ఆరోగ్యశాఖను అనారోగ్యశాఖగా మార్చిన మంత్రి విడదల రజని

32

– టీడీపీ అధికార ప్రతినిధి కావలి గ్రీష్మ

ఆరోగ్యమే మహాభాగ్యం అని పెద్దలంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం వల్ల మన రాష్ట్రానికి ఆరోగ్యం లేదు. భాగ్యమూ లేదు. మూడున్నరేళ్ల వైసీపీ పాలనలో వైద్య రంగాన్ని పూర్తిగా భ్రష్టుపట్టించారు. నాడు-నేడు కింద వైద్యరంగంలో విప్లవం తీసుకొస్తున్నామని ముఖ్యమంత్రి జగన్ రెడ్డి చెబుతున్న మాటలు ఆచరణలో అమలు కాక పేదలు వైద్యం కోసం నానా ఇబ్బందులు పడుతున్నారు. ఏపీ వైద్య విధానం దేశానికే ఆదర్శమని పచ్చి అబద్ధాలు చెబుతున్న ఆరోగ్యశాఖమంత్రి విడదల రజనీ క్షేత్రస్థాయిలో ప్రభుత్వాసుపత్రులను పరిశీలిస్తే వాస్తవ పరిస్థితులు కళ్లక కటతాయి. ప్రజారోగ్యాన్ని ఉద్ధరించినట్టు ప్రచారార్భాటం చేసుకుంటున్న మంత్రి విడదల రజనీ మా ప్రశ్నలకు సమాధానం చెప్పాలి.

ఇదేనా దేశానికి ఆదర్శంగా వైద్య రంగాన్ని తయారుచేయడమంటే?
2017-18లో చంద్రబాబు గారి హయాంలో విడుదల చేసిన నీతి ఆయోగ్ హెల్త్ ఇండెక్స్ ర్యాంకింగ్స్ లో మన రాష్ట్రానికి ఇంక్రిమెంటల్ ర్యాంకింగ్ లో 4వ స్థానం దక్కగా అదే జగన్ సర్కారులో 2019-20లో మన రాష్ట్రం యొక్క ఇంక్రిమెంట్ ర్యాంకు 10వ స్థానానికి పడిపోయిన మాట వాస్తవం కాదా? ఇదేనా ఏపీ వైద్య రంగాన్ని దేశానికి ఆదర్శంగా నిలపడమంటే?

ప్రభుత్వాసుపత్రులను నరకకూపాలుగా మార్చేసింది మీరు కాదా?
వైద్యమంత్రి విడదల రజనీ గారు ఏసీ చాంబర్ లో కూర్చిని మాట్లాడటం కాదు..రాష్ట్రంలోని ప్రభుత్వాసుపత్రులను ఓసారి సందర్శిస్తే అక్కడి పరిస్థితి తెలుస్తుంది. తెలుగుదేశం హయాంలో ప్రభుత్వాసుపత్రుల్లో అధునాతన పరికరాలు అమర్చి రూపురేఖలు మార్చితే ఈ మూడున్నరేళ్లలో వాటిని నరకకూపాలుగా, అత్యాచారకేంద్రాలుగా తయారుచేశారు. ఆస్పత్రుల్లో కనీస మౌలిక సదుపాయాలు లేక రోగులు ఇబ్బందులు పడుతుంటే చోద్యం చూస్తున్నారు. నెల్లూరులోని ఆస్పత్రిలో వైద్యులు లేక సెక్యూరిటీ గార్డు, స్వీపర్లు వైద్యం చేయడంతో రోగి మృతి చెందాడు. కరెంటు కోతలతో వైద్యులు సెల్ ఫోన్ వెలుగులో ఆపరేషన్లు చేస్తున్నారు. ఇదేనా ఆస్పత్రుల రూపురేఖలు మార్చాడమంటే?

ఆరోగ్యశ్రీ కాదు అనారోగ్యశ్రీ :
ఆరోగ్యశ్రీ కింద వైద్యం అందిస్తూ పేదలను ఉద్దరిస్తున్నట్టు విడదల రజనీ కట్టుకథలు చెబుతున్నారు. టీడీపీ హయాంలో ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా వేల కోట్లు ఖర్చు చేసి పేదలకు మెరుగైన వైద్యం అందించాం. కానీ నేటి జగన్ సర్కారు ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తున్న నెట్ వర్క్ ఆస్పత్రులకు రూ. 450 కోట్లకు పైగా బకాయిలు పెట్టి ఆ పథకాన్ని నిర్వీర్యం చేస్తోంది. కరోనా సమయంలో ఆరోగ్యశ్రీ కింద వైద్యం మా వల్ల కాదని సీఎం సొంత జిల్లాలోనే ఆస్పత్రులు బోర్డులు పెట్టింది వాస్తవం కాదా? మరిదీనికేం సమాధానం చెప్తారు?

సీఎంఆర్ ఎఫ్ ను ఐసీయూలోకి నెట్టేశారు:
2014-19 మధ్య ఐదేళ్లలో CMRF ద్వారా చంద్రబాబు గారు ఎముకలేని చేయిలాగా సాయం చేశారు. రూ. 1523 కోట్లకు పైగా ముఖ్యమంత్రి సహాయనిధికి వెచ్చించి ఏడాదికి సగటున రూ. 304 కోట్లు ఖర్చు చేసి లక్షలాదిమందిని ఆదుకున్నారు. జగన్ రెడ్డి చేసింది ఏంటయ్యా అంటే ఈ మూడేళ్లలో సీఎంఆర్ ఎఫ్ ను ఐసీయూలోకి నెట్టేయడమే. దాని కింద ఈ మూడేళ్లలో కేవలం రూ. 429 కోట్లు మాత్రమే ఖర్చు చేసి ప్రజారోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టేశారు. దీనిపై వైద్యఆరోగ్యశాఖ మంత్రి నోరుమెదపరేం?

కొత్త మెడికల్ కాలేజీల పేరుతో జగన్నాటకాలు ఇంకెన్నాళ్లు?
జగన్ రెడ్డి చెబుతున్న 17 మెడికల్ కాలేజీలు బూటకమే. రాష్ట్రంలోని 13 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో నాలుగు (మంగళగిరి ఎయిమ్స్, తిరుపతి స్విమ్స్ , నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి, అనంతపురం ప్రభుత్వ మెడికల్ కాలేజీలను) చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేశారు. 3 మాత్రమే వైఎస్ తెచ్చినవి. మిగిలిన ఆరూ గతంలోవి. ఆర్భాటంగా బటన్ నొక్కి శిలాఫలకాలు వేస్తే మెడికల్ కాలేజీలు పూర్తయినట్టేనా?

108,104 అంబులెన్స్ ఎక్కడ మంత్రి గారూ?
ఫోన్ చేయగానే కుయ్ కుయ్ మంటూ 104,108 అంబులెన్సన్ లు వచ్చేస్తాయన్నారే …..కరోనా విపత్తులో సకాలంలో రాక వేలాదిగా ప్రాణాలు కోల్పోయింది వాస్తవం కాదా? ఒక్కో అంబులెన్స్ లో 15, 20 మందిని లెక్కన కుక్కి కుక్కి తరలించిన దృశ్యాలు మనం చూడలేదా?108 వాహనాల కొనుగోలు , నిర్వహణ పేరుతో ఏ2 విజయసాయి రెడ్డి అల్లుడు కంపెనీ అరబిందోతో ఒప్పందం కుదుర్చుకుని రూ. 307 కోట్లు అవినీతికి పాల్పడింది వైద్యమంత్రికి తెలీదా?

నేడు గిరిజనులకు వైద్యం అందని ద్రాక్షే:
టీడీపీ హయాంలో 104,108 సేవలకు అదనంగా గిరిజన ప్రాంతవాసులకు వైద్య సేవల కోసం చంద్రబాబు గారు ప్రైవేశపెట్టిన పీడర్ అంబులెన్స్ లను నిలిపేసింది నిజం కాదా?మహా ప్రస్థానం వాహనాలను నిర్వీర్యం చేయడంతో సకాలంలో అంబులెన్స్ రాక బిడ్డల శవాలను తండ్రి భుజాలపై మోసుకెళ్తున్న హృదయ విదారక ఘటనలు ముఖ్యమంత్రి, వైద్యమంత్రికి కనిపించడంలేదా?

వైద్యరంగంలో 46 వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చారా?
వైద్య రంగంలో ఉద్యోగాల విప్లవం తెచ్చామని, ఈ మూడేళ్లలో 46వేలకు పైగా ఉద్యోగాలిచ్చామని ముఖ్యమంత్రి, వైద్యమంత్రి బూటకపు మాటలు చెబుతున్నారు. 2021-22 కు సంబంధించి ముఖ్యమంత్రి తన స్వహస్తాలతో భారీ పత్రికా ప్రకటనతో విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ ప్రకారం ఈ మూడేళ్లలో వైద్యరంగంలో ఇచ్చిన ఉద్యోగాల సంఖ్య కేవలం 13,987. అందులోనూ 10,341 కాంట్రాక్ట్ ఉద్యోగాలైతే శాశ్వత ఉద్యోగాలు కేవలం 1532 కాగా , 2114 ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇదేనా మీరు చెబుతున్న వైద్యరంగంలో విప్లవమంటే?

ఈ మూడున్నరేళ్లలో ఆస్పత్రుల్లో ఒక కొత్త పరికరమైనా అమర్చారా?
ప్రభుత్వాసుపత్రుల్లో కొత్త కొత్త పరికరాలు అందుబాటులోకి తెచ్చామని చెబుతున్నారే…మరి మనకు వైద్య పరికరాలు సరఫరా చేసిన కాంట్రాక్టర్ల సంఘం అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ మెడికల్ డివైజ్ ఇండస్ట్రీ వారు రెడ్ నోటీస్ ఎందుకు జారీ చేశారు? ఏపీ ప్రభుత్వం నుంచి వంద శాతం అడ్వాన్స్ అందితేనే పరికరాలు రాష్ట్రానికి సరఫరా చేయాలని రెడ్ నోటీస్ లో పేర్కొంది నిజం కాదా? ఏం సమాధానం చెప్తారు విడదల రజనీ గారూ?

బాలింతలు, శిశువులకు టీడీపీ అమలు చేసిన పథకాలను రద్దు చేసింది వాస్తవం కాదా?
గర్భిణులు, బాలింతలు, శిశువులకు పౌష్టికాహారం అందించడం ద్వారా మాతా శిశు మరణాలను తగ్గించేందుకు, ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచేందుకు చంద్రబాబు గారు అమలు చేసిన బాలామృతం, బాల సంజీవని, గిరి గోరుముద్దలు, ఫుడ్ బాస్కెట్, ఎన్టీఆర్ బేబీ కిట్లు , తల్లీబిడ్డా వంటి పథకాలను కక్షపూరితంగా జగన్ రెడ్డి రద్దు చేసింది వాస్తవం కాదా? ఇవేమీ వైద్య మంత్రి విడదల రజనీకి కనిపించం లేదా?