Suryaa.co.in

Andhra Pradesh

నిప్పుకి చెద పట్టడం ఎంత నిజమో..చంద్రబాబు అవినీతి చేశాడనడం అంతే నిజం

• 38 కేసుల్లో ముద్దాయిగా ఉన్న జగన్ రెడ్డిని ప్రశ్నించే ధైర్యంలేని మంత్రులు, వైసీపీనేతలు చంద్రబాబుని తప్పుపట్డడం సిగ్గుచేటు
• చంద్రబాబు లాంటి నిజాయితీపరుడిని ఉద్దేశించి వైసీపీనేతలు, మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలు దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉన్నాయి
• చంద్రబాబు తప్పుచేస్తుంటే దగ్గరుండిచూసి నేరాన్ని వారే పరిశోధించినట్టుగా మంత్రులు మాట్లాడుతున్నారు
• అధికారంలోకి రాకముందు చంద్రబాబు ఇంట్లో పింక్ డైమండ్ ఉంది.. అమరావతి భూముల్లో ఆయన అవినీతికి పాల్పడ్డాడు… హాయ్ ల్యాండ్ భూములు లోకేశ్ కొట్టేశాడు… చంద్రబాబు రూ.6లక్షలకోట్ల అవినీతికి పాల్పడ్డాడు అనేవి ఎంత నిజమో… ఇప్పుడు చంద్రబాబుపై పెట్టిన అవినీతి కేసు అంతే నిజం
• చంద్రబాబుపై వైసీపీ ఆరోపణలన్నీ దూదిపింజలా తేలిపోతాయి. అగ్ని పునీతుడిలా ఆయన బయటకు వస్తారు
-తెలుగురైతు విభాగం రాష్ట్ర అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి

చంద్రబాబు అరెస్ట్ పై వింత వ్యాఖ్యలు, నీతి ప్రవచనాలు చెబుతున్న మంత్రులు, వైసీపీనేతలు ఆర్చుకొని మరీ స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ పై మాట్లాడటం చూస్తుంటే, వాళ్లే మొత్తం కళ్లతో చూసినట్టే, జరిగినదాన్ని పరిశోధించినట్టు చెప్పడం, వారి వ్యాఖ్య లకు ముక్తాయింపుగా పెద వాలంటీర్ సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడటం ఇంకా విడ్డూరంగా ఉందని టీడీపీనేత, తెలుగురైతు రాష్ట్ర అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి ఎద్దేవా చేశారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడిన వివరాలు ఆయన మాటల్లోనే…

“ మంత్రులు, మాజీమంత్రులు సీదిరి అప్పలరాజు, బొత్స సత్యనారాయణ, కొట్టు సత్యనారాయణ, పేర్నినాని, కొడాలి నాని, రోజా, తానేటి వనిత, అంబటి రాంబాబు లాంటి అవినీతి సామ్రాట్లు నీతిపన్నాలు వల్లిస్తుంటే, సజ్జల వారి వ్యాఖ్యలకు వంత పాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంది.

వైసీపీ నేతలు మంత్రుల ప్రచారాన్ని ప్రజలు జుగుప్సాకరంగా భావిస్తూ వారిని ఛీత్కరించుకుంటున్నారు
గతంలో చంద్రబాబు ఇంట్లో పింక్ డైమండ్ ఉందని ఆంధ్రా శశికళగా పేరున్న విజయసా యి రెడ్డి దుష్ప్రచారానికి తెరలేపితే, లోకేశ్ హాయ్ ల్యాండ్ భూములు కాజేశాడని వైసీపీ నేతలు రాగం మొదలెట్టారు. వాటితో పాటు, అమరావతిలో భూకుంభకోణమని, పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో అవినీతని, చంద్రబాబు మొత్తంగా రూ.6లక్షలకోట్ల అవినీతికి పాల్పడ్డాడని విషప్రచారం చేశారు.

చివరికి ఎన్నికలకు ముందు జరిగిన వివేకానందరెడ్డి హత్యను కూడా జగన్ రెడ్డి, అతని నీతిమాలిన పార్టీ నేతలు తమకు అనుకూలంగా ప్రచారం చేసుకున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆస్థాయిలో దుష్ప్ర చారం చేసిన వాళ్లు, అధికారంలోకి వచ్చాక తేలుకుట్టిన దొంగల్లా సైలెంట్ అయ్యారు.

ప్రజలు నమ్మి అధికారం కట్టబెట్టడంతో, దొరికింది గొప్ప అవకాశమని ఇసుక సహా, అన్ని ప్రకృతి వనరుల్ని, ప్రభుత్వ ఆస్తులు, ప్రజలసొమ్ముని అప్పనంగా మింగేస్తున్నా రు. ఇలాంటి వాళ్లు స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ ముసుగులో చంద్రబాబు రూ.271 కోట్లు కాజేశాడని, ఆ సొమ్మంతా వివిధ రూపాల్లో షెల్ కంపెనీలద్వారా చంద్రబాబుకి చేరిందని, దానిలో లోకేశ్, అచ్చెన్నాయుడి ప్రమేయం ఉన్నాయని జుగుప్స కలిగేలా ప్రజలు ఛీత్కరించుకునేలా విషప్రచారం మొదలెట్టారు. ఇదంతా కూడా జగన్ రెడ్డి దోపిడీ, అవీనితి, దుర్మార్గపు పాలన ప్రజల్లో చర్చకు రాకూడదు.. వచ్చే ఎన్నికల్లో ప్రజలు టీడీపీని గెలిపించకూడదని చేస్తున్నదే.

జగన్ రెడ్డి దోపిడీ, వైసీపీ ప్రభుత్వ అవినీతిని ప్రజల్లోకి తీసుకెళుతున్నాడనే చంద్రబాబుని అన్యాయంగా అక్రమంగా తప్పుడు కేసుల్లో ఇరికించారు పోలీస్, ఇతర అధికార, విచారణ వ్యవస్థలు చట్టప్రకారం పనిచేస్తున్నాయా?
చంద్రబాబునాయుడు వైసీపీ ప్రభుత్వ అవినీతిని, జగన్ రెడ్డి దోపిడీని ప్రజల్లోకి తీసుకెళ్ల డంతో ఈ ప్రభుత్వానికి కూసాలు కదిలాయి. సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభే రి కార్యక్రమంతో జగన్ రెడ్డి నాలుగేళ్లలో సాగునీటి రంగానికి, ప్రాజెక్టుల వినాశనానికి ఎలా పాటుపడ్డాడో చంద్రబాబు ఆధారాలతో సహా ప్రజలముందు ఉంచాడు. చంద్రబాబు ప్రజలకు చెబుతున్న వాస్తవాలు జీర్ణించుకోలేక తమబండారం బయటపడుతుందన్న అక్కసుతోనే వైసీపీ ఆయనపై దాడులకు పాల్పడింది. పెద్దిరెడ్డి నేత్రత్వంలోని రౌడీల ముఠా, అంగళ్లు..పుంగనూరులో చంద్రబాబుపై హత్యాయత్నానికి పాల్పడింది.

అది సఫలం కాకపోవడంతో చివరకు ఏంచేయాలా అని ఆలోచించి ఏమీలేని స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ లో అవినీతి అంటూ కావాలని చంద్రబాబు పేరు చేర్చి, అన్యాయంగా ఆయన్ని జైలుకుపంపారు. స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ ఏర్పాటు..దాని అమల్లో చంద్ర బాబు పాత్రలేదని స్వయంగా ఐ.ఏ.ఎస్ అధికారి పీ.వీ.రమేశ్ చెప్పారు. ప్రాజెక్ట్ లో భాగంగా యువతకు శిక్షణ అందించిన సంస్థలు సక్రమంగా, సమర్థవంతంగా పనిచేశా యని చెప్పారు.

నిజంగా స్కిల్ ప్రాజెక్ట్ లో అవినీతి జరిగితే, దాని అమల్లో కీలకంగా వ్యవహరించిన అధికారులు కల్లం అజయ్ రెడ్డి, ప్రేమచంద్రారెడ్డిలను వదిలేసి, చంద్రబా బుని తప్పుపట్టడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. రమేశ్ వ్యాఖ్యలు ఈ ప్రభుత్వానికి విన పడటం లేదా? అవినీతి లేనప్పుడు జగన్ రెడ్డి, అతని ప్రభుత్వం, మంత్రులు చంద్రబా బుపై ఎలా కేసుపెట్టారో సమాధానం చెప్పాలని నిలదీస్తుంటే, కేసు మేం పెట్టలేదు.. సీఐడీ పెట్టిందని వితంవాదన మొదలెట్టారు.

సీఐడీ తనకు తానే కేసు విచా రణ చేపట్టి, ఎఫ్.ఐ.ఆర్ లో లేని చంద్రబాబు పేరుని రిమాండ్ రిపోర్ట్ లో చేర్చిందా? పోలీస్ విభాగం, సీఐడీ, సీబీ.సీఐడీ, ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు సక్రమంగా, చట్టప్రకారం పనిచేస్తున్నారా? వారిని జగన్ రెడ్డి రాజ్యాంగం ప్రకారం పనిచేయనిస్తున్నారా? కొందరు అధికారుల్ని లొంగదీసుకొని వారితో నీతిమాలిన పనులుచేయిస్తున్న జగన్ రెడ్డి మొత్తం పోలీస్ వ్యవస్థనే దోషిని చేశాడు. ప్రభుత్వ విధానం సరైందే అయితే, చంద్ర బాబు నిజంగా తప్పుచేసి ఉంటే అర్థరాత్రి విద్యుత్ నిలిపేయించి, చంద్రబాబుని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది?

టీడీపీనేతలు, మీడియావారిని పక్కకు నెట్టి, చంద్రబాబు ఉన్న ప్రాంతాన్ని పోలీసులవలయంలోకి తీసుకొని, ఆయన ఉన్న బస్ డోర్లు బాది, ఆయన్ని అదుపులోకి తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? చట్టప్రకారం అరెస్ట్ చేయడమంటే ఇలా దొడ్డిదారిన అర్థరాత్రి నిద్రపోతున్న వ్యక్తిని బల వంతంగా అదుపులోకి తీసుకోవడమా?

38 కేసుల్లో ముద్దాయిగా ఉండి బెయిల్ పై బయట ఉన్న జగన్ రెడ్డి అవినీతిని ప్రశ్నించే ధైర్యం లేని వైసీపీ నేతలు, మంత్రులు చంద్రబాబు తప్పుచేశాడడం సిగ్గుచేటు
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రౌడీలు, గూండాల ఆటకట్టించారు. వైసీపీ నేతలు, కార్యకర్తల రౌడీయిజాన్ని తొక్కేశారు. అది మనసులో పెట్టుకొనే అధికారంలోకి రాగానే జగన్ రెడ్డి తన పార్టీని ప్రజలపైకి ఉసిగొలిపి, కొందరు పోలీసుల సాయంతో రాష్ట్రాన్ని రావణకాష్టంగా మార్చాడు. ప్రజలకు రాజ్యాంగం కల్పించిన ప్రాథమికహక్కు లు హరించేలా వైసీపీప్రభుత్వం యథేచ్ఛగా దారుణాలకు తెగబడుతున్నా పోలీసులు ప్రేక్షకపాత్రకే పరిమితమయ్యారు.

38 కేసుల్లో ముద్దాయిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి తనపై ఉన్న కేసుల్ని మేనేజ్ చేస్తూ, బెయిల్ పై బయట తిరుగుతుంటే, దానిపై స్పందించకుండా వైసీపీనేతలు చట్టంపై తమకు, తమనాయకుడికి మంచి గౌరవం ఉన్నట్టు మాట్లాడటం సిగ్గుచేటు. దుర్మార్గులకు వత్తాసు పలుకుతున్న పోలీసులు భవిష్యత్ లో వారి కుటుంబసభ్యులు ఎవరైనా వైసీపీనేతల దుశ్చర్యలకు బలైతే ఏం చేస్తారు? ఎలాంటి చర్యలు తీసుకుంటారు? సొంతపార్టీ నేతల్నే జగన్ రెడ్డి, అతని ప్రభు త్వం ఏంచేసిందో పోలీసులకు కూడా బాగా తెలుసు.

ఎంపీ రఘురామకృష్ణంరాజు మొద లు గ్రామాల్లోని ఎందరో నాయకుల్ని అన్యాయంగా ఇబ్బందులకు గురిచేశారు. కొందరిని దారుణంగా హింసించి చంపేశారు కూడా. పోలీసు అనే వాడు రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలి గానీ పాలకులకు ఊడిగం చేయకూడదు. అంబేద్కర్ రాజ్యాం గం అమలుకోసం రాష్ట్రంలో పర్యటిస్తూ, ప్రజలకోసం పెద్దఎత్తున యజ్ఞంచేస్తున్న చంద్ర బాబు లాంటి వ్యక్తిని అడ్డుకోవడం, అరెస్ట్ చేయడం అంటే ప్రజాస్వామ్యానికి సంకెళ్లు వేయడమేనని తెలుసుకోండి.

నిప్పుకు చెద పట్టడం ఎంత నిజమో, చంద్రబాబు అవినీతి చేశాడనడం అంతే నిజం
నిప్పుకు చెద పట్టడం ఎంత నిజమో, చంద్రబాబు అవినీ తి చేశాడనడం అంతే నిజం. జగన్ రెడ్డి, అతని ప్రభుత్వం లేనిదాన్ని ఉన్నట్టు నమ్మించి టీడీపీ అధినేతకు అవినీతి ఆపాదించాలని చూస్తే ప్రజలు నమ్మరు. టీడీపీ గుడిలో తీర్థం లాంటిదైతే, వైసీపీ గుడిసెలో కాసే గుడుంబా లాంటిది. చంద్రబాబు నాయుడు జైలు పాలు కావడంపై ప్రజలతో పాటు, మేథావులు, ప్రజాసంఘాలు ఆలోచించాలి.

జైల్లో ఎలాంటి వారుంటారో ప్రభుత్వ న్యాయవాది పొన్నవోలు చెప్పాల్సిన పనిలేదు. సూరి బావ కళ్లల్లో ఆనందం చూడటానికి పరిటాల రవిని చంపిన మొద్దుశీనును జైల్లో ఏంచేశారో, మొద్దుశీనును చంపిన ఓంప్రకాశ్ ఏమయ్యారో పొన్నవోలుకు తెలియక పోయినా ప్రజలకు బాగా తెలుసు. జైల్లో జగన్ రెడ్డి దొంగస్వాముల్ని పెట్టాడనే, ప్రజలు … తెలుగుదేశం పార్టీ చంద్రబాబు రక్షణపై ఆందోళన చెందుతున్నాయి.

మంత్రులు, వైసీపీనేతలు, ఆ పార్టీ న్యాయవాదుల వ్యాఖ్యలు గమనించే టీడీపీ న్యాయనిపుణులు చంద్రబాబు రక్షణపై న్యాయస్థానాల్లో పిటిషన్లు వేశారు. చంద్రబాబుపై వచ్చిన ఆరోపణలన్నీ దూదిపిం జలా తేలిపోతాయి. ఆయన అగ్నిపునీతుడై కడిగిన ముత్యంలా ప్రజల్లోకి రావడం ఖాయం…దాన్ని ఎవరూ ఆపలేరు.” అని మర్రెడ్డి స్పష్టంచేశారు.

LEAVE A RESPONSE