మంగళగిరి వైకాపా ఖాళీ -టిడిపిలో భారీ చేరికలు

-నారా లోకేష్ సమక్షంలో టిడిపిలో చేరిన 600 వైకాపా కుటుంబాలు
-వైకాపాని వీడి టిడిపిలో చేరిన ముఖ్యనాయకులు, పంచాయతీ వార్డుసభ్యులు
-నియోజకవర్గ అభివృద్ధికి అంతా కలిసి పనిచేద్దామని నారా లోకేష్ పిలుపు

రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ వైపు జనం చూస్తున్నారు. యువగళం సారధి నారా లోకేష్ పూరించిన శంఖారావంతో టిడిపికి స్వచ్ఛందంగా వైకాపా నేతలు మద్దతు ప్రకటిస్తున్నారు. టిడిపిలో చేరేవారితో మంగళగిరి నియోజకవర్గంలో వైకాపా పూర్తిగా ఖాళీ అయ్యింది.

ఉండవల్లి నివాసంలో ఆదివారం టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమక్షంలో 600 కుటుంబాలు టిడిపిలో చేరాయి. వైకాపా ముఖ్యనేతలు, పంచాయతీ వార్డు సభ్యులు, ఆలయ కమిటీ చైర్మన్, వివిధ సంఘాల అధ్యక్షులు, సగర కుల పెద్దలు తెలుగుదేశం పార్టీలో చేరారు.

అరాచక వైకాపా సర్కారు పని అయిపోయిందని, టిడిపి-జనసేన ప్రభుత్వం ఏర్పడుతుందని, రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తుందని భరోసా ఇచ్చారు. మంగళగిరిని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు అందరమూ కలిసికట్టుగా పనిచేద్దామని లోకేష్ పిలుపునిచ్చారు.

మంగళగిరి పట్టణం 22వ వార్డుకి చెందిన వైకాపా నేత- రాష్ట్ర సగర సంఘం కార్యదర్శి జూటూరు ఏడుకొండలు నేతృత్వంలో 21,22వ వార్డులకి చెందిన బేతంపూడి గ్రామానికి చెందిన 75 కుటుంబాలు, జొన్నకూటి మల్లేశ్వరి ఆధ్వర్యంలో 25 కుటుంబాలు టిడిపిలో చేరాయి. తాడేపల్లి టౌన్ వైకాపాకి చెందిన వైకాపా నాయకులు దారా నాని, ఎనుబర్రి నరేష్ తోపాటు 14వ వార్డుకి చెందిన 50 కుటుంబాలు, వైకాపా నేత మేకా శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి వైకాపాకి చెందిన మాజీ సర్పంచ్ మన్నెం సుజాత- మన్నెం కిశోర్ దంపతులతోపాటు వంద మంది కుటుంబాలకు పసుపు కండువాలు కప్పి టిడిపిలోకి ఆహ్వానించారు.

మంగళగిరి మండలం నీరుకొండ గ్రామానికి చెందిన వైకాపా నేత తాడిబోయిన వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో 15 కుటుంబాలు, ఆత్మకూరు గ్రామానికి చెందిన బుడగ జంగాల కులపెద్దలు ఒంటెద్దు రామచంద్రయ్య-ఒంటెద్దు ఆంజనేయులు సమక్షంలో 70 కుటుంబాలు, ఎర్రబాలెం గ్రామానికి చెందిన అభయాంజనేయస్వామి ఆలయ చైర్మన్ వైకాపా ముఖ్యనేత పలగాని శివప్రసాద్ లు టిడిపి గూటికి చేరారు. దుగ్గిరాల మండలం చింతలపూడి వైసీపీకి చెందిన 2వవార్డు నర్రా శ్రీనివాసరావు, 7వ వార్డు యాదల సాయిలక్ష్మితోపాటు మొత్తంగా 600 కుటుంబాలకు పసుపుకండువాలు కప్పి టిడిపిలోకి నారా లోకేష్ ఆహ్వానించారు.

ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త నందం అబద్దయ్య, పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు, నియోజకవర్గ పరిశీలకులు ముమ్మిడి సత్యనారాయణ, మంగళగిరి మండల అధ్యక్షులు తోట పార్థసారథి, తాడేపల్లి పట్టణ అధ్యక్షులు వల్లభనేని వెంకటరావు, మంగళగిరి పట్టణ అధ్యక్షులు దామర్ల రాజు, తాడేపల్లి మండల అధ్యక్షులు అమరా సుబ్బారావు, దుగ్గిరాల మండల అధ్యక్షులు కేశంనేని శ్రీ అనిత మరియు మంగళగిరి నియోజకవర్గ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

 

Leave a Reply