మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజ్‌ ప్రారంభం

Spread the love

-బ్యారేజ్‌స‌మీపంలో వైయస్‌ఆర్, గౌతమ్‌రెడ్డి విగ్రహాలను ఆవిష్క‌రించిన‌ సీఎం వైయస్‌ జగన్‌

నెల్లూరు: మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజ్‌ని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లాంఛనంగా ప్రారంభించి.. జాతికి అంకితం చేశారు.. వేద పండితుల మంత్రోచ్చరణలు అనంతరం దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి కుటుంబ సభ్యులు, మంత్రులతో కలిసి సంగం బ్యారేజ్‌ని సీఎం వైయస్‌ జగన్‌ ప్రారంభించారు. అనంతరం బ్యారేజ్‌ సమీపంలో ఏర్పాటు చేసిన దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి, దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి విగ్రహాలను సీఎం వైయస్‌ జగన్‌ ఆవిష్క‌రించారు. ఈ కార్య‌క్ర‌మంలో మేక‌పాటి రాజ‌మోహ‌న్‌రెడ్డి దంప‌తులు, దివంగ‌త మంత్రి గౌత‌మ్‌రెడ్డి స‌తీమ‌ణి, ఎమ్మెల్యే మేక‌పాటి విక్ర‌మ్‌రెడ్డి, కుటుంబ స‌భ్యులు, మంత్రులు కాకాణి గోవ‌ర్థ‌న్‌రెడ్డి, అంబ‌టి రాంబాబు త‌దిత‌రులు ఉన్నారు.

Leave a Reply