Suryaa.co.in

Telangana

‘విభజన పూరిత రాజకీయాల’ను ఎలా అర్థం చేసుకోవాలో ‘లోకమంథన్’ చెబుతుంది

– కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

హైదరాబాద్‌: ప్రతి రెండేళ్లకోసారి ఈ లోక్ మంథన్ కార్యక్రమం దేశంలో వేర్వేరు చోట్ల నిర్వహిస్తాం. ఈసారి భాగ్యనగరం లో నిర్వహించడం మా అదృష్టంగా భావిస్తున్నాం. గతంలో మూడు వేర్వేరు చోట్ల ఈ సమావేశాలు జరిగాయని కేంద్ర మంత్రి జి.కిషన్‌ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన మంగళవారం మీడియాతో ఏమన్నారంటే.. భాగ్యనగరంలో విస్తృతంగా ఈసారి లోకమంథన్ 2024 నిర్వహిస్తున్నాం. ఇందుకోసం 2 నెలలుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. భారత్ తో పాటుగా వివిధ దేశాలనుంచి వివిధ రంగాల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. కళాకారులు, అకడమీషియన్స్, థింకర్స్, రీసెర్చర్స్, సోషల్ వర్కర్స్, స్వచ్ఛంద సంస్థలు.. ఇలా వివిధ సంస్థలు ఇందులో స్వచ్ఛందంగా భాగస్వామ్యం అవుతున్నాయి.

కళా, శిక్ష, మీడియా, రాజకీయాల ద్వారా.. దేశంలో విభజన పూరిత రాజకీయాలు జరుగుతున్నాయి. వీటిని ఎలా అర్థం చేసుకోవాలనేదే ఈసారి లోకమంథన్ కార్యక్రమం ఉద్దేశం. భారతదేశ భిన్నత్వంలో ఏకత్వాన్ని మరింత బలోపేతం చేయడం, ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం అందించడం మా ఉద్దేశ్యం. అభివృద్ధి చెందిన భారత నిర్మాణంలో సమాజం పాత్ర, ఆత్మనిర్భరత సాధించేందుకు చేయాల్సిన కృషి తదితర అంశాలు ఇందులో చర్చ జరుగుతోంది. గిరిజన వర్గాన్ని విద్య, వైద్య, ఆర్థిక, సామాజిక పరంగా అభివృద్ధి చేయడం మన బాధ్యత. వారి కళలను, సంప్రదాయాన్ని ప్రోత్సహించడం దిశగా లోకమంథన్ నిరంతరం పనిచేస్తోంది.

ఇది ఏదో ఒక సంస్థ నిర్వహిస్తున్న కార్యక్రమం కాదు. ఇందులో ప్రజ్ఞా ప్రవాహ్ నేతృత్వంలో.. ప్రజ్ఞాభారతి, ఇతిహాస సంకలన సమితి, సంస్కార భారతి, విజ్ఞాన భారతి, అధివక్తా పరిషద్, సాహిత్య పరిషద్, భారతీయ శిక్షణామండల్ వంటి వివిధ సాంస్కృతిక సంస్థల సామూహిక భాగస్వామ్యంతో భాగ్యనగరంలో కార్యక్రమం జరగనుంది. 21 నవంబర్ నాడు ప్రారంభం అవుతుంది. 24 నవంబర్ నాడు లోకమంథన్ ముగింపు ఉంటుంది. భారతీయ సంస్కృతి సంప్రదాయాల కలబోతగా ఈ కార్యక్రమం ఉంటుంది.

21వ తేదీనాడు ఎగ్జిబిషన్స్, కల్చరల్ ఫెస్టివల్ ను పూర్వ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభిచంచనున్నారు. 22 తేదీనాడు వివిధ దేశాల ప్రతినిధులతో మేధోమథనం కార్యక్రమాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభిస్తారు. 100 కుపైగా కళల ప్రదర్శన, 1500కు పైగా కళాకారులు తమ కలను ప్రదర్శిస్తారు. 400కు పైగా అరుదైన భారతీయ సంగీత పరికరాల ప్రదర్శన కూడా ఉంటుంది.

వివిధ గిరిజన సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, వివిధ రాష్ట్ర ప్రభుత్వాల పెవిలియన్స్ ఇందులో ఏర్పాటుచేశాం. ఈ కార్యక్రమం విజయవంతం కావడంలో మీడియా సంపూర్ణ సహకారాన్ని ఆకాంక్షిస్తున్నాను.

LEAVE A RESPONSE