు మా.. కు ఆత్మహత్య లేఖ వ్రాసి, ఉరేసుకొని వ్రేలాడేప్పుడు కూడా.. నా చావు మిమ్మల్ని ఆలోచింపజేస్తుంది అని ఆశించాను ఆఖరి శ్వాస వరకు అంకుల్.

మీ నుండి స్పందన లేదు. మా పలమనేరు ప్రజలు, పార్టీలు పోరాడితే.. కేసులు పెట్టి, సస్పెండ్ చేసి, మళ్లీ వేరే స్కూలులో పోస్టింగ్ ఇచ్చారు. మా అబ్బ మరియు మా నాకు జరిగిన అన్యాయంకు శిక్ష పడుతుంది అని ఆశపడ్డారు. మళ్లీ కూలీపనులు చేసుకొంటూ ఇంకా ఆశతో ఎదురుచూస్తూనే ఉన్నారు. నన్ను తలచుకొంటూ రోజూ బాధపడుతూ ఉంటారు. బాగా చదివే కూతురు అంటే ఎవరు మర్చిపోగలరు ఆ కూతురిని అంకుల్.

ఇట్లు

మిస్బా ఆత్మ

– మాచవరపు రామారావు

LEAVE A RESPONSE