“మాచన” సేవా తపన!

– జీవితాల్లో మార్పు తెస్తున్న పొగాకు నియంత్రణ

“పొగాకు క్యాన్సర్ కారకం”
అని సిగరెట్ డబ్బా పై ఉన్నా హాయిగా దమ్ము కొడతారు ఎందరో..
ఆరోగ్యం పై పొగాకు పగ పడితే జీవితం లో రన్ ఔట్ అయ్యే వారు మరెందరో.
వాళ్ళలో కొందరు ఓ వ్యక్తి మాటలు వుంటే మాత్రం
పొగాకు, ధూమపానం అలవాటు నుంచి యు టర్న్ తీసుకోవడం తధ్యం.
దటీజ్ మాచన రఘునందన్.. సాక్షాత్ డబ్ల్యు హెచ్ ఓ వెల్డన్ రఘునందన్ అని కితాబు ఇచ్చినా ఓస్ ఇంతేనా అనుకున్నారు.

అదే ఓ మారుమూల గ్రామం లో ఓ వ్యక్తి ..సార్ నేను పొగాకు, ధూమపానం మానేశా.
అన్న మాట కు మాత్రం ఎంతో సంతోషించారు.
మాచన రఘునందన్
ఓ సాధారణ ఉద్యోగి. సాదా సీదా వ్యక్తి.
కానీ అతను సాధిస్తున్న ప్రగతి, పొగాకు నుంచి విముక్తి.

విజయం చిన్నదైనా..పెద్దదైనా అది ఇచ్చే సంతృప్తి అపారం.
మన చుట్టూ ఉండేవారిలోనే కొందరు సామాన్యులు జీవితం లో సాధించిన అసామాన్య విజయాలు ఔరా.. అనిపించక మానవు.

మాచన రఘునందన్..పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటీ తాశిల్దార్.. ఒక విశిష్ట వ్యక్తి గా గుర్తింపు పొందారు. జీవితాల్ని చిధ్రo చేస్తున్న పొగాకు పై పగ బట్టారు. రెండు దశాబ్దాలు గా పొగాకు నియంత్రణ తన శ్వాస , ధ్యాస గా అలుపెరగని, నిర్విరామ కృషి చేస్తున్నారు.అటు ఉద్యోగం చేస్తూనే..డ్యూటీ తరువాత సమయాన్ని కాలక్షేపం కోసం వెచ్చించకుండా.. సమాజ హితం కోసం పాటు పడుతున్న ఓకే ఒక్క వ్యక్తి మాచన రఘునందన్.

ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది అంటే..ఇంక చాలు హాయిగా ఏదో కాస్తో..కూస్తో వెనకేసుకుందాం. ఆన్న యావ ఉన్న వాళ్ళే అధికం. కానీ మన మాచన రఘునందన్ మాత్రం డిఫరెంట్.
మేడ్చల్ జిల్లా మూడు చింతల పల్లి మండలం కేశవరం, ఈ అధికారి స్వస్థలం. ఇటీవలే ప్రపంచఛ కాన్సర్ దినోత్సవం సందర్భంగా రఘునందన్ ను ఉభయ తెలుగు రాష్ట్రాల వారు విశిష్ఠ అతిథి గా ఆయన చేత పొగాకు నియంత్రణ బాట లో నడుస్తాం అని ప్రతీణ పూనారు. రఘునందన్ మాటలు వ్యక్తుల జీవితాల్లో మేలు కొలుపు బాటలు అవుతున్నాయి. ఆయన ఇలా.. ఎలా చేయగలుగు తున్నారు. కారణం ఏంటి..ఆన్న సందేహాలకు సమాధానాలు ఆయన చెప్పిన మాటల్లోనే, యధాతధంగా..
యవ్వనం ఉరకలు వేసే వయసులో సరదాగా మొదలయ్యే పొగాకు, ధూమపానం అలవాట్లు చివరకు వ్యసనంగా మారుతాయి. అలా ధూమపానానికి బానిస అయ్యి.. నా ఇరువురు స్నేహితుల జీవితం అర్దంతరంగా రన్ ఔట్ అయ్యారు. ఆ రెండు సంఘటనలు నా జీవిత పయనాన్ని మార్చాయి. స్నేహితులకు చేసిన బాస, పొగాకు పై చైతన్య ఉద్యమ బాటలో అడుగు వేయడానికి దారితీసింది. “ధూమపానం వద్దు బాబూ! ఆరోగ్యం చెడగొట్టుకోవద్దు బాబూ!”…నా..నినాదం. ఓ వైపు ప్రభుత్వ ఉద్యోగం చేస్తూనే మరో వైపు ధూమపాన వ్యతిరేక ఉద్యమం కొనసాగిస్తున్నాను.
మాధ్యమిక చదువు పూర్తి అయ్యి, ప్రభుత్వ నగర కళాశాల లో బీ ఎస్సీ లో చేరా.. కాళీ వర ప్రసాద్ దీక్షితులు పోలీసు కానిస్టేబుల్ గా చేరాడు.
పదేళ్ళ తరువాత ఓ రోజు సికింద్రాబాద్ తిరుమల్ గిరి మీదుగా కేశవరం వెళుతున్నా..ఎడమ పక్క ఉన్న ట్రాఫిక్ పోలీసు స్టేషన్ సమీపం లో ఉన్న పాన్ డబ్బా లో అమ్మ కు ఇష్టం అని క్రేన్ వక్క పొడి కొంటున్నాను. ఇంతలో వీపుపై దెబ్బ పడింది.
ఎవడ్రా..అని వెను తిరిగి చూస్తే..
ఇంటర్ దోస్తు దీక్షితులు..
ఇరువురం పలకరించుకున్నాం.
ఏరా ఎలా ఉన్నావని రఘునందన్ అడగగానే దీక్షితులు నిర్వేదంలోకి వెళ్ళాడు.
ఏముంది, రాంగ్ రూట్లో వచ్చే వాళ్లకు నేను చలానా వేస్తే..దేవుడు నాకు చలానా వేశాడు రా అన్నాడు.
అతను ఏమన్నాడో నాకు ఒక్క క్షణం అర్దంకాలేదు. అందుకే నువ్వు అన్నది అర్థం కాలేదు రా అన్నాను.
దానికి దీక్షితులు జవాబు ఇస్తూ…అదేరా.. నువ్వు ఊరికే నస పెట్టేవాడివి కదా. దమ్ము కొట్టకు రా.. అని, నేను వినలేదు. ఇపుడు కూడా సిగరెట్ ల కోసమే వస్తే నువ్వు కలిశావు. నేను బాగానే ఉన్నాను అనుకుంటున్నా..వా రా!. ఇంకొన్ని రోజుల్లో “టికెట్” తీసుకుని వెళ్ళడానికి రెడీ గా ఉన్నా. క్యాన్సర్ అనే వీసా, అనారోగ్యం అనే పాస్ పోర్టు తో అన్నాడు అంతే సరదాగా.
ఆ మాట నేను షాక్ కు గురయ్యా. స్నేహితుడి కష్టాన్ని తలచుకోగానే దుఃఖం వచ్చేసింది. దుఃఖం దిగ మింగుకున్నా.
మరో ఏడాది ఇట్టే గడచి పోయింది.
ఓ రోజు మాతోపాటు బాగ్ లింగం పల్లి అంబేడ్కర్ కాలేజీ లో ఇంటర్ చదివిన స్నేహితుడు, బంధువు గద్దె వెంకట నరసింహ వద్దకు వెళ్ళాను “మాచన”
కాళి గాన్ని చూసొచ్చావా? అని అడిగాడు.
అతను ఆస్పత్రిలో ఉన్నాడని తెలుసుకొని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దీక్షితులు ను చూశా ఏడుపు ఆగలేదు.
కాళి చిక్కి శల్యమయ్యాడు.
రఘు ఉద్యోగం నుంచి రిటైర్ మెంట్ కాక ముందే.. జీవితం నుంచి రన్ అవుట్ అవుతున్నా..రా అన్నాడు కాళి.
నీతో పాటు డిగ్రీ చదివి ఉంటే నీ నస భరించ లేక అయినా సిగరెట్ మానేసే వాణ్ణి అన్నాడు. నాకు ఆ అదృష్టం లేకుండా పోయింది. అయినా నాదో చివరి కోరిక తీర్చరా అన్నాడు..
చెప్పరా..నా కాలేయం ఇవ్వనా?! అన్నాను.
చచ్చే వానికి నీ కాలేయం ఎందుకు గానీ .నీకు చదువుకు సాయం చేశా అన్నవే..
అందుకు బదులుగా నా కోసం
సమాజానికి సాయపడు.
నాకు పదే పదే చెప్పావు కదా.
సిగరెట్ మాను అని ,అదే మాట రోజూ ఒక్కరికో ఇద్దరికో చెప్పు .. చెప్తా అని మాట ఇవ్వు అన్నాడు. సరే అని చేతిలో చెయ్యి వేసి ..
మనసా వాచా కర్మణా ప్రమాణం చేస్తున్నా ఇక పై మరే మిత్రుడు స్మోకింగ్ మూలంగా తన స్నేహితున్ని కోల్పోకుండా నాకు చేత నైన మేరకు.
చెప్తూనే ఉంటా ఆని బాస చేశా.

ధూమపానం అలవాటు ఉంటే పెళ్ళికి రావొద్దు!
ఇదీ నేను నా పెళ్ళి కార్డులో ప్రత్యేకంగా వేసిన నినాదం.
అదేంటి అలా వేశారు అని కాబోయే శ్రీమతి అడిగింది.
“మతి ఉన్నొడు దమ్ము కొట్టడు.
ధూమపానంకు ప్రాణం బలి పెట్టడు.
అమ్మా నాన్నలకు పుత్ర శోకం పెట్టడు. నా అభిప్రాయం తప్పు అని భావిస్తే ..వీడు కరెక్ట్ కాదు అనుకుంటే .. నా బదులు వెరొకర్ని పెళ్లి చేసుకో అని చెప్పాను.
జనం కోసం నువ్వు ఆలోచించడమే నాకు బాగా నచ్చింది అని మూడు ముళ్లు వేయించుకుంది శ్రీమతి.
అలా మొదలైన రఘునందన్ పొగాకు వ్యతిరేక ఉద్యమం విస్తరించింది. ఈ ఉద్యమంలో అనేక అవార్డులూ దక్కాయి.
ఈ ఏడాది లో నే ప్రతిష్టాత్మక అఖిల భారత వైద్య విజ్ఞాన మండలి వారి దక్షిణ భారత పొగాకు నియంత్రణ సదస్సు లో పాల్గొన్న ఒకే ఒక్క వైద్యేతర రంగానికి చెందిన వ్యక్తిగా ఘనత దక్కింది. పలు విదేశాల నుంచి టుబాకో కంట్రోల్ సదస్సు లో పాల్గొనాలని ఆహ్వానాలు అందాయి. కానీ డ్యూటీ లో బిజీ వల్ల వెళ్ల లేక పోయా.!

( ఫిబ్రవరి 4 ప్రపంచ కాన్సర్ దినోత్సవం)