శ్రీరాముడు సమస్త మానవాళికి చెందినవాడు

-దేవుడు ఏ మతానికి లేదా కులానికి చెందినవాడు కాదు
-రాముడు న్యాయానికి, ధర్మానికి, మానవత్వానికి ప్రతీక
-బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్

అయోధ్యలో రామ మందిరం ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని ప్రతిపక్ష పార్టీలు తిరస్కరించడంపై బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ తీవ్రంగా స్పందించారు. దశాబ్ధాలుగా భారతదేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీతో సహా ఇండీ కూటమికి జాతి దైవం, దేశ ప్రజల విశ్వాసమైన శ్రీరాముడిని గౌరవించకపోవడం కోట్లాది మంది ప్రజల ప్రజలను అవమానించడమేనన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొనాలంటే జనవరి 22న అధికారికంగా సెలవు ప్రకటించి, అన్ని దేవాలయాల్లో దీపాలు వెలిగించేలా, పూజా కార్యక్రమాలు నిర్వహించేలా జీవో విడుదల చేయాలని శ్రీరాముడి ఆశీస్సులు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

జనవరి 22న అయోధ్యలో జరిగే శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠాపన అనేది ఏ పార్టీకి లేదా సంస్థకు చెందినది కాదని, పదవులు, పదవులతో సంబంధం లేకుండా భగవంతునిపై విశ్వాసం ఉన్న మానవులు నిర్వహించే పవిత్ర కార్యక్రమమన్నారు. 500 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న దేశ ప్రజల డిమాండ్‌ను తొమ్మిదేళ్లలో సాకారం చేయడంలో ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం కీలకపాత్ర పోషిస్తోందన్నారు.

140 కోట్ల మంది ప్రజల ఆశీర్వాదంతో ఇది సాధ్యమైందన్నారు. అయితే అయోధ్యలోని శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొనేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు ఆసక్తిగా ఉన్నప్పటికీ.. కాంగ్రెస్ అధిష్టానం మాత్రం ఒకవర్గం వారిని బుజ్జగించే ధోరణితో, రాజకీయ మైలేజీ కోసం ఈ కార్యక్రమంలో పాల్గొనకుండా తిరస్కరించడం ప్రజల మనోభావాలను అవమానించడమేనని తెలిపారు.

జనవరి 22 తర్వాత యూపీ కాంగ్రెస్ నేతలు అయోధ్యను సందర్శిస్తారన్న నివేదికపై ఎన్వీ సుభాష్ మాట్లాడుతూ, ‘రాముడిపై విశ్వాసం ఉన్న భారత పౌరులందరూ దేశంలోని ఇతర చారిత్రక మరియు ఉత్కంఠతను, ఉద్వేగాన్ని కలిగించే ప్రదేశాలను సందర్శించినట్లే రాముడిని పూజించడానికి ఈ స్థలాన్ని సందర్శించవచ్చని అన్నారు.

Leave a Reply