– ఎగుమతులకు అడ్డంకులు తొలగింపు
– రష్యా, ఆస్ట్రేలియా మార్కెట్ల్లో ప్రవేశం సాధించడం రాష్ట్ర ఆక్వా రంగానికి మైలురాయి
– మంతెన సత్యనారాయణ రాజు
అమరావతి : రొయ్యలు సాగు చేసిన రైతు మీసం తిప్పేలా చేశారు… యువనేత నారా లోకేష్. ఒక వైపు యువత, మరోవైపు రైతుల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తున్న విషయం మంత్రి నారా లోకేష్ ఆస్ట్రేలియా పర్యటన ద్వారా మరోసారి స్పష్టమైందని మాజీ శాసనమండలి సభ్యుడు, సీఎం కార్యక్రమాల సమన్వయకర్త మంతెన సత్యనారాయణ రాజు అన్నారు. ఆక్వా రైతులు ఎగుమతులు లేక నష్టపోతున్న సమస్యను అధిగమించేందుకు ఆయన చేసిన కృషి అభినందనీయం. ఆక్వా రైతుల పట్ల మంత్రి నారా లోకేష్ బాబు నిబద్ధత, దూరదృష్టి వల్లే ఆంధ్రప్రదేశ్ ఆక్వా రైతులకు అంతర్జాతీయ మార్కెట్లో కొత్త అధ్యాయం ప్రారంభమైందని తెలిపారు.
ఆస్ట్రేలియా మార్కెట్లో ప్రవేశం సాధించడం రాష్ట్ర ఆక్వా రంగానికి మైలురాయిగా నిలిచింది. అమెరికా భారీ సుంకాలు, అనేక అడ్డంకుల మధ్య కూడా రెండు దేశాల ప్రభుత్వాల మధ్య సఖ్యత సాధించి, ఆక్వా రైతులకు కొత్త జీవం పోయడం ప్రశంసనీయం. ఇది భారతదేశానికే గర్వకారణం. ప్రభుత్వ చర్యలతో ఏపీ ఆక్వా రంగం ప్రపంచ చిత్ర పటంలో మరింత బలంగా నిలుస్తోంది…
కూటమి ప్రభుత్వం ఆక్వా రైతు క్షేమం కోసం కట్టుబడి ఉంది. ఆక్వా రైతులు ఆర్థికంగా బలంగా ఎదిగేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది. నేడు యువనేత చొరవతో అమెరికా సుంకాల కారణంగా ఆర్థికంగా కుదేలైన ఆక్వా రంగం, ఆక్వా రైతులకు ఆస్ట్రేలియా తీసుకున్న ఈ నిర్ణయం ఊరటనిచ్చిందని పేర్కొన్నారు.