-
నకిలీ నెయ్యి నిర్వాహకంలో కేసు నమోదు చేయాలి, విచారణ సిబిఐకు అప్పచెప్పలి
-
తిరుమలలో అన్యమత ఉద్యోగస్తుల్ని తక్షణమే తొలగించాలి
-
దేవాలయాలు రాజకీయ పునరావాస కేంద్రాలు కాకుండా, ప్రభుత్వ జోక్యాలు లేకుండా పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టి చట్టం చేయాలి
-
సిరిపురపు శ్రీధర్ శర్మ
గుంటూరు: దేవుడి “లడ్డులో గొడ్డు” మాంసం అంశంపై కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి భక్తుల మనోభావాలు దెబ్బతిన్న కారణంగా గుంటూరు నగరంలో ప్రకాశం చౌక్ సెంటర్ (శంకర్ విలాస్ సెంటర్) నందు హిందూ ధర్మిక సంఘాలు, ప్రజా సంఘాలు, వెంకటేశ్వర స్వామి భక్త బృందం ఆధ్వర్యంలో శాంతియుత నిరసన కార్యక్రమం భారీ జన సందోహంతో జరిగింది.
నాలుగు అడుగుల వెంకటేశ్వర స్వామి ఉత్సవ విగ్రహాన్ని ప్రకాశం చౌక్ సెంటర్లో ఏర్పాటు చేసి శాస్త్రక్తంగా వేద పండితులతో వెంకటేశ్వర స్వామి వారికి అష్టోత్తర శతనామావళి పూజారికాలు, హారతి నైవేద్య, కైకర్యాలు స్వామివారికి నిర్వహించారు. తిరుమల పవిత్రతను అపచారాలను అవినీతి చేస్తున్న రాజకీయ నాయకులకు తగు రీతిలో శిక్ష విధించాలని, దేవుడు సొమ్మును అప్పనంగా దోచుకున్న టీటీడీ బోర్డు సభ్యులు ప్రభుత్వాధినేతలను కఠినంగా శిక్షించి రాజకీయ నాయకులకు ప్రభుత్వాలకు కనువిప్పు కలగాలనే సంకల్పంతో ఈ పూజాదికాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా నిర్వాహకులైన సిరిపురపు శ్రీధర్ శర్మ, వనమా నరేంద్ర, జంధ్యాల రామలింగేశ్వర శాస్త్రి, దాసరి రాము, వావిలాల కుమార్ తదితరులు ప్రసంగిస్తూ ప్రపంచంలోనే అత్యధిక భక్తులు కలిగిన కలియుగ దేవుడు ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారని అటువంటి ప్రత్యక్ష దైవం పట్ల ఎన్నో పాప కార్యక్రమాలు ప్రభుత్వాల నేతృత్వంలో గతం నుండి నేటి వరకు నిర్వహిస్తున్నారని, ఇది స్వామివారి పట్ల ప్రత్యక్షంగా చేస్తున్న పాప కార్యక్రమాలని రాజకీయ నేతలు తెలుసుకోవడం వారు చేస్తున్న కర్మకి కలియుగంలో ఇది ప్రతిఫలం అని, మీరు తప్పులకు వీరి కుటుంబ సభ్యులు కూడా శిక్ష అనుభవించే తప్పుడు పనులు, పాపపు కార్యక్రమాలు వెంకటేశ్వర స్వామి వారి పట్ల చేశారని, ప్రభుత్వ ది నేతలు రాజకీయ నాయకుల్లో కనీస పశ్చాతాపం కూడా లేదని, ఇంకా ఇంకా దేవుళ్ళ విషయాల్లో పాపాలు,తప్పులు చేస్తూ పోతున్నారని, ప్రభుత్వాలు వీరిని అరికట్టి అడ్డుకట్ట వేయకపోతే హిందూ ఆధ్యాత్మిక భక్త బృందం ఆగ్రహ వేషాలను ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు ఎదురుకొక తప్పదని హెచ్చరించారు.
దేశంలో ఉన్న దేవాలయాలపై రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా ప్రతినిధుల రాజకీయ నాయకుల జోక్యం లేకుండా, వారి కబంధహస్తాల్లో నుంచి దేవాలయాలను బయటకు తెచ్చే విధంగా కేంద్రంలో ఉన్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టి చట్టం తీసుకురావాలని దేశంలో ఉన్న హిందూ ప్రజలు కోరుకుంటున్నారని, వారి మనోభావాలు కాపాడే విధంగా కేంద్ర ప్రభుత్వం కృషి చేయాలని, దీనితోపాటు గతంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శిగా పనిచేసిన ఎల్వి సుబ్రహ్మణ్యం ఇచ్చిన జీవో ఆధారంగా దేవాలయాల్లో అన్యమత ఉద్యోగస్తుల్ని తొలగించి వేరే ప్రభుత్వ సంస్థల్లోకి తరలించాలని రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
దేవుళ్ళనే మోసం చేసే స్థితికి ప్రభుత్వ అధినేతలు, రాజకీయ పార్టీలు దిగజారారంటే ఇంతకన్నా సిగ్గు మాలిన పని ఈ దేశంలో ఏదీ లేదని, ఒకపక్క ప్రజలను మోసం చేస్తూ వుంటే మొన్నటి ఎన్నికల్లో ప్రజలు జగన్కు శిక్ష విధించారని దేవుళ్లను కూడా మోసం చేసి దోచుకుంటే దేవుడు ఎటువంటి శిక్ష విధిస్తాడు కాల నిర్ణయిస్తుందని, రాజకీయ నాయకులు, ముఖ్యమంత్రి జగన్ తో సహా వైసిపి ప్రజాప్రతినిధులు హిందూ దేవి దేవతల పట్ల ఎన్నో అపచారాలు చేశారని ప్రస్తుతం కూడా చేస్తున్నారని అన్నారు.
గతంలో రాములవారి విగ్రహ తలకాయ తొలగించడం, ఆంజనేయస్వామి విగ్రహం చెయ్యి తీసివేయటం, దేవాలయాల కూల్చివేయటం, రధాలు తగలబెట్టడం, వెండి సింహాలను కాల్ చేయడం తదితర ఎన్నో ఘాతుకాలకు ఉదాహరణలు ఉన్నాయని, తిరుమలలో స్వామివారి లడ్డు ప్రసాదం, అన్న ప్రసాదంలో నకిలీ బియ్యం నకిలీ నూనెలు, నకిలీ పప్పులు వాడారని, స్వామివారికి నిత్యం సమర్పించే నైవేద్యాల్లో కూడా నకిలీ నెయ్యిని గత ఐదేళ్లపాటు వాడటం జరిగిందని ఇది శాస్త్ర ప్రకారము ఆగమాల ప్రకారం ఎంతో అపచారమని, వీరి అపచారాలకు దేవుడు తప్పక శిక్ష విధిస్తాడని, స్వామివారి వంటగదిని స్వామివారి దేవాలయాన్ని పరిసర ప్రాంతాల్ని ఆగమాల ప్రకారం ఎన్నో క్రతువులు, సంప్రోక్షణలు నిర్వహించవలసిన అవసరం ఉందని అన్నారు.
దానిపైన టీటీడీ పండితులు చంద్రబాబు ప్రభుత్వం దృష్టి సారించాలని, స్వామివారి లడ్లకు ప్రసాదాలకు వాడిన ఈ నకిలీ నెయ్యిని కొత్తగా వచ్చిన చంద్రబాబు ప్రభుత్వంలో టీటీడీ వారు నాన్యత పరీక్షల నిమిత్తం దేశంలో ఉన్న అత్యుత్తమ ప్రభుత్వ ల్యాబులకు పంపితే వాటిలో గొడ్డు మాంసం, జంతు కళేబరాల నూనెలు, చేపల నూనెలు, మైదాపిండి, సోయాబీన్ నూనెలు ఉన్నాయని రెండు ల్యాబులు రిపోర్టులు ఇవ్వడం జరిగిందని చెప్పారు.
దీని ఆధారంగా గతంలో పనిచేసిన చైర్మన్లు కరుణాకర్ రెడ్డి సుబ్బారెడ్డి ఈవో ధర్మారెడ్డి లతోపాటు టిటిడి ప్రధాన అధికారులపై చట్ట ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, తిరుమలలో స్వామివారికి జరుగుతున్న అపచారాలు పై అవినీతిపై సెట్టింగ్ జడ్జి ద్వారా సిబిఐ విచారణకు ఆదేశించాలని, దోషులు ఎంతటి వారైనా సరే శిక్షించాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రత్యక్ష దైవం వెంకటేశ్వరుని భక్తుల మనోభావాలు కాపాడాలని పిలుపునిచ్చారు.
గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి జగన్ స్వామి వారి బ్రహ్మోత్సవాలకి ఏ రోజు కూడా సతీ సమేతంగా పట్టు వస్త్రాలు సమర్పించలేదని, స్వామివారి ప్రసాదాన్ని కూడా స్వీకరించలేదని ఇటువంటి వారు ముఖ్యమంత్రిగా కొనసాగి తిరుమల పవిత్రతను ప్రపంచవ్యాప్తంగా మంటగలిపే విధంగా ఎందుకు ప్రవర్తించారని తెలుగు ప్రజలకు స్వామివారి భక్తులకు జగన్ సమాధానం చెప్పి తీరాలని డిమాండ్ చేశారు.
గతంలో ముఖ్యమంత్రిగా జగన్ ప్రతిసారి జెరూసలేం లండన్ పర్యటనలకు వెళ్ళేది క్రిస్టియన్ చారిటీస్ నిధుల కోసమేనని ఆ నిధులు తెచ్చుకుని ఇక్కడ హిందూ సనాతన ధర్మాన్ని మంట కలిపే విధంగా ప్రవర్తించారని, ఎవరైతే తిరుమల వెంకటేశ్వర స్వామి తోపాటు ఇతర దేవాలయాల్లో ఉన్న దేవి దేవతలకు అపచారాలు చేశారో ,చేస్తున్నారో వారందరికీ దైవం ఖచ్చితంగా వారి బతికుండగానే శిక్షలు విధిస్తుందని, వాళ్లు రాజకీయ నాయకులైన సరే, ప్రజా ప్రతినిధులు అయినా సరే, ప్రభుత్వాధికారులైనా సరే దేవుళ్ళతో పెట్టుకున్న వారు ఎవరైనా సరే వంశాలతో సహా నాశనం అవుతారని, దీనికి ఉదాహరణ గతంలో రాజశేఖర్ రెడ్డి పావురాల గుట్ట ఈవో ధర్మారెడ్డి కొడుకు యాక్సిడెంట్ లో మరణించడం ఉదాహరణలని, ఇలా దేశవ్యాప్తంగా అనేక ఉదాహరణలు ఉన్నాయని ఇప్పటికైనా సరే తిరుమల విషయంలో అపచారాలు చేసిన ట్రస్ట్ బోర్డు చైర్మన్ లను, సభ్యులను ముఖ్యమంత్రి స్వామి వారి ముందు నిలువు దోపిడీ చేయాలని, దోచుకున్న సొమ్మును హుండీలో వేయాలని లేని పక్షంలో వంశపారంపర్యంగా శిక్ష అనుభవించక తప్పదని నాయకులు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఎండపల్లి శబరి, పెద్దింటి చైతన్య కృష్ణ, చిలుమూరు ఫని, షేక్ బాజీ, వడ్డమాను ప్రసాద్, కూరపాటి కిషోర్, ఐలూరి శ్రీనివాసు, వేదాంతం హరినాథ్, సంజీవ్, వడ్లమూడి రాజా, కొప్పర్తి సీతారమేష్, ఫమ్మిడిగంటం రమణయ్య,వెలగలేటి గంగాధర్,, బొడ్డుపల్లి శ్రీనివాస్, నారాయణరెడ్డి, నల్లపునేని అమర్నాథ్, ఎన్జీవో అసోసియేషన్ మూర్తి, గుండు జ్ఞానేశ్వర్, పట్టాభిరాముడు, రాజ్ కుమార్, ఆంజనేయులు, అన్నా లక్ష్మి, లీల, చెరక కుమార్ గౌడ్, తుమ్మెద కొమ్మిన నరేష్, రాజేష్, మునిపల్లె మునిపల్లి తేజ, బాలు, వంశీ, గుత్తికొండ శ్రీనివాస్, యశ్వంత్ తదితరులతో పాటు రాజకీయ పార్టీలకు, కుల సంఘాలకు మతాలకు అతీతంగా వందలాదిగా హిందూ ధార్మిక సభ్యులు, స్థానిక ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తొలుత స్వామివారి విగ్రహానికి పూజాదికాలు నిర్వహించి, భక్తులకు, ప్రజలకు ప్రసాదవితరణ గావించారు. అరండల్ పేట సీఐ కొంక శ్రీనివాస్ ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా పర్యవేక్షించారు.