Suryaa.co.in

Andhra Pradesh

మంత్రి కాకాణికి రైతుల గురించి ఆలోచించే తీరిక లేదు

– ఆర్ వై పాలెంలో టిడిపిలో చేరిన రెండు కుటుంబాలు
– సోమశిల దక్షిణ కాలువ, కండలేరు ఎడమ కాలువ ద్వారా వేల ఎకరాలకు నీరు అందక రైతులు అల్లాడుతుంటే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణికి రైతుల సమస్యల గురించి ఆలోచించే తీరిక కూడా లేదా
– పొదలకూరు మండలంలోని ఆర్.వై పాలెం గ్రామంలో బాబు షూరిటీ .. భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించి, ఇంటింటికి తిరిగి కరపత్రాలను పంపిణీ చేసిన -మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి

ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ.. కండలేరు లిఫ్ట్ కి కరెంటు బిల్లులు కట్టక 9 నెలలుగా ఆగిపోయిందని, సోమశిల దక్షిణ కాలువకు నీరు అందక మండలంలోని పలు గ్రామాల రైతులు అల్లాడుతున్నారన్నారు. గతంలో తాము కండలేరులో 8 టిఎంసిలు ఉన్నప్పుడు కూడా నీరు అందించామని, ప్రస్తుతం 12 టీఎంసీలు ఉన్న నీరు ఇవ్వలేకపోతున్నారన్నారు.

దుగ్గుంట – డేగపూడి నెం-1 బ్రాంచ్ కెనాల్ కింద 16 వందల ఎకరాలు నీరు లేక ఎండిపోతుందన్నారు. రైతుల సమస్యల పైన అవగాహనలేని కాకాణి, వ్యవసాయ మంత్రైతే ఇలాగే ఉంటుందన్నారు. మిచాంగ్ తుఫాన్ కారణంగా నష్టపోయిన ఎస్సీ, బీసీ, మైనారిటీలకు ఇంతవరకు నష్టపరిహారం అందలేదన్నారు.

నేషనల్ హైవే 67 బద్వేల్ నుంచి గురివిందపూడి వెళ్లే నాలుగు లైన్ల రహదారి భూ సేకరణకు సంబంధించిన నష్టపరిహారం పంపిణీ లో రైతులకు అన్యాయం జరిగిందన్నారు. మంత్రి కాకాణి వారికి సరైన నష్టపరిహారం ఇప్పించాల్సిన బాధ్యత ఉందన్నారు.తాము మంత్రిగా ఉన్నప్పుడు ప్రజల పక్షాన నిలబడ్డామన్నారు. మంత్రి కాకాణి పొజిషన్లో ఉన్నా,అపోజిషన్ లో ఉన్నా ఒకటేనన్నారు.

ఇసుక, గ్రావెల్, తెల్లరాయి లాంటి ప్రకృతి సంపదను దోచుకోవడం దాచుకోవడంలోనే ఆయన శ్రధ్ధ ఉంటుందని ప్రజా సమస్యల పైన ఉండదన్నారు. ఆయనలాగే పొదలకూరులో ఆయనకు కుడి, ఎడమ భుజాలుగా ఉన్న వైసీపీ నాయకులు అక్రమ లేఅవుట్ల పరంపర కొనసాగిసున్నారన్నారు.

పంట కాలువలను, కొండ పోరంబోకు ,ప్రభుత్వ భూములను ఆక్రమించి లే అవుట్లు వేస్తున్నారని తామ అధికారంలోకి రాగానే వాటిపై చర్యలు తీసుకుంటామన్నారు. రైతులకు నష్టం జరిగితే సహించమన్నారు. గ్రామంలోని ఎస్సీకాలనీలో దేవరపాటి హనుమంతు, నారాయణ, పెంచల నరసమ్మ,కామంచి రాములమ్మ,దేవరపాటి మారుతీ అనే రెండు కుటుంబాల వారు టీడీపీ పార్టీలో చేరారు.

ఈ కార్యక్రమంలో ఆర్.వై పాలెం టీడీపీ నాయకులు నల్లగంగు వెంకటేశ్వర రెడ్డి, అల్లం దశయ్య, మందపల్లి ప్రవీణ్ ,నల్లగంగు వినయ్ కుమార్ రెడ్డి ,అట్ల గోపాల్ రెడ్డి, జనసేన నాయకులు దాసినేటి అనిల్ కుమార్, బండి మనోజ్ కుమార్, పసుపులేటి ప్రసాద్ , మహేష్ ,చిలకల భాస్కర్, రాంబాబు ,రవి ,గిరీష్ ,టీడీపీ మండల అధ్యక్షులు తలచీరు మస్తాన్ బాబు, పట్టణ అధ్యక్షులు బొద్దులూరు మల్లికార్జున్ నాయుడు,ప్రధాన కార్యదర్శి కృష్ణ,బక్కయ్య నాయుడు ,పులిపాటి వెంకటరత్నం నాయుడు, అక్కెం సుధాకర్ రెడ్డి, కోడూరు పెంచల భాస్కర్ రెడ్డి ,బోగోలు భాస్కర్ రెడ్డి,రాజశేఖర్ రెడ్డి, జమీర్, సుగుణమ్మ,అరుణ పాల్గొన్నారు.

LEAVE A RESPONSE