నెల్లూరు నగరంలో “రా… కదలి రా” బహిరంగ సభ ఏర్పాట్లు పరిశీలించిన టీడీపీ నేతలు

తెలుగుదేశం పార్టీ నిర్వహించే బహిరంగ సభ “రా… కదలి రా” ఈ నెల 28 న నెల్లూరు నగరంలోని ఎస్.వి.జి.యస్. గ్రౌండ్ నందు జరగనుంది. టీడీపీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరు కానున్న ఈ బహిరంగ సభ ప్రాంగణ మైదానంను మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అధ్యక్షుడు షేక్ అబ్దుల్ అజీజ్,ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి లతో కలిసి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర పరిశీలించారు.

వీరితో పాటు కావలి నియోజకవర్గ మాలేపాటి సుబ్బానాయుడు, కోవూరు నియోజకవర్గ ఇన్చార్జి పొలంరెడ్డి దినేష్ రెడ్డి, చెంచల బాబు యాదవ్, తాళ్లపాక అనురాధ ,రాష్ట్ర కార్యదర్శులు జెన్నీ రమణయ్య, బొమ్మి సురేంద్ర, పమిడి రవికుమార్ చౌదరి, మలిశెట్టి వెంకటేశ్వర్లు, రాజా నాయుడు, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

కృష్ణపట్నం పోర్ట్ కంటైనర్ టెర్మినల్ ను కాపాడండి

– సోమిరెడ్డితో కంటైనర్ టెర్మినల్ ఉద్యోగులు
– అల్లీపురంలో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని కలసి వినతిపత్రం సమర్పణ
– కంటైనర్ టెర్మినల్ ను కృష్ణపట్నం పోర్టు నుంచి అదానీ కంపెనీ చెన్నైకి తరలిస్తోందని, ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మంది జీవనోపాధి కోల్పోతామని ఆవేదన .

Leave a Reply