మంత్రి..భజంత్రి..!

బాబూ..
ఆరాధన మీది..
ఆలోచన మాది..
కాకా మీది..కాక మాది..
ఆసరా మీది..ఆరా మాది..
పాదయాత్ర మీది..
దండయాత్ర మాది..
మొక్కుడు..మెక్కుడు మీది
దంచుడు..
దులుపుడు మాది!

మీరు చేసే పనులెల్ల
మమ్ము చెయ్యమంటే కుదిరేదా..
కాళ్ళు నొక్కితే పదవి వచ్చిందేమో..
నీ ప్రభుభక్తి నీకే పరిమితం
జర్నలిస్టు నీ లిస్టు కాదయా..
అవసరం లేదయా..
నీ దయా..నీ స్వామి దయా
అయినా ఇదేమి సోదయా..!

అక్రిడేషన్ జర్నలిస్టు హక్కు
ఆ హక్కు సాధన కోసం
ఆరాధన అవసరమా..
ఇంటి స్థలం
నీ బాసు ఇచ్చే దక్షిణా
మీ చుట్టూ ప్రదక్షిణ చెయ్యడానికి..
మధ్యలో బోడి సలహా..
ఇదేనా నీ తరహా..!

మొదటి రోజునే
తెలిసింది నీ తీరు..
దిద్దితే మంత్రి పదవి తిలకం
ఇంతేనా నీ వాలకం…
నీకు నచ్చేవి
నీ సామి పాదాలు..
మేము వాడేవి పదాలు..
ఓ భజగోవిందం..
నీ తీరు మారకపోతే
ఒక నాటికి నీ పని
గోవిందా..గోవిందా..
చెల్లుబోయిన మాట..
చెల్లిపోయిన చీటీ..
అది తెలుసుకో..
అలా మసలుకో..!!

– ఈ ఎస్కే

Leave a Reply