బాలికలతో కరాటే విన్యాసాలు చేసిన మంత్రి ఎర్రబెల్లి

-బాలికలందరికీ జాతీయ బాలికా దినోత్సవ శుభాకాంక్షలు
-బాలికల ఆత్మ రక్షణ, సంరక్షణ, సంక్షేమం, సమానత్వానికి -తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది
-బాలికల విద్య, వికాసం కోసం అనేక కార్యక్రమాలు చేపడుతోంది
-బాలికల పట్ల దాడులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటోంది
-రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
-ఘనంగా జాతీయ బాలికా దినోత్సవం

(హైదరాబాద్, జనవరి 24): జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బాలికలతో కలిసి ఉత్సవాల్లో పాల్గొన్నారు.

పాలకుర్తి నియోజకవర్గం, చెన్నూరులో జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా హైస్కూల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బాలికలతో కలిసి కరాటే విన్యాసాలు చేశారు. బాలికలు ఆత్మ రక్షణ కోసం కరాటే ఉపయోగ పడుతుంది అన్నారు. బాలికలను అభినందించారు.బాలికలకు జాతీయ బాలికా దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు.

ఆడపిల్లలకు సమాజంలో సమాన అవకాశాలు, సమానత్వం, సంరక్షణ కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందని తెలిపారు.బాలికల విద్యకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు.దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రత్యేకంగా రెసిడెన్షియల్ విద్యాలయాలు ఏర్పాటు చేశారని తెలిపారు.

బాలికల రక్షణకు, బాలికల భ్రూణ హత్యల నివారణకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసిఆర్ నాయకత్వంలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందన్నారు.ఆడపిల్ల కడుపులో పడ్డప్పటి నుంచి పెద్దయి పెళ్లి చేసుకుని తల్లి అయ్యేవరకు ప్రతి దశలో అమ్మగా, అన్నగా, మేన మామగా తోడు ఉంటూ చేయుతనందిస్తోంది అన్నారు.

ఆడపిల్లలపై దాడులు చేసిన వారు, అమానుషంగా వ్యవహరించిన వారిపట్ల కఠిన చర్యలు తీసుకుంటుందని, వారి రక్షణకు షి – టీమ్స్, భరోసా కేంద్రాలు, సఖీ సెంటర్లు పెట్టీ అండగా నిలుస్తోంది అన్నారు. మరోసారి బాలికలకు జాతీయ బాలికా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

Leave a Reply