Suryaa.co.in

Andhra Pradesh

లోకేష్‌ లుక్‌ క్లాస్‌..స్పీచ్‌ ఊర మాస్‌

– లోకేష్‌ మాట తీరు, మనిషి రూపం మారిపోయింది
– కరోనా ఆంక్షల సమయంలో డైట్‌, వర్కవుట్స్‌తో న్యూ లుక్‌
– విమర్శలను సలహాలుగా స్వీకరించి తీర్చిదిద్దుకున్న మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌

అమరావతి: కరోనా ఆంక్షలు ముగిశాక చాలారోజుల తరువాత కనిపించిన నారా లోకేష్‌ న్యూ లుక్‌ చూసి టీడీపీ నేతలు ఆశ్చర్యపోయారు. లావుగా..నున్నగా షేవ్‌ చేసిన లోకేష్‌ను చాలారోజులుగా చూసిన జనం లైటుగా గెడ్డం, సన్నని మీసకట్టు, స్లిమ్‌ అయి అద్దిరిపోయే లుక్‌తో కనిపించాడు. నారా లోకేష్‌ను ట్రోల్‌ చేసేందుకు వందల కోట్లు వెచ్చించి ఏళ్లుగా టీములను రన్‌ చేసిన వైసీపీ సర్జరీ చేయించు కున్నాడని పుకార్లు లేపింది. ఫేక్‌ పోస్టులు వేసింది. టీడీపీ లీడర్లు, మీడియా మిత్రులు ఉండబట్టలేక నారా లోకేష్‌ 2.0 రహస్యం ఏంటని అడిగేశారు. డైట్‌, వర్కవుట్స్‌ గురించి వివరించాడు.

కరోనా కాలంలో ఇంట్లో ఉంటూ యాప్‌ వేసుకు ని చేసిన వర్కవుట్స్‌, వాడిన డైట్‌ వెల్లడిరచాడు. తూటాల్లాంటి మాటలు, అనర్ఘళంగా తెలుగు మాట్లాడటం.. స్పీచులో సైటైర్లు పెరిగాయి. మీడియా సమావేశాల్లోనూ సాక్షి, టీవీ 9, ఎన్టీవీ వాళ్లు వచ్చారా అని అడగటం.. వచ్చారని చెబితే పిలిచి మరీ ఏం మిత్రమా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? మీ వాడిలా నేను పారిపోను అంటూ ర్యాగింగ్‌ కూడా ఆరంభించాడు. బొద్దుగా ఉన్నారని విమర్శలు వస్తే వాటిని పాజిటివ్‌గా తీసుకుని వర్కవుట్స్‌తో ముద్దుగా మారిపోయాడు. మాట్లాడేటప్పుడు తడబడుతున్నారని ట్రోల్‌ చేస్తే.. ఎస్‌.. నా చదువు మొత్తం ఇంగ్లీషు మీడియంలోనే సాగింది.. తెలుగులో మాట్లాడేటప్పుడు ఒక పదం అటు ఇటు అవ్వొచ్చంటూ నే…అనర్ఘళంగా తెలుగు మాట్లాడుతున్న లోకేష్‌ను చూసి ఆశ్చర్యపోవడం వైసీపీ పేటీఎం బ్యాచుల వంతయింది. శిలా తానే, శిల్పీ తానే అయి అద్భుత శిల్పంగా తనను తాను మార్చుకున్న నారా లోకేష్‌ లుక్‌ క్లాస్‌, స్పీచ్‌ ఊర మాస్‌ అంటున్నారు జనాలు.

LEAVE A RESPONSE