లోకేశ్ పాదయాత్ర.. వైసీపీ పాలనకు అంతిమ యాత్ర

-జగన్ రెడ్డి పర్యటనలకు ముళ్ల కంచెలు, లోకేశ్ పాదయాత్రకు ఆంక్షలా ?
– పాదయాత్ర పై ఆంక్షలు జగన్ రెడ్డి అభద్రతాభావానికి అద్దం పడుతున్నాయి
– తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు

యువగళం పాదయాత్రపై ప్రభుత్వ ఆంక్షలు జగన్ రెడ్డి అభధ్రతాభావానికి అద్దం పడుతున్నాయి. లోకేశ్ పాదయాత్ర ప్రకటన నాటి నుంచే జగన్ రెడ్డి అండ్ కో కి ఓటమి భయం పట్టుకుంది. అందుకే జగన్ రెడ్డి పాలన గాలికొదిలి పాదయాత్రను అడ్డుకునేందుకు కుట్రలు చేస్తున్నారు. పాదయాత్రకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే..ఆంక్షలు విధించటం సరికాదు. సీఎం జగన్ రెడ్డి పర్యటనలకు ముళ్ల కంచెలు పెట్టి మరీ రక్షణ చర్యలు చేపడుతున్న పోలీసులు లోకేశ్ పాదయాత్రకు ఆంక్షలు విధించటం ఏంటి?

బందోబస్తు కల్పించాల్సిన బాధ్యత పోలీసు వ్యవస్ధకు లేదా? జగన్ రెడ్డి పాదయాత్రకు టీడీపీ ప్రభుత్వం పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయటంతో పాటు ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకుంది. కానీ నేడు జగన్ రెడ్డి ప్రభుత్వం లోకేశ్ పాదయాత్రకు అడుగడునా అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది. ప్రతిపక్ష నేతలకు పాదయాత్ర చేసే హక్కు లేదా ? నాడు చంద్రబాబు నాయుడు ఇలాగే వ్యవహరిస్తే జగన్ రెడ్డి పాదయాత్ర చేసేవారా? అధికారంలోకి వచ్చేవారా? జగన్ రెడ్డి ఎన్ని కుట్రలు పన్నినా పాదయాత్రను అడ్డుకోలేరు. జగన్ రెడ్డి పాలనలో దగా పడ్డ ప్రజలంతా లోకేశ్ రాక కోసం ఎదురు చూస్తున్నారు. లోకేశ్ పాదయాత్రతో వైసీపీ పాలనకు అంతిమయాత్ర మొదలైనట్టే. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి 1983 నాటి ప్రభంజనం ఖాయం.

Leave a Reply