Suryaa.co.in

Andhra Pradesh

మంగళగిరిలో కన్ స్ట్రక్షన్ అకాడమీ

పాత ఇసుక విధానంతో నిర్మాణరంగానికి గత వైభవం
బైక్ మెకానిక్ లకు ఆధునాతన వాహనాలపై శిక్షణ
బైక్ మెకానిక్ లు, ఇసుక కార్మికులతో నారా లోకేష్ భేటీ

ఉండవల్లి: రాబోయే ఎన్నికల్లో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిర్మాణ కార్మికులకు మెరుగైన శిక్షణ కోసం మంగళగిరిలో కన్ స్ట్రక్షన్ అకాడమీ ఏర్పాటుచేస్తామని యువనేత నారా లోకేష్ చెప్పారు. మంగళగిరి నియోజకవర్గం చిర్రావూరు, ప్రాతూరు, గుండిమెడ, పెదకొండూరు, గొడవర్రు గ్రామాలకు చెందిన ఇసుక ముఠా కార్మికులతో ఉండవల్లి నివాసంలో యువనేత భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… జగన్ పాలనలో మొదటి బాధితులు భవన నిర్మాణరంగం కార్మికులే. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పాత ఇసుక విధానం తీసుకువచ్చి, నిర్మాణరంగానికి గత వైభవం చేకూరుస్తాం. జగన్ పాలనలో ఇసుక అందుబాటులో లేకుండా చేయడం, అమరావతి నిర్మాణ పనులు నిలిపివేయడంతో కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పనుల్లేక వందలాది మంది భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు

. గతంలో కార్మిక బోర్డు ద్వారా వివిధ సంక్షేమ కార్యక్రమాలు అమలుచేశాం.. నేడు జగన్ పాలనలో కార్మిక బోర్డు నిధులు రూ.2500 కోట్లు పక్కదారి పట్టించారు. అధికారంలోకి వచ్చాక కార్మిక సంక్షేమ బోర్డును ప్రక్షాళన చేయడంతో పాటు చంద్రన్న బీమా పథకం, పనిముట్లు అందజేస్తామని లోకేష్ భరోసా ఇచ్చారు. ఇసుక క్వారీలు, భవననిర్మాణ రంగ కార్మికులు ఈ సందర్భంగా తమ సమస్యలను లోకేష్ దృష్టికి తీసుకువచ్చారు.

ఈ సందర్భంగా టూ వీలర్ మెకానిక్ లు తమ సమస్యలను లోకేష్ దృష్టికి తీసుకువచ్చారు. అసోసియేషన్ కు కమ్యూనిటీ భవనం నిర్మాణంతో పాటు ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి. పనిముట్లు, షాపుల అభివృద్ధికి సబ్సీడీపై రుణాలు మంజూరుచేయాలని విజ్ఞప్తి చేశారు. ఆటోనగర్ లో గ్యారేజీలకు స్థలాలు ఇవ్వాలని కోరారు. తమ పిల్లల చదువులకు ఇబ్బందులు పడుతున్నామని, జగన్ పాలనలో నిలిచిపోయిన విదేశీ విద్య పథకాన్ని కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు.

LEAVE A RESPONSE