సెలబ్రిటీతో సెల్ఫీ దిగిన మంత్రి మేకపాటి

ఎక్కడ నెగ్గాలో తెలిసిన మంత్రి మేకపాటి ఎక్కడ తగ్గాలో కూడా తెలిసినట్టుంది. నెల్లూరు జిల్లా తన సొంత నియోజకవర్గంలోని మర్రిపాడు లో జరుగుతున్న మండల సర్వసభ్య సమావేశంలో అదే మండలానికి చెందిన రవిచంద్ర అనే మరుగుజ్జు వికలాంగుడు మంత్రి వద్దకు వచ్చి తన సమస్య వివరించి పరిష్కారానికి మంత్రి నుండి హామీ పొందారు.. అనంతరం సార్ మీతో ఫోటో దిగాలి అని రవిచంద్ర మంత్రిని అడగగా కాదు నేనే నీతో ఫోటో దిగుతా అంటూ రవిచంద్ర పక్కన మరి కింద కూర్చొని అతని సెల్ ఫోన్ లో సెల్ఫీ తీసిన మంత్రి మేకపాటి.. మంత్రి మేకపాటి తనతో సెల్ఫీ ఫోటో దిగడం తో రవిచంద్ర సంతోషంతో పొంగిపోయాడు.

Leave a Reply