ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభమైన మీడియా రంగం ఏపీలో కష్టకాలంలో ఉంది

– బి.ఆర్ నాయుడు చేసిన తప్పేంటి? అమరావతి రైతులకు మద్దతు తెలపడం నేరమా ?
– టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు

ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభమైన మీడియా రంగం ఏపీలో కష్టకాలంలో ఉంది.ప్రజా సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతున్న మీడియాపై జగన్ రెడ్డి కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు.టీవీ 5 చైర్మన్ బి.ఆర్ నాయుడుకి సీఐడీ నోటీసులు ఇవ్వడం జగన్ రెడ్డి నియంత పాలనకు నిదర్శనం. బి.ఆర్ నాయుడు చేసిన తప్పేంటి? ఆయన ఏమైనా పాకిస్తాన్ బార్డర్ లోకి వెళ్లి ఉగ్రవాదులు కలిశారా? అమరావతి రైతులకు మద్దతు తెలపడం నేరమా ? ప్రశ్నించే గొంతుల్ని నులిమేయాలని జగన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు.

పాలనా వైఫల్యాలను దాచి పెట్టి జనాన్ని కుడి యడమల దగా చేయాలన్న దురుద్దేశ్యంతో మీడియాపై కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారు. జగన్ రెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు.జగన్ రెడ్డి మూడున్నరేళ్లలో సిఐడి నోటీసులకు ఏ4 పేపర్ల కోసం ఖర్చు చేసిన డబ్బులతో ఒక నెల పాటు రాష్ట్రం అంతా అన్న క్యాంటీన్లు నడపొచ్చు.జగన్ రెడ్డి ఇకనైనా నియంత లక్షణాలు వీడి ప్రజాస్వామ్య పాలన అలవర్చుకోవాలి.

Leave a Reply