Suryaa.co.in

Andhra Pradesh

బిల్డర్స్ ఆసోసియేషన్ ఆఫ్ ఇండియా అమరావతి క్యాపిటల్ ఛైర్మన్ గా మాటూరి రంగనాధ్

బిల్డర్స్ ఆసోసియేషన్ ఆఫ్ ఇండియా (బాయ్) అమరావతి క్యాపిటల్ సెంటర్ ఛైర్మన్ గా గుడివాడ అమ్మకన్ స్ట్ర్రక్షన్స్ అధినేత మాటూరి రంగనాధ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎ.నాగమల్లేశ్వరరావు ప్రకటించారు. విజయవాడ వేదికగా జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం జరిగింది.

అమరావతి క్యాపిటల్ విభాగం ప్రధాన కార్యదర్శిగా ఎస్ సత్యన్నారాయణ, కోశాధికారిగా కెపి కిరణ్, ఉపాధ్యక్షులుగా పట్నాయక్, రాజేష్, సంయిక్త కార్యదర్శిగా వి.వెంకట నారాయణ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన ఛైర్మన్ మాటూరి రంగనాధ్ మాట్లాడుతూ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ రంగ సమస్యల పట్ల సానుకూలంగా ఉండటం పరిశ్రమకు కలిసి వచ్చే అంశంగా మారిందన్నారు.

సింగిల్ విండో విధానంలో అనుమతుల మంజూరు ప్రక్రియ వేగవంతం అయితే భవన నిర్మాతలకు మరింత మేలు కలుగుతుందన్నారు. ఇప్పటికీ కొన్ని సమస్యలు స్ధిరాస్తి రంగాన్ని వెంటాడుతున్నాయని ,నారెడ్కో ,క్రెడాయ్ వంటి ఇతర అసోసియుషన్లతో కలిసి వీటి పరిష్కారానికి ప్రభుత్వంపై వత్తిడి తీసుకువస్తామని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయిడు, మంత్రి నారాయణ ఇప్పటికే స్ధిరాస్తి సమస్యల పరిష్కారం కోసం ఎంతో చేస్తున్నారని అభినందించారు.

నూతన సంవత్సరం డైరీని అవిష్కరించిన లంకా దినకర్

బిల్డర్స్ ఆసోసియేషన్ అఫ్ ఇండియా నూతన సంవత్సరం డైరీని ఇరవై సూత్రాల అమలు కమిటీ ఛైర్మన్ లంకా దినకర్ అవిష్కరించారు. ఈ సందర్భంగా దినకర్ మాట్లాడుతూ ప్రభుత్వం రాష్ట్ర సర్వతోముఖాభివృద్దికి కట్టుబడి ఉందన్నారు. ముఖ్యమంత్రి మార్గనిర్దేశకత్వంలో అమరావతి నిర్మాణం ప్రారంభం అయ్యిందన్నారు.

ఏపీ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ అధ్యక్షుడు పొట్లూరి బాస్కరరావు కార్యక్రమానికి అధ్యక్షత వహించగా, స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ డైరెక్టర్ డాక్టర్ ఎస్.రమేష్, అసోసియేషన్ జాతీయ ఉపాధ్యక్షుడు డి. పంకజ్ రెడ్డి, నారెడ్కో రాష్ట్ర అధ్యక్షుడు జి. చక్రధర్, బాయ్ రాష్ట్ర అధ్యక్షుడు నాగమల్లేశ్వరరావు, పూర్వ జాతీయ ఉపాధ్యక్షుడు వల్లభనేని వెంకటేశ్వరరావు, విజయవాడ క్రెడాయ్ అధ్యక్షుడు డి. రాంబాబు, రమేష్, సందీపని, బాలాజీ, ప్రభు, సందీపని తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE